సూర్య గ్రహణం - డిశంబర్ 26, 2019
ఈనెల 26వ తేదీ అంటే డిసెంబర్ 26, 2019, గురువారం రోజున మూలా నక్షత్రంలో ధనుస్సు రాశిలో త్రిపాదాధిక కేతు గ్రస్త కంకణ ఆకార సూర్య గ్రహణం సంభవిస్తున్నది. గ్రహణ సమయాలు ఒకసారి పరిశీలిస్తే భారత కాలమానం ప్రకారం స్పర్శ కాలం ఉదయం 8 గంటల 9 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. మధ్యకాలం ఉదయం తొమ్మిది గంటల 31 నిమిషములకు, మోక్ష కాలం ఉదయం 11:11 నిమిషములకు అవుతుంది. మొత్తం పుణ్యకాలం సమయం మూడు గంటల రెండు నిమిషాలు. ఈ గ్రహణం భారతదేశం అంతటా కనిపిస్తుంది.
ఇది ధనుస్సురాశిలో సంభవిస్తుంది. ఈ గ్రహణాన్ని జన్మరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ధనస్సు రాశి వారు, అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృషభ రాశి వారు, అర్ధాష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కన్య రాశి వారు చూడకపోవడం మంచిది. అంటే గ్రహణ సమయం లో ఉండే చెడు కిరణాలకు దూరంగా ఉండటం.
మిగతా రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం పెద్దగా ఉండదు. ఇక్కడ గ్రహణ ప్రభావం అంటే అనుకూల ఫలితాలు లేకుండా ఉండడం తప్ప ఏదో చెడు జరుగుతుంది మరేదో కీడు సంభవిస్తుందని భయపడాల్సిన అవసరం లేదు.
గ్రహణం సమయంలో నెగటివ్ రేస్ భూమి పైన ఉంటుంది రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి త్వరగా అనారోగ్యం వస్తుంది, అలాగే ఆ సమయంలో తిన్న ఆహారం జీర్ణించుకునే శక్తి శరీరానికి ఉండదు...స్పేస్ నుండి నిత్యం కాస్మిక్ ఎనర్జీ వస్తూ ఉంటుంది గ్రహణం సమయం లో అది రాదు, బాక్టీరియా ఎక్కువ ఉంటుంది నెగటివ్ రేస్ గుడిలో యంత్రాన్ని తాకకూడదు అని గుడి మూసేస్తారు...అలాగే ఆ టైం లో మంత్రం జపం చేసే వాళ్లకు ఆ నెగటివ్ ఎనర్జీ ప్రభావం ఉండదు, గ్రహణం వదిలాక గుడిలో కి ఎంత తలుపులు మూసిన నెగటివ్ పవర్ ఉంటుంది అందుకే ప్రతి అంగుళం సుద్ది చేస్తారు, మన శరీరాలు కూడ ఆ నెగటివ్ బాక్టీరియా ఎఫిర్ట్ కాకుండా స్నానం చేయాలి.
దర్బ కు నెగటివ్ పవర్ ని దూరం చేసే గుణం ఉంది. దర్బ వేయడం వల్ల ఆహారంలో కి వచ్చే నెగటివ్ బాక్టీరియా ని అది ఆకర్షిస్తుంది. తర్వాత అది తీసి పడేయాలి
గ్రహణ సమయంలో వివిధ రూపాల్లో దేవతా రూపాలు ఉండదు దైవ శక్తి దుష్ట శక్తి అన్ని శక్తులు అమ్మవారి ఆధీనంలో ఉంటుంది అప్పుడు ఆమె రూపం దుర్గ సృష్టిని రక్షించే రూపం, ఆమెకు ఏ గ్రహ నియమాలు ఉండదు అయితే గుడిలో యంత్రం ఉంటుంది కనుక ఆ యంత్ర శక్తిని నెగటివ్ పవర్ ఆకర్షించ కుండా అమ్మవారి గుడి కూడా ముస్తారు .. ఉపదేశం ఉన్నా లేకున్నా గ్రహణ సమయంలో దుర్గా నామ జపం ఎంతో శక్తిని అనుగ్రహాన్ని ఇస్తుంది..ఆ సమయంలో లోకాలను రక్షించ డానికి ఆమె విశ్వప్రాణ శక్తిని రక్షిస్తూ ఉంటుంది ఆ సమయంలో చేసే మంత్ర జపం ఎక్కడ జరుగుతూ ఉన్నా అదంతా కూడా ఆ తల్లి స్వయంగా స్వీకరిస్తుంది కనుక అధిక మైన ఫలితం ఉంటుంది, గ్రహణ సమయంలో గాయత్రి జపించరు, అలాగే ఏ మంత్ర జపం అయినా ఆమె కే చెందుతుంది, ఆమె దృష్టి వారి పైన పడుతుంది.
గర్భవతులకు పిండం ఎదుగుతున్న సమయం కనుక వారి శరీరానికి నెగటివ్ పవర్ ని తట్టుకునే శక్తి ఉండదు.. రోగ నిరోధక శక్తి గర్బములో ఉన్న బిడ్డ కోల్పోతారు అందుకే ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తుంది అని వారిని బయటకు వెళ్ళనీయరు.
గ్రహణం సమయంలో చేసే జపం కానీ దానం కానీ అనేక రేట్లు ఫలితం ఉంటుంది.. గ్రహణ సమయంలో దానం తీసుకునే వారికి కూడా శుభమే కలుగుతుంది.
గ్రహణం పెట్టె సమయానికి విడిచిన తర్వాత పట్టు విడుపు స్నానం చేయాలి, మంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళు జపం చేయడం అధిక ఫలితం ఉంటుంది, అలాగె మంత్రోపదేశం లేని వారు కూడా కుల దేవత నామ స్మరణ చేయడం మంచిది. అనారోగ్యంతో ఉన్న వారు తినకుండా ఉండలేరు కనుక గ్రహణం పట్టక ముందే తినడం మంచిది, ఆరోగ్యం గా ఉన్న వారు గ్రహనంకి 6 గ ముందు నుండి ఆహారం తీసుకోకూడదు . గ్రహణం విడిచాక తల స్నానం చేసాకే ఇల్లు, దేవుళ్ళు శుభ్రం చేసి దీపం పెట్టుకోవాలి.
0 Post a Comment:
Post a Comment