Dr.Y S R AROGYASRI HEALTH CARE TRUST - EHS - EHS BENEFICIARIES ELIGIBILITY CRITERIA
డా.వైఎస్ ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్
(గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్)
CIRCULAR
డా.వైఎస్ఆర్-ఏహెచ్ సిటి/ఇహెచ్ ఎస్/01/2020, తేదీ: 27-01-2020
XXXX
డా.వైఎస్ ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్
(గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్)
CIRCULAR
డా.వైఎస్ఆర్-ఏహెచ్ సిటి/ఇహెచ్ ఎస్/01/2020, తేదీ: 27-01-2020
విషయం :- డా. వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ - ఇహెచ్ఎస్ - EHS లబ్దిదారుల - అర్హత - ప్రమాణాలు - కమ్యూనికేషన్ - నమోదు.
సూచన: G.O.Ms.No.174, తేదీ: 01.11.2013
ఇహెచ్ఎస్ లభిదారులకు తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం లేదని, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు నమోదు అయ్యాయి. అర్హత లేని లబ్ధిదారులు ఇహెచ్ఎస్ ద్వారా నమోదు అవుతున్న కారణంగా కొన్ని సమస్యలు ఉత్పన్నమవు చున్నవి. కావున నెట్వర్క్ ఆసుపత్రుల అవగాహన మేరకు పైన పేర్కొన్న G.O ప్రకారం ఇహెచ్ఎస్ లబ్దిదారులకు అర్హత ప్రమాణాలు గురించి ఈ క్రింది విధంగా క్లుప్తంగా పేర్కొనడం జరిగింది.
ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆరోగ్య పథకాన్ని పొందటానికి సంబందించిన అర్హత వివరాలు ఈ క్రింది విధంగా తెలుపడం జరిగింది.
i. ఆధారపడిన తల్లిదండ్రులు (దత్తత తల్లిదండ్రులు లేదా అసలు తల్లిదండ్రులు; కానీ ఎవరో ఒక్కరు మాత్రమే)
ii. మగ ఉద్యోగి / సర్వీస్ పెన్షనర్ విషయంలో చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య.
iii. మహిళా ఉద్యోగి / సర్వీస్ పెన్షనర్ విషయంలో భర్త
iv. సర్వీస్ పెన్షనర్ల మరియు కుటుంబ పెన్షనర్లు వారి యొక్క డిపెండెంట్లు కూడా అర్హులు.
ఉద్యోగి మీద ఆధారపడటం ఈ క్రింది అర్ధాన్ని కలిగి ఉంది.
a. తల్లిదండ్రుల విషయంలో, వారి జీవనోపాధి కోసం ఉద్యోగిపై ఆధారపడిన వారు.
b. నిరుద్యోగ కుమార్తెల విషయంలో, అవివాహితులు లేదా వితంతువులు లేదా విడాకులు తీసుకున్న వారు లేదా భర్తచే విడిచి పెట్టబడిన వారు.
c. నిరుద్యోగ కుమారులు విషయంలో, 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.
d. వికలాంగ పిల్లలు, ఉపాధికి అనర్హత కలిగిన వారు.
ఈ విషయంలో, ఎంప్లాయీస్ 'హెల్త్ స్కీమ్ క్రింద ఎంపానెల్ చేయబడిన అన్ని నెట్వర్క్ ఆస్పత్రులు పైన పేర్కొన్న అర్హత ప్రమాణాల ప్రకారం మాత్రమే ప్రీఅత్ ను నమోదు చేయాలి. ట్రస్ట్ యొక్క జిల్లా కో-ఆర్డినేటర్లు ఇహెచ్ఎస్ లభిదారుల అర్హత ప్రమాణాల గురించి కౌన్సెలింగ్ పై మిత్రాస్ కు మరియు మెడ్కోలకు తగిన సూచనలు ఇవ్వాలి.
ముఖ్య కార్యనిర్వహణ అధికారి,
డా. వైఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్.
0 Post a Comment:
Post a Comment