Sunday 3 November 2019

DETAILED INFORMATION OF ANDHRA PRADESH GOVERNMENT LIFE INSURANCE - ఆంధ్రప్రశ్ ప్రభుత్వోద్యోగుల భీమా పాలసీ (APGLI)




ఆంధ్రప్రశ్ ప్రభుత్వోద్యోగుల భీమా పాలసీ (APGLI)

ANDHRA PRADESH GOVERNMENT LIFE INSURANCE









"APGLI" గురించి ప్రతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగి ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయం.

LIC, PLI ల కంటే APGLI మంచిదని  చాలా మందికి తెలియదు. LIC, PLI ల గురించి ఏజెంట్లు వివరిస్తారు, కాబట్టి వాటి గురించి కొంత అవగాహన ఉంటుంది. కానీ APGLI గురించి మనకు ఎవరూ చెప్పరు, ఏదో APGLI మంచిది అంటారు కాని పూర్తి సమాచారం తెలియదు.

ఇప్పడు APGLI గురించి తెలుసుకుందాం. ఉదాహరణకు 2009 లో ఉద్యోగంలో భర్తీ అయినప్పుడు మన APGLI చందా 350/- ఉండేది, దానికి అందరికీ 'A' బాండ్ వచ్చింది,  2015 PRC తో జీతం పెరగ్గానే ఇంకో 300/- పెరిగి చందా 650/- అయ్యింది. పెరిగిన 300/- ల కి 'B' బాండ్ వచ్చింది. కొందరికి ఇంకా A బాండ్ కూడా రాలేదు. ఇంకొందరు అయితే A లేక B బాండ్ కోసం దరఖాస్తు కూడా పెట్ట లేదు, దరఖాస్తు పెట్టాలనే విషయం కూడా కొందరికి తెలియదు. కొందరు APGLI గురించి అవగాహన ఉన్న వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి చందాను పెంచుకున్నారు. దానికి పెరిగిన మొత్తానికి మళ్ళీ బాండ్ లు వస్తాయి.  ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం APGLI అమౌంటుని పెంచుకుంటామో, అది జీతంలో కట్ అయి పే స్లిప్ రాగానే వెంటనే ప్రపోసల్ ఫామ్ తీసుకుని బాండ్ కోసం దరఖాస్తు చేయాలి.

అది ఎందుకో ఒక ఉదా. మన తోటి ఉద్యోగి కానిస్టేబుల్ ఒకతను... అందరూ APGLI మంచిది అని చెప్తే తన చందా 350/- కి 2650/- కలిపి 3000/- చేశాడు. కానీ B బాండ్ కోసం దరఖాస్తు చేయలేదు. దరఖాస్తు చేయాలనే విషయం కూడా అతనికి తెలియదు, ఎవరూ చెప్పలేదు. అలా రెండున్నర సం.లు గడిచిపోయాయి, దురదృష్టం వల్ల అతను ప్రమాదంలో మరణించాడు. మరణానంతరం అతనికి రావాల్సిన అన్ని బెనిపిట్స్ తో పాటు APGLI బెనిపిట్స్ కూడా వచ్చాయి, కానీ 350/ రూ.ల 'A' బాండ్ బెనిపిట్స్ మాత్రమే వచ్చాయి, రూ 2650/ ల బెనిపిట్స్ అతనికి రాలేదు. ఎందుకంటే అతను 'B' బాండ్ కోసం దరఖాస్తు చేయలేదు. కాని నెల నెలా రూ 2650/లు అతని జీతం నుండి కట్ అయి అతని APGLI ఖాతాలో కలిసాయి. కానీ 'B' బాండ్ కోసం దరఖాస్తు చేయకపోవడం వల్ల 2650 'B' బాండ్ బెనిపిట్స్ రాలేదు, నెల నెలా కట్ అయిన 2650 రెండున్నర సంవత్సరాల మొత్తాన్ని మాత్రం అతనికీ వాపసు చేశారు. అతను 'B' బాండ్ కి దరఖాస్తుకు చేయకపోవడం వల్ల అతని కుటుంబం ఎన్ని లక్షల రూ. నష్టపోయిందో చూడండి.

APGLI పాలసీలో.... ఉద్యోగి యొక్క వయస్సుని బట్టి అతను కట్టే ప్రీమియంకు రేటు నిర్ణయిస్తుంది ప్రభుత్వం. అంటే... 21 సం.ల వయస్సు నుండి 53 సం.ల వయస్సు వరకు (53 సం"ల వయస్సు తర్వాత APGLI వర్తించదు) ఈ వయస్సును బట్టి మనం కట్టే ప్రీమియం రూ.లకు  మనకు బాండ్ వాల్యూ నిర్ణయించబడుతుంది.

