Saturday, 21 December 2019

రాయలసీమలో ఉన్న అద్భుత ఏకశిలా కోదండ రామాలయం.....ఒంటిమిట్ట



రాయలసీమలో ఉన్న అద్భుత ఏకశిలా కోదండ రామాలయం.....ఒంటిమిట్ట

బమ్మెర పోతన నడియాడిన గడ్డ...చరిత్ర మొదలయ్యిందే ఈ గడ్డ మీద....చోళుల అత్యద్భుత శిల్పకళా నైపుణ్యం ప్రాచీన కాలపు చరిత్ర గుర్తులు నేటికి ఒంటిమిట్ట లో కనిపిస్తాయి...

రాయలసీమ కు మాత్రమే సొంతమైన అద్భుతమైన వాతావరణం ..పిల్లగాలులు..లోయల సౌందర్యం..
ఒంటిమిట్ట సొంతం...

పాల కొండల సుందర పచ్చదనపు హొయలు ఒంటిమిట్ట సొంతం... దేశంలో వున్న మొదటి మూడు రామాలయాల్లో ఒంటిమిట్ట రామాలయం ఒక్కటి...

భారతదేశానికి రాయలసీమ ఒంటిమిట్ట రామాలయం.. కడప జిల్లా... ఒంటిమిట్ట ఏక శిలానగరం..

కడపనుంచిరాజంపేటకువెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది.

ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఉన్నకోదండ రామాలయంలోనివిగ్రహాన్ని
జాంబవంతుడుప్రతిష్టించాడు. ఒకే శిలలోశ్రీరామున్ని సీతను లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్ధము ఉంది సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడినది. గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది.
ఫ్రెంచియాత్రికుడు టావెర్నియర్ 16వ శాతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు. గ్రామ చరిత్ర ఒక మిట్ట పైన ఈ రామాలయం నిర్మించబడింది. అందుకని ఒంటిమిట్ట అని ఈ రామాలయానికి, గ్రామానికి పేరు వచ్చింది. ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఇక్కడ రాముణ్ణి కొలిచి తమ వృత్తిని మానుకుని నిజాయితీ గా బ్రతికారని, వారి పేరు మీదుగానే ఒంటిమిట్ట అని పేరు వచ్చిందని ఇంకొక కథనం కూడ ఉంది.

మిట్టను సంస్కృతంలో శైలమంటారు.ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశైలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతే గాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం గావించాడు. దాన్ని బట్టి, భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు. ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు. కాబట్టి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది. హనుమంతుడు లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటే.

ఈ గ్రామాన్ని గురించి తొలి తెలుగు యాత్రాచరిత్రయైన కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావనలున్నాయి. ఆ గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రలో భాగంగా మజిలీలైన అత్తిరాల నుంచి భాకరాపేట వెళ్ళే మార్గమధ్యలో ఒంటిమిట్టను దాటి వెళ్ళారు. దీనివల్ల 1830 నాడు గ్రామ స్థితిగతులు తెలియవస్తున్నవి. అప్పటికి గ్రామంలో నాల్గుపక్కల కొండలే కలిగిన భారీ చెరువున్నది. చెరువు కట్టమీద ఉన్న బాటపైనే వారి ప్రయాణం సాగింది. ఆ ఒంటిమిట్టలో చూడచక్కనైన గుళ్ళు ఉన్నాయన్నారు. గ్రామంలో ఓ ముసాఫరుఖానా(యాత్రికుల నిలయం) ఉండేదని, అప్పటికే అది బస్తీ గ్రామమని పేర్కొన్నారు.

 ఒంటిమిట్ట పేరులో ఒంటి పూర్వపదం, మిట్ట ఉత్తరపదం. వీటిలో మిట్ట అనే ఉత్తరపదానికి ఎత్తైన భూప్రదేశాన్ని సూచించే జనావాసం అన్న అర్థం ద్యోతకమౌతోంది.

స్థల పురాణంఒంటిమిట్ట కోదండరామాలయ సముదాయము రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు,విశ్వామిత్రుడువారిని తమయాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగిమహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ట చేశారనీఇక్కడ ప్రజల విశ్వాసం.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top