Tuesday 28 April 2020

మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ కాకుండా అడ్డుకోవడం ఎలా...?





 ఆండ్రాయిడ్ ఫోన్ లో యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ కాకుండా అడ్డుకోవడం ఎలా...?







ఆండ్రాయిడ్ బ్యాక్‌ గ్రౌండ్‌ యాప్స్ : 
మీ ఫోన్ లో భారీ మొత్తంలో RAM  ఉన్నప్పటికీ బ్యాక్ గ్రౌండ్ లో పెద్ద మొత్తంలో అప్లికేషన్స్ రన్ అవుతుంటే బ్యాటరీ త్వరగా ఖాళీ అవడంతో పాటు ఫోన్ పనితీరు మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే అప్లికేషన్స్ గురించి పూర్తి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.


బ్యాక్ గ్రౌండ్ లో ఎందుకు ఉంటాయి ?
Android ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసేఫోన్స్ విషయానికొస్తే ప్రధానంగా రెండు రకాల అప్లికేషన్స్ ఉంటాయి. 
1.  ఫోర్ గ్రౌండ్ అప్లికేషన్స్. అంటే మనం వీటిని ఓపెన్ చేసినప్పుడు మాత్రమే పనిచేస్తాయి. క్లోజ్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా నిలిచిపోతాయి. 
2.  బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్స్. ఇవి మనం క్లోజ్ చేసినప్పటికీ కూడా నిరంతరం బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకు Whatsapp, Facebook, Telegram వంటి అప్లికేషన్స్ పరిశీలిస్తే  మీరు ఎన్నిసార్లు క్లోజ్ చేసినా కూడా అవి నిరంతరం బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతాయి. కొత్తగా ఏమైనా మెసేజ్లు వస్తే ఆటోమేటిక్ గా చూపిస్తాయి.

అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకునే దాదాపు అన్ని అప్లికేషన్స్  వాటికి అవసరం ఉన్నా లేకపోయినా బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే పర్మిషన్ తీసుకుంటున్నాయి. ఉదాహరణకు ఒక వాల్పేపర్స్ అందించే అప్లికేషన్ కి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ పర్మిషన్ అవసరం లేదు. అయినప్పటికీ కూడా అది బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే విధంగా పర్మిషన్ తీసుకుంటోంది. అలాంటి అప్లికేషన్స్ గుర్తించి వాటిని బలవంతంగా మీరు కిల్ చేయొచ్చు.
ఏ అప్లికేషన్స్ ఎంత ఖర్చు పెడుతున్నాయి ?
మీ ఫోన్ లో ఉన్న RAM, ప్రాసెసింగ్ పవర్‌లను  మనకు తెలియకుండానే అప్లికేషన్స్ భారీ మొత్తంలో వినియోగించుకుంటూ ఉంటాయి.  ఈ నేపథ్యంలో అసలు ఏ అప్లికేషన్ ని ఎంత మొత్తంలో సిస్టం వనరులు వినియోగించుకుంటోంది  అన్నది తెలుసుకోవాలంటే ఒక టెక్నిక్ ఉంది. దీనికోసం ఇప్పుడు చెప్పిన విధంగా చేయండి.

Step 1:  మీ ఫోన్ లో Settings  ఓపెన్ చేయండి.

Step 2: About Phone  అనే ఆప్షన్ వెదికి పట్టుకోండి.

Step 3: Build Number  అనే అంశం మీద ఏడుసార్లు వరుసపెట్టి వేలితో ట్యాప్ చేయండి. ఇలా చేయడంతో మీ ఫోన్లో Developer Options  ఎనేబుల్ అవుతుంది.

ఆ తర్వాత ఫోన్ లోనే Settings  అనే విభాగంలోకి వెళ్లి, Developer Optionsని  ఎంపిక చేసుకుని, అందులో కనిపించే Running Services అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇప్పుడు వెంటనే స్క్రీన్ మీద మీ ఫోన్ లో ఎంత ర్యామ్ ఉంది,  ఏ అప్లికేషన్ ఎంత మొత్తంలో ర్యామ్ వాడుకుంటున్నాయి ఒంటి సమాచారం మొత్తం కనిపిస్తుంది. దీని బట్టి మీ ఫోన్లో ఎక్కువ మెమొరీ వాడుకుంటున్న వాటి గురించి తెలుస్తుంది.
 బ్యాక్ గ్రౌండ్ అప్లికేషన్స్ తొలగించడం ఎలా ?
పైన చెప్పిన పద్ధతిలో ఎక్కువ మెమొరీ వాడుకుంటున్న అప్లికేషన్స్ గుర్తించి వాటిని సెలెక్ట్ చేసుకుంటే వెంటనే ఆ  అప్లికేషన్ కి సంబంధించిన సెట్టింగ్స్ తో ఒక డైలాగ్ బాక్స్ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది. అందులో Stop అనే బటన్ ట్యాప్  చేయడం ద్వారా అది రన్ అవకుండా నిలిపి వేసుకోవచ్చు. కావాలంటే Force Stop కూడా చేయొచ్చు. ఇదే రకమైన పని మీకు మీరు స్వయంగా చేయకుండా ఆటోమేటిక్ గా జరిగి పోవాలంటే Greenify అనే  ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను ప్రయత్నించండి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top