Instructions for Teachers to follow when Pupils Listening to Radio Lessons
(రేడియో పాఠాలు వినిపించేటపుడు ఉపాధ్యాయులు అనుసరించవలసిన సూచనలు)
(రేడియో పాఠాలు వినిపించేటపుడు ఉపాధ్యాయులు అనుసరించవలసిన సూచనలు)
ప్రాథమిక విద్యను గుణాత్మకంగా అందించడం మన ప్రధానలక్ష్యం. ఈ దిశలో "విందాం నేర్చుకుందాం" రేడియో పాఠాలను ప్రసారం చేస్తున్నాం. ఇందులో భాగంగా సామర్ధ్యాలు మరింత సమర్థవంతంగా బోధించడానికి IRI పాఠాలు ఉప యోగ పడుతాయి.
IRI అంటే "ఇంటరాక్టివ్ రేడియో ఇన్స్ట్రక్షన్" అంటే రేడియోలో ఇచ్చిన సూచనల ఆధారంగా ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు కృత్యాలు నిర్వహించడం, ఆటలు ఆడటం, పాటలు పాడటం, విద్యా ప్రమాణాల ఆధారంగా కల్పించిన బోధనాభ్యసన ప్రక్రియలు, కృత్యాలలో చురుకుగా పాల్గొనాలి.
IRI రేడియో పాఠాలు ప్రపంచ దేశాల్లో 26 సంవత్సరాల క్రితమే ప్రసారంలో ఉన్నాయి. అనేక దేశాలు ఈ కార్యక్రమన్ని వారి చిన్నారుల కోసం నిర్వహిస్తున్నాయి. వినడంతో పాటు సూచన ఆధారంగా విద్యార్థులు కృత్యాలు చేయడం ఇందులో కీలకమైన అంశం.
పాఠ్యాంశాల యొక్క సారాంశం సంభాషణ, నాటకీకరణ వంటి ప్రక్రియలతో కూడి ఉంటాయి. ప్రతీ పాఠంలో ఒక “ఆట" ఒక "పాట" లేదా గేయం తప్పనిసరిగా ఉంటాయి.
ఈ IRI రేడియో పాఠాలు శాస్త్రీయోక్తంగా అవసరమైన మూల్యాంకన ప్రక్రియలతో ప్రత్యేక శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు రూపొందించారు.
ఈ పాఠాలలో రేడియో (కేరెక్టర్సు) పాత్రలు స్థిరంగా ఉండడం మరో విశేషం. రేడియో అక్కయ్య (గీతక్క) రాజూ, లత అన్ని విషయాలలో (సబ్జెక్టులలో) ఉంటారు. విషయాల వారీ తెలుగుకు “చిలుక'', గణితానికి “మామయ్య". పరిసరాల విజ్ఞానానికి “తాతయ్య”, రెక్కల గుర్రం" పాత్రలు విద్యార్థులతో పాటు పాల్గొంటాయి. ఆకర్షవంతమైన సంగీతం, పాఠాల రూపకల్పన జరిగింది. వీటిని సమర్థవంతగ నిర్వహించడానికి తగిన సూచనలు ఈ కర దీపికలో పొందుపరచడం జరిగింది.ఈ సూచనల ప్రకారం ఆశించిన విధంగా IRI పాఠాలు మీ విద్యార్థులకు వినిపించి వారు సబ్జెక్టుల వారీగా సామర్థ్యాలు సాధించడానికి మనవంతు కృషి చేద్దాం.
రేడియో పాఠాలు విన్పించుటకు సూచనలు :
1. రేడియో పాఠాలు విన్పించుటకు ముందు చేయాల్సిన కృత్యాలు:
రేడియో ప్రసార షెడ్యూల్స్ లో మార్పులుండవు. ప్రసార విషయానికి చెందిన అంశం ఆధారంగా సంబంధిత ఉపాధ్యాయుడు నిర్దేశించిన తేదీలలో తరగతి, సబ్జెక్టును ఎంపిక చేసుకోవాలి.
