Tuesday 31 March 2020

వెంటిలేటర్ అంటే ఏమిటి ? అది ఎలా పని చేస్తుంది ?



 వెంటిలేటర్ అంటే ఏమిటి ? అది ఎలా పని చేస్తుంది ?









ఊపిరితిత్తులు పనిచేయనంతగా వ్యాధి ముదిరినప్పుడు, శరీరానికి అవసరమైన శ్వాస అందించే పనిని వెంటిలేటర్లు చూసుకుంటాయి. వ్యాధితో పోరాడి, నయం అయ్యేందుకు అవసరమైన సమయాన్ని రోగి శరీరానికి ఇస్తాయి. ఇందుకు పలు రకాల వైద్యపరమైన వెంటిలేషన్‌ను ఉపయోగిస్తుంటారు.

(ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) లెక్కల ప్రకారం కరోనావైరస్ కారణంగా సోకుతున్న కోవిడ్-19 వ్యాధి బారినపడ్డ ప్రజల్లో 80 శాతం మంది ఆసుపత్రిలో చికిత్స అవసరం లేకుండానే కోలుకుంటున్నారు.

అయితే, ప్రతి ఆరుగురు రోగుల్లో ఒకరు మాత్రం తీవ్ర అనారోగ్యానికి గురై శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు). ఇలాంటి తీవ్రమైన కేసుల్లో కరోనావైరస్ ఊపిరితిత్తుల్ని పాడు చేస్తోంది. దీనిని శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ గుర్తించి, మరిన్ని రోగనిరోధక కణాలను పంపేలా రక్త నాళాలను విస్తరిస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తుల్లోకి రక్తం చేసి, ఊపిరాడటం కష్టమైపోతుంది. శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి. ఈ పరిస్థితి నుంచి శరీరాన్ని కాపాడేందుకు ఒక వెంటిలేటర్ మెషీన్ ఊపిరితిత్తుల్లోకి ఎక్కువ ఆక్సిజన్‌ను పంపిస్తుంది.

రోగి శరీర ఉష్ణోగ్రతకు సరిపోయేలాగా ఈ గాలికి వేడిని, తేమను జతచేసే హుమిడిఫైయర్ పరికరం కూడా ఈ వెంటిలేటర్‌లో ఉంటుంది. పేషెంట్ల శ్వాసను పూర్తిగా మెషీన్ నియంత్రిస్తుంది కాబట్టి వారి శ్వాసకోశ కండరాలు విశ్రాంతి తీసుకునేలాగా వైద్యం అందుతుంది. అయితే, స్వల్ప లక్షణాలున్న రోగులకైతే వెంటిలేషన్‌ను ఫేస్ మాస్కులు, ముక్కు మాస్కులు, నోటి మాస్కుల ద్వారా గాలిని, ఇతర వాయువుల మిశ్రమాన్ని ఊపిరితిత్తుల్లోకి పంపిస్తారు.

ఒక గొట్టం ద్వారా ఆక్సిజన్‌ను పంపించే హుడ్స్‌ ను కూడా కోవిడ్-19 రోగుల కోసం వాడుతుంటారు. శ్వాసలోని తుంపర్లతో గాలి ద్వారా సంక్రమించే వైరస్‌ల ప్రమాదాన్ని తగ్గించేందుకు ఈ తరహా విధానాన్ని ఉపయోగిస్తారు. దీన్నే బయటి నుంచి (నాన్ ఇన్‌వేసివ్) వెంటిలేషన్ ఇచ్చే విధానం అంటారు. ఈ విధానంలో గొట్టాలను రోగి గొంతులోకి పంపించాల్సిన అవసరం ఉండదు.

శ్వాస తీసుకునేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న రోగులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)ల్లోకి తీసుకెళ్లి వెనువెంటనే మెడికల్ వెంటిలేషన్‌పై పెడతారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గకుండా చూడటానికే సాధారణంగా వారు ఇలా చేస్తారు.

(ఇంటెన్సివ్ కేర్ సొసైటీకి చెందిన డాక్టర్ షాండిపోన్ లాహా బీబీసీతో మాట్లాడుతూ.. కోవిడ్-19 బారినపడిన చాలామంది పేషెంట్లకు మెషీన్ ద్వారా వెంటిలేషన్ అందించాల్సిన అవసరం పడదని, ఇంటివద్దనే వారికి చికిత్స అందించొచ్చని, లేదంటే ఆక్సిజన్ తీసుకునేందుకు మద్దతు అందించొచ్చని చెప్పారు.)

వెంటిలేటర్లను ఉపయోగించేప్పుడు దీర్ఘకాల ప్రభావాలతో బాధపడుతున్నది ఎవరో తెలియకపోవడం వంటి కొన్ని ప్రమాదాలు ఉన్నప్పటికీ పేషెంట్ల శరీరంలోకి ఆక్సిజన్ పంపించేందుకు ఏకైక మార్గం వెంటిలేటర్ అని ఆయన తెలిపారు.

''వెంటిలేటర్ అనేది ఒక సంక్లిష్టమైన భూతం. దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే రోగిని ప్రమాదంలో పడేస్తుంది. సాంకేతిక అంశాలు సవాళ్లతో కూడుకుని ఉంటాయి. వాటి గురించి అవగాహన ఉన్న మత్తుమందు నిపుణుల వంటి వారిని వాడుకోవచ్చు. నిజానికి వారికి ఉండే నైపుణ్యాలు భిన్నమైనవి. థియేటర్లో వారు కొంత మెరుగైన రోగుల్నే ఆపరేషన్ కోసం సిద్ధం చేస్తుంటారు. ఐసీయూల్లో ఉండే పేషెంట్ల ఆరోగ్యం మరింత దిగజారి ఉంటుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top