విద్యార్థుల పేర్లు అమ్మఒడి లో రాకుంటే కారణాలు, వాటికి పరిష్కార మార్గాలు - మండల విద్యాశాఖ అధికారులు మరియు ఎం.ఆర్.సి సిబ్బంది అందరికీ అమ్మ ఒడి పథకం సూచన.
• అమ్మ ఒడి పథకం కింద రెండు , మూడవ జాబితాలో వచ్చిన తల్లి లేదా సంరక్షకుని వివరాలు క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా పంపించినవి. వాటిని ఎవరైనా ఈ పథకం కింద అర్హులమని గాని లేదా తమ పేర్లు జాబితాలో చోటు చేసుకోలేదని కానీ, వారి వివరాలలో తగిన ధ్రువపత్రాలను సేకరించి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో 5-1-2020 సాయంకాలం 5 గంటల లోపు అందజేయాలి.
• ఈ విధంగా అందజేసిన అర్హులైన ప్రతి ఒక్క తల్లి లేదా సంరక్షకులు ఈ కార్యక్రమం కింద తప్పనిసరిగా లబ్ధి పొందగలరు అని రాష్ట్ర కార్యాలయం తెలియజేసింది.
• కాబట్టి జనవరి 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు మనం వివరాలు అప్లోడ్ చేయుటకు తుది సమయం. కాబట్టి ప్రతి మండల విద్యాశాఖ తమ పరిధిలోని సిబ్బందితో సమన్వయం చేసుకొని ఈ తదుపరి కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేసి మరియు అప్లోడ్ చేయవలసి ఉన్నది.
• రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన జగన్ అమ్మ ఒడి అర్హతలు దారిద్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన తల్లి లేదా సంరక్షకులు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు ఎకౌంటు మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ కలిగి ఉండాలి .
• తెల్ల రేషన్ కార్డు లేని కుటుంబాల విషయంలో వారు నిరుపేద లేదా అర్హత కలిగిన కుటుంబాలకు చెందినవారు అవునో కాదో ఆరు అంకెల పరిశీలన ద్వారా అర్హతను నిర్ణయించి కూడా లబ్ధి చేకూరుతుంది.
• స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలలో చదువుతున్న ఆడపిల్లల మరియు వీధి బాలలకు ఈ పథకం వర్తిస్తుంది .
• అర్హత కలిగిన తల్లుల లేదా సంరక్షణ పిల్లల కనీస హాజరు డెబ్భై అయిదు శాతం పరిశీలించి ధృవీకరించు కావాల్సి ఉంటుంది.
• ఒక తల్లి కి ఎంతమంది పిల్లలు ఉన్నా తో సంబంధం లేకుండా ఏ తల్లిని లేదా సంరక్షకుని మాత్రమే లబ్ధిదారులుగా గుర్తిస్తారు .
• కొత్త రేషన్ కార్డు పొందడానికి నూతన అర్హతలు అమ్మవొడికి కూడా ఉంటాయి. అవి క్రింది విధంగా ఉన్నాయి .
• ఆదాయ పరిమితి : నెలవారి ఆదాయం గ్రామాలలో 10000, అర్బన్ ప్రాంతాల్లో 12,000.
• కుటుంబం యొక్క మొత్తం ల్యాండ్ హోల్డింగ్ (భూమి కలిగి ఉండటం) : ( ఈ రాష్ట్రం మొత్తం ఒకే క్రైటీరియా తీసుకోబడుతుంది) : మాగాణి భూమి మూడు ఎకరాలు కన్నా తక్కువ ఉండాలి, మెట్ట భూమి 10 ఎకరాలు కన్నా తక్కువ ఉండాలి, ఈ రెండూ కలిపి కూడా 10 ఎకరాలు కన్నా ఎక్కువ ఉండరాదు.
• ఎలక్ట్రిసిటీ వినియోగం (విద్యుత్ వినియోగం): ఒక కుటుంబము యొక్క విద్యుత్ వినియోగం 6 నెలల యావరేజ్ గా తీసుకున్నప్పుడు నెలకు 300 యూనిటీ ల కన్నా తక్కువ ఉండవలెను .