టీచర్ పిల్లలతో మాట్లాడడం ద్వారా, చర్చించడం ద్వారా రేడియోలో ప్రసారమయ్యే పాఠ్యాంశానికి సంసిద్ధులను చేయాలి. పొఠం వినడానికి ఆసక్తి కలిగేలా పాఠానికి సంబంధించిన తేలికైన ప్రశ్నలను అడగాలి. పిల్లలలో రేడియో పాఠంపట్ల ప్రేరణను కలుగజేయాలి. ఇలా చేయడం వల్ల శ్రద్ధగా ఏకాగ్రతతో, ఆసక్తితో రేడియో పాఠాన్ని వింటారు.
2. రేడియో కార్యక్రమాలు వినేందుకు పిల్లలను కూర్చుండ బెట్టే విధానం - సూచనలు:
• పిల్లల్ని అర్థవృత్తాకారంలో కూర్చోమనాలి.
• ఈ ఆర్థవృత్తంలో తగినంత ఎత్తులో టేబుల్/ కుర్చీ పైన "రేడియో/ఆర్.సి.సి.పిని ఉంచాలి.
• ఇతర తరగతి గదులలో కూర్చున్న పిల్లలకు ఆటంకం కలగకుండా రేడియో / ఆర్.సి.సి.పి వాల్యూమ్ ఉండేట్లుగా చూసుకోవాలి.
3. రేడియో పాఠం విన్పించడం:
• పిల్లలతో పాటు టీచర్ కూడా శ్రద్దగా రేడియో పాఠం వినాలి. వింటున్నప్పుడు సాంకేతిక పదాలు, ముఖ్యాంశాలు, ఆసక్తికర సంభాషణాంశాలను ఒక నోటు బుక్కులో నమోదు చేయాలి. వాటి గురించి రేడియోపాఠం తర్వాత చర్చించడం, కృత్యాలు నిర్వహించడం ద్వారా అవగాహన కల్పించాలి. మధ్య మధ్య పిల్లలు ఏకాగ్రతతో వింటున్నారా లేదా పరిశీలించాలి.
• పిల్లల ప్రతిస్పందనలు, నమోదు చేయాలి. ఇవే కార్యక్రమ విజయాన్ని, వైఫల్యాన్ని తెలుపడంలో కీలకపాత్ర వహిస్తాయి.
4. రేడియో పాఠం విన్న తర్వాత నిర్వహించాల్సిన కృత్యాలు :
• టీచర్ రేడియో స్విచ్ ఆఫ్ చేయాలి. పిల్లలు ఎక్కడ ఎలా కూర్చున్నారో అలాగే కూర్చోమనాలి.
• రేడియో పాఠం వింటున్నప్పుడు నమోదు చేసిన అంశాల ఆధారంగా చర్చను చేపట్టాలి.ఇందుకోసం మొదట పిల్లలను కొన్ని మామూలు / సాధారణ ప్రశ్నలు అడగాలి.
• ఉదాహరణ:
* పాఠం ఎలా ఉంది?
* నీ కిష్టమైందా? ఎందుకు?
* పాఠంలో నీకు బాగా నచ్చిన అంశం ఏది?
* ఎందుకు నచ్చింది?
• పిల్లల నుండి సమాధానాలను రాబట్టుతూ అందరిని చర్చలో చురుకుగా పాల్గొనేట్లు చూడాలి.
• పిల్లలు ఒకవేళ ఏవైనా ప్రశ్నలు అడిగితే జవాబులు ఇవ్వాలి.
• నమోదు చేసుకున్న సాంకేతిక పదాల అర్థాలను వివరించాలి. కార్యక్రమంలో అన్ని భావనలపై ప్రతి విద్యార్థికి అవగాహన ఏర్పరచుకునేట్లు చూడాలి. తగిన విధంగా ప్రోత్సహించాలి.
5. ప్రతిస్పందన (ఫీడ్ బ్యాక్) పత్రాలను పంపడం: టీచర్ బాధ్యతలు:
• అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్, జిల్లా విద్యాధికారి, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారులకు రేడియో కార్యక్రమాలపై పిల్లల ప్రతిస్పందన పత్రాలను (ఫీడ్ బ్యాక్) పంపాలి. ఈ నివేదికలు విమర్శనాత్మకంగా, సలహాలు, సూచనలతో కూడి ఉండవచ్చు. ఇవి భవిష్యత్ కార్యక్రమాలను మరింత మెరుగ్గా అందించడానికి ఉపయోగపడతాయి.
0 Post a Comment:
Post a Comment