G.O.Ms.No.29 & 30 Dated: 23-06-2010 ప్రకారం అప్రయత్న పదోన్నతి పథకం (AAS) , పదోన్నతులు (PROMOTIONS) గురించి శాఖపరమైన పరీక్షలు (Departmental Tests) రాయాలి.
👤 అప్రయత్న పదోన్నతి పథకం(AAS) :
👉 అప్రయత్న పదోన్నతి పథకం(AAS) లో భాగంగా SGT క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సంవత్సరముల స్కేలు పొందుటకు GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కానవసరం లేదు.
👉 కాని 24 సంవత్సరముల స్కేలు పొందుటకు ఖచ్చితంగా GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి. దీనికి ఎటువంటి మినహాయింపు లేదు.
👉 స్కూల్ అసిస్టెంట్ తత్సమాన క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సంవత్సరముల స్కేలు పొందుటకు GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.
👤 పదోన్నతులు (PROMOTIONS) :
👉 స్కూల్ అసిస్టెంట్ లు గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్ పొందుటకు GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.
👉 సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకొనివారు 45 సం॥ వయస్సు దాటితే ప్రస్తుతము పనిచేయుచున్న క్యాటగిరి నుండి పై క్యాటగిరి కి ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.
👉 50 సంవత్సరముల పైబడినవారు ప్రమోషన్ కొరకు ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.
👥 Spl.Language Test Higher&Lower Standard paper Code.37 ఎవరు వ్రాయాలి ?
👉 ఇంటర్మీడియట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Higher Standard) వ్రాయాలి.
👉 పదవ తరగతి ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Lower Standard) వ్రాయాలి.
👥 డిపార్టుమెంటల్ పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులకు OD సౌకర్యం ఉంటుందా?
👉 ఫండమెంటల్ రూల్ 9(6)(b)(iii) ప్రకారం నిర్బంధ శాఖీయ పరీక్షకు(Compulsory) హాజరగుటకు ఎన్నిసార్లైనా OD సౌకర్యం కల్పించవచ్చును.
👉 అయితే ఐచ్చిక పరీక్షకు (OPTIONAL) హాజరగుటకు రెండుకంటే ఎక్కువసార్లు OD రాయితీని ఇవ్వరాదు.
Respecded sir Iam wwriten department test paper cod. 008. in the year 22. may 2004 reg.no 10250138 & paper code.010. reg no. 10250510 i.lost my result book plz suggest how to get result appsc department book
ReplyDelete