ఉదా. ఇప్పడు నా వయస్సు 29 సం.లు. నేను 4000 రూ.ల ప్రీమియం కడితే నేను కట్టిన ఒక్కోరూపాయికి ప్రభుత్వం 29 సంవత్సరాల తర్వాత రూ 329-50 పైసలు ఇస్తుంది. అంటే 4000x329.50 = 13,18,000 రూ.లు. అక్షరాల 13 లక్షల 18 వేల రూపాయలు నా బాండ్ వాల్యూ. 29 సం.ల వయసున్న నాకు ఇంకా 29 సం.ల సర్వీసు ఉంది, ఈ సర్వీసు కాలం 29 సం.లకు నా బాండ్ వాల్యూ రూ 13,18,000 లకు సంవత్సరానికి 10% బోనస్ ఇస్తుంది. అంటే 1318000 X 290% = 3822200/- అక్షరాల రూ 38 లక్షల 22 వేల 200 లు పదవీ విరమణ సమయంలో బోనస్ గా వస్తుంది. మరియు బాండ్ వాల్యూ + బోనస్ కలిపి అంటే 13,18,000 + 38,22,200 = 51,40,200/- అక్షరాలా 51 లక్షల 40 వేల 200 రూపాయల వరకు (కొంచం అటూ ఇటుగా) పదవీ విరమణ సమయంలో వస్తుంది.
 ఇది మీరు నమ్మగలరా....?

మనం కట్టే నెల నెలా 4000 లు 29 సం.లకి 13,92,000 మాత్రమే... కానీ 58 సం.ల వయస్సులో అరకోటి పైగా వస్తుంది. LIC కాదు, PLI కాదు ఏ భీమా కంపెనీ కూడా ఇంత పెద్ద మొత్తం ఇవ్వదు, ఒక APGLI మాత్రమే ఇస్తుందని ఘంటాపథంగా చెప్పగలం. ఇది నిజం ఎందుకంటే... వేరే భీమా కంపెనీలు వేల మంది ఉద్యోగులకు జీతాలివ్వాలి, ఏజెంట్లకు కమీషన్ లు ఇవ్వాలి, అవన్నీ ఎక్కడి నుండి ఇస్తాయి మనం కట్టే డబ్బుల నుండే కదా.... మళ్ళీ లాభాలు రావాలి.

APGLI ప్రభుత్వాదినిది, దీంట్లో వచ్చే లాభాలు ఎవరూ పంచుకోరు, ప్రభుత్వం దీని నుండి రాబడి ఆశించదు. అందువల్ల ఉద్యోగులకు ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది.

మరణించిన మన తోటి ఉద్యోగి కానిస్టేబుల్  అతని 25 సం.ల వయస్సులో రూ2650/- కి అతని చందా పెంచి, 'B' బాండ్ కి దరఖాస్తు చేయకపోవడం వల్ల, 28 సం.ల వయస్సులో అతను మరణించడం వల్ల  అతని కుటుంబం కోల్పోయిన మొత్తం రెండున్నర సం.ల బోనస్ తో కలిపి ఎంతో తెలుసా? అక్షరాలా రూ 12 లక్షల 38 వేల 610 లు. ఇది ఎవరూ ఆర్చలేని, తీర్చలేని నష్టం. అతను తెలియక చేసిన తప్పును మనం ఎవరమూ చేయకూడదు.

ఇప్పుడు వయస్సుల వారిగా మనం కట్టే రూపాయికి ప్రభుత్వం ఇచ్చే బాండ్ వ్యాల్యూస్ చూడండి. APGLI చందాను మీ సామర్థ్యాన్ని బట్టి ఎంత పెంచాలో నిర్ణయించుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళండి.

Age     -     Rate

25        -     389.50
26        -     374.10
27        -     359
28        -     344.10
29        -     329.50
30        -     315.10
31        -     301
32        -     287.20
33        -     273.60
34        -     260.30
35        -     247.30

ఇలా 53 సంవత్సరాల వరకు పాలసీ రేట్లు ఉంటాయి. చూడండి మిత్రులారా! వయస్సు పెరిగే కొద్దీ ప్రభుత్వం ఇచ్చే వెల తగ్గుతుంది. ఎందుకంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ మనిషికి జీవితంలో రిస్క్ పెరుగుతుంది. అందుకని ఏ జీవిత భీమా కంపెనీ అయినా వయస్సును బట్టి పాలసీని నిర్ణయిస్తాయి.

తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి అయినా ఉండాలి లేదంటే యవ్వనంలో చేసిన APGLI బీమా పాలసీలైనా ఉండాలి అని. చిన్న వయస్సులోనే పాలసీ చేస్తే  చాలా ఎక్కువ భీమా అమౌంట్ మనకు వస్తుంది. అందుకని ఆలస్యం చేయకండి

APGLI ప్రీమియం పెంచని వాళ్ళు పెంచండి, పెంచిన వాళ్ళు బాండ్ లకి దరఖాస్తు చేయండి.

ఈ సమాచారాన్ని అన్ని బ్యాచ్ ల మితృలకు తెలియజేసి వాళ్ళతో  APGLI అమౌంట్ పెంచుకోమని చెప్పండి. అలాగే సీనియర్స్ కి కూడా తెలియజేయండి.





CLICK HERE TO VIEW / DOWNLOAD YOUR APGLI DETAILS

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top