Wednesday 31 July 2019

RETIREMENT BENEFITS OF EMPLOYEE'S



RETIREMENT BENEFITS OF EMPLOYEE'S






🔹ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉన్నంత కాలం బతికుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పదవీ విరమణ చేసిన తర్వాత సర్వీస్‌ విషయాలను తేలిగ్గానే పరిష్కరించుకొనేందుకు అవకాశం ఉంటుంది. అకస్మాత్తుగా మరణిస్తే మాత్రం ఆ కుటుంబానికి సెటిల్‌మెంట్స్‌ (రావాల్సిన రాయితీలు) చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఉద్యోగులకు ఇలాంటి వాటిపై ముందుస్తు అవగాహన ఉంటుంది. కానీ ఉద్యోగుల కుటుంబసభ్యులకు ఆ స్థాయి అవగాహన లేకపోవచ్చు. ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులకు ఆ విషయాలను చెప్పకపోవచ్చు కూడా. ఇలాంటి సందర్భంలో సర్వీస్‌ సెటిల్‌మెంట్స్‌కు సంబంధించిన విషయాల్లో ఉద్యోగుల కుటుంబసభ్యులకు గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్వహించే ప్రక్రియలు కూడా తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ఇకపై ఉద్యోగి కుటుంబ సబ్యులు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవసరం లేదు. ఉద్యోగి చనిపోతే ప్రభుత్వాలు మానవత్వంతో సానుకూలంగా స్పందిస్తాయి. అవకాశం ఉన్నంత వరకు మరణించిన ఉద్యోగికి సంబంధించిన సెటిల్‌మెంట్స్‌ ద్వారా కుటుంబ సభ్యులు లబ్ధిపొందేలా మార్గదర్శకాలు రూపొందించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా ఎప్పటికప్పుడు మారుతున్న కాలం, పరిస్థితుల ప్రాతిపదికన సర్వీస్‌ మ్యాటర్స్‌ను సెటిల్‌మెంట్‌చేసే విషయంలో సరికొత్త మార్గదర్శకాలను వెలువరిస్తున్నాయి. దురదృష్టవశాత్తు ప్రభుత్వ ఉద్యోగిమరణిస్తే ఆ ఉద్యోగి కుటుంబానికి చెల్లింపులు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తుంది. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేక జీవోలను జారీ చేసింది.


🍁 అంత్యక్రియలకు :

🔹 ఉద్యోగి మరణిస్తే ప్రభుత్వం రూ. 15 వేలు అంత్యక్రియలకు చెల్లిస్తుంది. ఇందుకు సంబంధించి 2010 ఏప్రిల్‌ 24న ప్రభుత్వం 192 జీవోను జారీ చేసింది. మరణించి ఉద్యోగి కుటుంబ సభ్యులు ఏ విధంగా అంత్యక్రియల నగదును పొందాలో స్పష్టంగా ఇచ్చింది.


🍁 ట్రావెల్స్‌ అలవెన్స్‌ :

🔹 మరణించిన ఉద్యోగికి సంబంధించిన ట్రావెల్స్‌ అలవెన్స్‌(టీఎ)ను కుటుంబసభ్యులకు చెల్లిస్తారు. మరణించడానికి జబ్బు పడిన కాలం నాటి నుంచి చివరి స్టేషన్‌ ఏదైతే ఉంటుందో దానిని ప్రాతిపదికగా తీసుకొని ట్రావెల్‌ అలవెన్స్‌ ఇస్తారు. దీనికి సంబంధించి 1987 జూన్‌ 23న ప్రభుత్వం 153 జీవోను జారీ చేసింది. ఆ జీవోలో ఏ విధంగా లబ్ధి పొందాలో స్పష్టంగా మార్గదర్శకాలను వివరించింది.


🍁 ఎన్‌క్యాష్‌మెంట్‌ : 

🔹 మృతిచెందిన ఉద్యోగి ఎర్న్‌డ్‌ లీవ్‌లకు సంబంధించిన ఎన్‌క్యాష్‌మెంట్‌ను కుటుంబసభ్యులకు చెల్లిస్తారు. ఈ ఎన్‌క్యాష్‌మెంట్‌ను 240 రోజుల నుంచి 300 రోజులకు పెంచారు. ఈ జీవో 2006 సెప్టెంబరు 16న జారీ అయింది.


🍁 ప్రమాదాల పరిహారం : 

🔹 విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు యాక్సిడెంటల్‌(ప్రమాదాలు)గా మరణిస్తే ప్రభుత్వం రూ. లక్ష ఎక్స్‌గ్రేసియాగా చెల్లిస్తుంది. అందుకు సంబంధించి ప్రభుత్వం 2006 జూలై 7న 318 జీవోను జారీ చేసింది. దాని ద్వారా ప్రమాదంలో మరణించిన కుటుంబసభ్యులు ఆ పరిహారాన్ని పొందవచ్చు.


🍁 రుణాలు చెల్లింపులు, అడ్వాన్సులు రద్దు :

🔹 ఒక ఉద్యోగి సంస్థ నుంచి అప్పులు లేదా అడ్వాన్సులు తీసుకొని మృతి చెంది ఉంటే ఆ మొత్తాన్ని రద్దు చేస్తారు. ఉద్యోగి మరణించిన సమయానికి జీపీఎఫ్‌తో సమానమైన రూ. 10 వేలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు.


🍁 కారుణ్య నియామకం - కరువు భత్యం : 

🔹 ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారు. అయితే వారి అర్హతల ప్రాతిపదికన వివిధ స్థాయిల్లో తీసుకొనే అవకాశం ఉంది. మరణించిన ఉద్యోగికి సంబంధించి డీయర్‌నెస్‌అలవెన్స్‌ (డీఎ)ను కుటుంబ పెన్షన్‌ కింద చెల్లించరు. కానీ కారుణ్య నియామకం పొందిన వారికి ఈ మొత్తాన్ని రెగ్యూలర్‌గా చెల్లిస్తారు. అందుకు సంబంధించిన వివరాలను 1998 మే 25న ప్రభుత్వం 89 జీవోను జారీ చేసింది.


🍁 ఫ్యామిలీ పెన్షన్‌(కుటుంబ పెన్షన్‌) :

🔹 ఉద్యోగిమృతి చెందితే కుటుంబ సభ్యులకు కుటుంబ పెన్షన్‌ను వర్తింపజేస్తారు. దీనిని ఉద్యోగిస్థాయి, తరగతిని బట్టి ఉంటుంది. డీసీఆర్‌జీ పెన్షన్‌ రూల్స్‌ను అనుగుణంగా కుటుంబ పెన్షన్‌ వర్తిస్తుంది.





CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top