Saturday 20 April 2019

Income Tax - General and New features we observed while ITR e-Filing



Income Tax - General and New features we observed while ITR e-Filing








👉  ప్రాథమిక అంశాలైన submission mode వరకు ఎంటర్ చేసి Continue ను క్లిక్ చేయగానే ఈసారి కొత్తగా 4 pre-filled options కన్పిస్తున్నాయి.

👉  గత e-Filing లో ఉన్న బ్యాంక్ details లాంటి విషయాలు ఈ సంవత్సరం కూడా రావాలంటే, ఆ pre-filled options పై tick చేస్తే చాలు, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. మళ్ళీ ఆ డీటెయిల్స్ నింపాల్సిన అవసరం లేదు.

👤  Next...   మొదటి TAB లో Instructions ఉంటాయి.

👤  Next...   రెండవ TAB లో PART-A: General Information ఉంటుంది.

👉  ఇందులో మన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఆధార్, మొబైల్, ఈ మెయిల్ తప్పనిసరి.
Nature of Employment లో Government సెలెక్ట్ చేసి, filed u/s లో 139(1)- on or before due date సెలెక్ట్ చేస్తే సరి పోతుంది.

👤  Next... మూడవ TAB లో PART-B: Computation of Income tax ఉంటుంది.

👉  90% e-filing ఇందులోనే నింపాల్సి ఉంటుంది.

👉  మనం మన DDO గారికి సమర్పించిన ఫారం-16 ను దగ్గర ఉంచుకుని ఈ డీటెయిల్స్ నింపాలి.

✔  B1: GROSS SALARY :

👉  మొదటగా B1 i. a. లో salary as per section 17(1) ఎదురుగా మన form16 లోని Gross Amount ను ఎంటర్ చేస్తే, Gross Salary వద్ద display automatic గా అవుతుంది.

👉  HRA మినహాయింపును ఈసారి ఎంటర్ చేయాలి. దీనికోసం B1 ii. లో Less: Allowances to the extent exempt u/s 10 దగ్గర ఉన్న Nature of Exempt Allowance లో నుండి  sec 10(13A) - Allowance to meet expenditure incurred on house rent ను సెలెక్ట్ చేసుకొని, అమౌంట్ కాలంలో మనకు form16 లో deduct చేయబడిన HRA అమౌంట్ ను ఎంటర్ చెయ్యాలి.

👉  B1 iii. లో ఆటోమేటిక్ గా Net Salary వచ్చేస్తుంది.

👉  తర్వాత B1 (iv) (a) లో Standard Deduction u/s 16(ia) ఎదురుగా 40వేలు ఎంటర్ చేయాలి.

👉  తర్వాత B1 (iv) (c) లో professional tax u/s (16iii) ఎదురుగా మీరు చెల్లించిన P.TAX అమౌంట్ ఎంటర్ చెయ్యాలి.

✔  B2: Type of House Property :

👉  మనకు house loan లేకుండా, HRA ను క్లెయిమ్ చేస్తే select ను అలాగే ఉంచి వదిలేస్తాం.

👉  అలా కాకుండా మనకు గనుక Housing Loan ఉంటే self occupied ను సెలెక్ట్ చేసి, B2(v)లో మనం చెల్లించిన interest amount ను ఎంటర్ చేయాలి.

👉  Housing loan ఉండి, HRA ను కూడా క్లెయిమ్ చేసుకోవాలనుకునేవారు LETOUT ను సెలెక్ట్ చేసుకొని, ఇంటి అద్దెపై కొంత ఆదాయంను B2(i)లో చూపించాల్సి ఉంటుంది.ఇది అదనపు ఆదాయం కనుక దీనికి అదనంగా టాక్స్ కట్టవలిసి ఉంటుంది.

✔  B3: Income from Other Sources :

👉  మనయొక్క form 26 AS లో Part A-1 నందు జనరేట్ కాబడిన Fixid Deposits, SB interest amounts, ఇంకా ఏమైనా ఉంటే ఇక్కడ తప్పకుండా చూపించాలి. లేకుంటే 143(1A) ప్రకారం నోటీస్ వస్తుంది.
✔  PART C: Deductions and taxable total income :

👉  మొదటగా ఉన్న 80c ఎదురుగా మీ సేవింగ్స్ ఎంటర్ చేయాలి.

👉  తర్వాత ఉన్న 80CCD(1B) లో CPS ఉద్యోగులు అదనంగా 50వేల వరకు చూపించుకోవచ్చు.

👉  ఆ తర్వాత ఉన్న 80CCD(2) లో CPS వారు govt. ఇచ్చే 10% Contribution ను add చేయడానికంటే ముందు, అట్టి income ను B3: Income from Other Sources లో any other దగ్గర చూపించాలి.

👉  EWF, SWF, CMRF మొత్తాన్ని 80G లో చూపించాలంటే, నేరుగా ఎంటర్ చేయలేము. దాన్ని DONATIONS-80G అనే TAB లో ఎంటర్ చేస్తే ఆ అమౌంట్ ఇక్కడ reflect అవుతుంది.

👉  ఈవిధంగా అన్ని Deductions ను Part C లో ఎంటర్ చేయగానే, C1లో Total Deductions చూపెడుతుంది.. దాని కిందనే C2లో Total Income (B4-C1) చూపెడుతుంది. ఈ C2 అనేది మన form16లోని Taxable Income అన్నట్టు.

✔  PART D: Computation of Tax Payable :

👉  ఇక్కడ D1 నుంచి D11 వరకు ఉన్న అన్ని కాలమ్స్, మీ form16 తో సరి పోల్చుకుని నిర్దారించుకోవాలి.

👤  Next... నాల్గవ TAB లో TAX DETAILS

👉  TDS-1 మరియు TDS-2 అని ఉంటాయి.

👉  TDS-1 లో Form 26AS లోని అమౌంట్ reflect అవుతుంది. ఇక్కడ DDO గారు TDS చేయగానే వెంటనే reflect అవ్వకపోవచ్చు.. కొంత సమయం పట్టవచ్చు.. TDS-1లో transaction reflect కాకపోయినా, form 26AS లో ఉంటే చాలు.. మనం e-filing చేసుకోవచ్చు. కానీ, form 26AS లో transaction లేకుంటే e-filing చేయవద్దు.

👉  అలాగే TDS-1 లోగాని, TDS-2 లోగాని transactions ఆటోమేటిక్ గా reflect అవుతాయి. వాటిని manual గా ఎంటర్ చేయకూడదు.

👉  TDS-2 లో form 26AS లోని Part A1లో ఉన్న transactions reflect అవుతాయి. వీటిని income from other sources (B3) లో చూపించి ఉండాలి.

👉  ఈవిధంగా TAX DETAILS TAB లోని TDS-1 టాక్స్ అమౌంట్ కు, ఇంతకు ముందటి TAB లోని D11లో ఉన్న TOTAL TAX కు tally అయితే చాలు.

👤  Next... ఐదవ TAB లో TAX PAID AND VERIFICATION

👉  ఇక్కడ  D12, D13, D14 లలో చూపించబడే అమౌంట్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి.

✔  PART E: OTHER INFORMATION :

👉  ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది.. e-filing మొదట్లో చెప్పినట్లుగా pre-filled options ను tick చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ గత సంవత్సరపు డీటెయిల్స్ వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఎంటర్ చెయ్యాల్సిన పనిలేదు.

🌍  ఈ TAB చివర్లో ఈసారి కొత్తగా please select the verification option అనే దానిని చేర్చారు. గతంలో ఇవి starting page లొనే ఉండేవి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Blinking Text
Top