నేటి సూర్యగ్రహణం - షష్ట గ్రహ కూటమి : వివిధ రాశుల వారికి గ్రహణ ఫలిత ప్రభావం
ఈ గ్రహణం భారతదేశం అంతటా కనిపిస్తుంది. ఇది ధనుస్సురాశిలో సంభవిస్తుంది. ఈ గ్రహణాన్ని జన్మరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ధనస్సు రాశి వారు, అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృషభ రాశి వారు, అర్ధాష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కన్య రాశి వారు చూడకపోవడం మంచిది. అంటే గ్రహణ సమయం లో ఉండే చెడు కిరణాలకు దూరంగా ఉండటం, అంతే తప్ప టీవీలోనూ మొబైల్లో గ్రహణాన్ని చూడకూడదని కాదు. మిగతా రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం పెద్దగా ఉండదు. ఇక్కడ గ్రహణ ప్రభావం అంటే అనుకూల ఫలితాలు లేకుండా ఉండడం తప్ప ఏదో చెడు జరుగుతుంది మరేదో కీడు సంభవిస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ గ్రహణం అయినా దాని ప్రభావం అనేది చాలా తక్కువ పాళ్లు మాత్రమే మనపై ఉంటుంది. అంతే తప్ప దీని కారణంగా ఏదో ఆపద వస్తుందని, సమస్యలు వస్తాయని భయపడాల్సిన అవసరం లేదు.
సూర్యుడు వ్యక్తిత్వానికి, సాత్విక గుణానికి కారకుడు. రాహువు అహంకారానికి, తమోగుణానికి కారకుడు ఈ రెండింటి కలయిక మనిషి వ్యక్తిత్వం పై ప్రభావం చూపిస్తుంది కాబట్టి గ్రహణ సమయంలో చెడు స్థానాల్లో గ్రహణం సంభవిస్తున్న వారు చూడకూడదని మన పూర్వీకులు సూచించారు. అయితే ఈ ప్రభావం అనేది చాలా తక్కువ శాతం మాత్రమే మనపై ఉంటుంది ఎందుకంటే ఏ వ్యక్తి పైన అయినా కూడా అతను పుట్టిన సమయానికి ఉన్న జాతక ప్రభావం అనేదే ఎక్కువ ఉంటుంది తప్ప గ్రహణ ప్రభావం కాదు, అది జీవితాన్ని ప్రభావితం చేయదు.
షష్ట గ్రహ కూటమి-సూర్య గ్రహణం వలన ఏర్పడే ఫలితాలు. డిసెంబర్ 25 సాయంత్రం గం.5-30ని.ల నుంచి 27వతేదీ రాత్రి గం.11-40ని.ల వరకు (షష్టగ్రహ కూటమి) రవి, చంద్ర,బుధ, గురు, శని,కేతువులు ధనూరాశిలో ఉంటారు.
↪ మేష రాశి వారికి ఈ గ్రహణం 9వ స్థానంలో సంభవిస్తున్నది వీరికి ఇది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది..
↪ వృషభ రాశి వారికి 8వ స్థానంలో ఈ గ్రహణం సంభవిస్తున్నది. అష్టమ స్థానం అనుకోని సమస్యలకు అవమానాలకు అలాగే ఆర్థిక సమస్యలకు కారణమైనది కాబట్టి తొందరపాటు పోకుండా ఉండటం వలన సమస్యల నుంచి దూరం కావచ్చు.
↪ మిధున రాశి వారికి ఈ గ్రహణం ఏడవ ఇంట్లో సంభవిస్తున్నది. సూర్య గ్రహణం వ్యక్తిత్వం మీద ప్రభావం చూపిస్తుంది.
↪ కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం ఆరవ ఇంట సంభవిస్తుంది. ఇది అనుకూల స్థానం కాబట్టి కొంత అనుకూల ఫలితాలు ఏర్పడుతుంది.
