FAC (Full Additional Charge) ALLOWANCE - FAC అలవెన్సు
📌 విద్యాశాఖలో చాలామంది టీచర్లు, హెచ్ఎంలు పూర్తి అదనపు బాధ్యతలతో FAC హెచ్ఎంలుగా, FAC MEOలుగా పనిచేస్తున్నారు.
📌 ఇలా Full Additional Charge (FAC) బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారికి FR 49 ప్రకారం FAC అలవెన్సు చెల్లిస్తారు.
📌 14 రోజులకు మించి పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించినప్పుడు మాత్రమే FAC అలవెన్సు చెల్లిస్తారు.
📌 మొదటి మూడు నెలలు 1/5 వంతు పే అండ్ అలవెన్సుస్ ని FAC అలవెన్సు గా చెల్లిస్తారు.
📌 తదుపరి మూడు నెలలు 1/10 వంతు పే అండ్ అలవెన్సుస్ చెల్లిస్తారు.
📌 ఒకరోజు గ్యాప్ తో మళ్ళీ అదనపు బాధ్యతలు చేపడితే... మళ్ళీ మొదటి మూడు నెలలు 1/5 వంతు, తదుపరి మూడు నెలలు 1/10 వంతు పే అండ్ అలవెన్సులను FAC Allowance గా చెల్లిస్తారు.
📌 మొదటి మూడు నెలల FAC అలవెన్సు మంజూరు ఉత్తర్వులు Head of Department (HoD)లు జారీచేస్తారు. అయితే, పాఠశాల విద్యాశాఖలో పనులు సత్వరం కావాలన్నా సదుద్దేశ్యంతో HoD ఐన కమీషనర్ Rc No 1827/C3-2/2009 తేదీ: 25.11.2010 ద్వారా తనకున్న ఈ అధికారాలను RJD(SE)లకు బదలాయించినందున,మొదటి మూడు నెలల FAC అలవెన్సు మంజూరు ఉత్తర్వులు RJD(SE)లు జారీచేస్తున్నారు.
📌 Next Three Months FAC అలవెన్సు మంజూరు ఉత్తర్వులను మాత్రం ప్రభుత్వమే జారీచేస్తుంది.
📌 పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించిన వారిలో చాలా మంది స్కూల్ అసిస్టెంట్లు, హైస్కూల్ హెచ్ఎంలు, ఎంఈవోలు కేవలం మొదటి మూడు నెలల FAC అలవెన్సు పొంది, Next Three Months FAC అలవెన్సు మంజూరుకు దరఖాస్తు కూడా పెట్టడంలేదని తెలుస్తోంది. అలాంటి వారంతా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
📌 ఒక హైస్కూల్ హెడ్మాస్టర్ ఒక మండలానికి FAC MEO గా పనిచేసిన పిదప,కొన్ని రోజులు లేదా నెలల విరామంతో అదే మండలానికి లేదా వేరే మండలానికి FAC MEOగా పనిచేస్తే, రెండు (విడతలు) మండలాల్లో FAC అలవెన్సు చెల్లించాల్సిందే! వేర్వేరు పీరియడ్లో ఒకటికి మించి కార్యాలయాల్లో పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తే,ప్రతి పూర్తి అదనపు బాధ్యతలకు మొదటి మూడు నెలలు 1/5 వంతు, తదుపరి మూడు నెలలు 1/10 వంతు FAC అలవెన్సు విధిగా చెల్లించాల్సిందే! ఇలా ఒకటికి మించి అదనపు బాధ్యతలను వేర్వేరు సమయాల్లో నిర్వర్తించిన హెచ్ఎంలు/ఎంఈవోలకు FAC అలవెన్సు మంజూరుకు పైఅధికారులకు ప్రతిపాదనలు పంపడానికి . నిబంధనల మేరకు నడుచుకోవాల్సిందే!
0 Post a Comment:
Post a Comment