• అన్ని ప్రభుత్వ ఉద్యోగస్తులు మరియు పెన్షనర్స్ కు ఈ పథకం వర్తించదు.
• నాలుగు చక్రాల వాహనం ఉన్న వారికి ఈ పథకం వర్తించదు.
• ఈ పథకంలో టాక్సీ ట్రాక్టరు మరియు ఆటో ఉన్నవారిని మినహాయింపు ఉంటుంది .
• ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఈ పథకం వర్తించదు.
• మున్సిపల్ ఏరియాలో 750 స్క్వేర్ ఫీట్ కన్నా తక్కువ ఆస్తి కలిగి ఉన్నవారికి మాత్రమే పథకాన్ని కూడా వర్తిస్తాయి.
• కొత్త రేషన్ కార్డు నిమిత్తము కుటుంబాలకి అర్హత ఉద్దేశించబడింది అవే అమ్మ ఒడి పథకానికి కూడా వర్తిస్తాయి.
List-2 required re verification లో supporting documents తీసుకోనే విధానము :
• List-2&3ల లో ఏవైనా grievances ఉంటె 04.01.2020 సాయంత్రము 5 లోపు MRC లో submit చేయవలెను. ఆ తరువాత వచ్చినవి అనుమతించబడవు. కావున ఏ రోజుకారోజు grievances MRC లో submit చేయవలెను
• ఏ ఏ కారణముకి ఏమి జత చేయాలో చూడండి.
• 1. Electricity ఎలక్ట్రిసిటీ వినియోగం (విద్యుత్ వినియోగం): : ఇందులో రెండు రకాల సమస్యలు ఉన్నవి. అవి
• a) service no. వారికి సంబందించినదే కానీ అంత వాడకము లేదు: ఈ case లో ఆ service no. తో ఉన్నటువంటి చివరి 6 నెలల current బిల్లుల xerox లేదా AE గారి సంతకము గల నివేదిక కాని జత చేయాలి.
• b) service no. వారికి సంబందించినదే కాదు: ఈ case లో service no. వీరి కుటుంబముకి చెందినది కాదు అని AE గారు certify చేసినది జత చేయాలి. అసలు కరెంట్ లేకపోతే సంబంధిత అధికారి నుండి కనెక్షన్ లేదనే ధృవీకరణ పత్రము అప్లోడ్ చేయాలి.
• 2. Ration Card లేదు: ఈ case లో లబ్దీదారుకి ration card లేదు అని ఆ గ్రామ VRO గారు certify చేసినది జత చేయాలి.
• 3. Student Aadhar లేదు: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.
• 4. Four wheeler: ఈ case లో చూపించబడిన number గల వాహనము వీరిది కాదు అని సంబందిత అధికారి (RTO/MVI) certify చేసినది లేదా (ఈ లిస్ట్ లో టాక్సీ ట్రాక్టరు మరియు ఆటో ఉన్నవారిని వివరాలు ఉంటే ఆ వాహనం నంబరు ఫోటో తీసి ) లేదా online లోని నివేదిక తో పాటుగా self declaration జత చేయాలి. .
• 5. Govt Employee/ Pensioner: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.
• 6. Land details: ఈ case లో గ్రామములో లబ్దీదారు కుటుంబమునకి wet land: ...….. (విస్తీర్ణము)dry land: ....... (విస్తీర్ణము) ఇంత ఉంది అని సంబందిత VRO గారు certify చేసినది, వారి కుటుంబ సభ్యుల భూమి వివరముల పట్టాదారు పుస్తకము xerox లు(భూమి ఉన్నవారికి మాత్లమే) మరియు మా కుటుంబములో వారికి ఈ గ్రామములలో (గ్రామముల పేర్లు రాయాలి)తప్ప మరెక్కడా భూములు లేవని self declaration. ఇవన్నీ జతచేయాలి.
• ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అని పొరపాటుగా నమోదుచేస్తే డిక్లరేషన్ మరియు వెరిఫికేషన్ పత్రాలు అప్లోడ్ చేయాలి.
కావున ఈ విషయములో వెంటనే పై మార్గదర్శకాలు అనుగుణంగా పని చేయవలసిందిగా కోరుచున్నాము.
0 Post a Comment:
Post a Comment