↪ సింహ రాశి వారికి ఈ గ్రహణం పంచమ స్థానంలో సంభవిస్తున్నది. పంచమ స్థానం బుద్ధికి, సంతానానికి అలాగే మనలోని సృజనాత్మకతను కారకత్వం వహిస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది.
↪ కన్య రాశి వారికి ఈ గ్రహణం నాలుగవ ఇంట సంభవిస్తుంది. చతుర్ధ స్థానం సుఖానికి వాహనాలకు స్థిరాస్తులకు కారకత్వం వహిస్తుంది. ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.
↪ తులా రాశి వారికి ఈ గ్రహణం మూడవ సంభవిస్తుంది. ఇది ఇది అనుకూల స్థానం అవటం వలన మానసికంగా శారీరకంగా అనుకూలంగా ఉండటం మొదలైన ఫలితాలు సంభవిస్తాయి.
↪ వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణం రెండవ ఇంట సంభవిస్తున్నది. ద్వితీయ స్థానం ధనానికి కుటుంబానికి మాటకు కారకత్వం వహిస్తుంది. కాబట్టి గొప్పలకు పోయి అనవసర వాదాలకు దూరంగా ఉండండి.
↪ ధను రాశి వారికి ఈ గ్రహణం ఒకటవ ఇంట సంభవిస్తున్నది. దీని కారణంగా ఏ నిర్ణయం తీసుకునే ముందు అయినా లేదా ఏ పని చేసే ముందు అయినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేయడం మంచిది.
↪ మకర రాశి వారికి ఈ గ్రహణం 12 పన్నెండవ ఇంట సంభవిస్తున్నది. ఈ రాశివారు ఖర్చుల విషయంలో పెట్టుబడుల విషయంలో తొందరపాటు పోకుండా ఆలోచించి అడుగు వేయడం మంచిది.
↪ కుంభ రాశి వారికి ఈ గ్రహణం 11వ ఇంట సంభవిస్తున్నది. ఇది లాభ స్థానం కావటం వలన అనుకూల ఫలితాముంటాయి.
↪ మీన రాశి వారికి ఈ గ్రహణం పదవ ఇంట సంభవిస్తున్నది. దశమ స్థానం వృత్తికి పేరు ప్రతిష్టలకు కారకత్వం వహిస్తుంది.
ఇది భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి మనదేశంలో నివసించేవారు గ్రహణానికి సంబంధించిన కొన్ని ఆచారవ్యవహారాలను పూజలను నియమాలను పాటించాల్సి ఉంటుంది. భారతదేశంలో పుట్టి వేరే దేశంలో అంటే ఈరోజు గ్రహణం సంభవించని దేశాల్లో ఉన్నవారు ఏ రకమైన నియమాలు పాటించడం అవసరం లేదు. ఈ గ్రహణం ధనురాశిలో మూలా నక్షత్రంలో ఏర్పడుతుంది. కాబట్టి ధను రాశిలో జన్మించిన వారు వారికి జన్మరాశిలో గ్రహణం కాబట్టి వారు, మకర రాశి జన్మించిన వారికి పన్నెండవ ఇంట గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వారు, కన్య కన్య రాశి వారికి నాలుగవ ఇంట గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వారు అలాగే వృషభ రాశి వారికి ఎనిమిదవ ఇంట గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వారు ఈ గ్రహణాన్ని చూడకపోవడం మంచిది. ఈ గ్రహణం ఉదయం ఎనిమిది గంటల 9 నిమిషములకు ప్రారంభమై గ్రహణం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు గ్రహణం పూర్తవుతుంది. భోజనాలు 25వ తేదీ రాత్రి 8 లోపు అంటే 12 గంటల ముందు పూర్తి చేయాల్సి ఉంటుంది. అనారోగ్య పీడితులు పిల్లలు గర్భిణీలు రాత్రి పది లోపు భోజనం చేయాల్సి ఉంటుంది. తిరిగి గ్రహణం అయ్యాక భోజనం చేయాలి.
0 Post a Comment:
Post a Comment