Sunday 17 February 2019

Model Primary School LFL HM and Primary / Upper Primary School HM's Functions and Powers



Model Primary School LFL HM and Primary /  Upper Primary School HM's Functions and Powers








Functions :


ప్రాధమిక/ప్రాధమికోన్నత  పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ముందుగా క్యాడర్ వారీగా ( అవసరమనుకుంటే పుట్టిన తేదీ చూడాలి)  ఎవరు సీనియర్ అయితే వారు ప్రధానోపాధ్యాయుల బాధ్యత నిర్వహిస్తారు.

ప్రాధమికోన్నత పాఠశాలలో క్యాడర్లో Date of Joining & Date of Birth ఒకే విధముగా వున్నపుడు ముందుగా సబ్జెక్టు చూడాలి (  పాఠశాల సహాయకులు అయితే )  అనగా Maths, PS, BS, SS ఇలా చూడాలి. దాదాపుగా ఈ సమస్య రాకపోవచ్చు.

హాజరు పట్టిలో క్యాడర్ & సీనియర్ వారీగా ఉపాధ్యాయుల పేర్లు రాసుకునే  బాధ్యత ప్రధానోపాద్యాయుల వారిదే.

సాధ్యమైనంత వరకు ఉపాధ్యాయుల పూర్తి సంతకములు వచ్చు నట్టి హాజరుపట్టి ఉండేటట్లు  చూసుకోవాలి (ఉన్నత పాఠశాలలో అయితే పూర్తి సంతకము ఉండే  హాజరు పట్టి అవసరము లేదు).

ఉదయము & సాయంత్రము ఉపాద్యాయులు సంతకమును చేసిన తరువాత ఎట్టి పరిస్థితిలోను  హాజరు పట్టి బయట ఉండకూడదు.

ఇప్పుడున్న  పరిస్థితిలో పాఠశాల సమయము మించిన తరువాత బయోమెట్రిక్/ ఐరిష్  ఆఫ్ చేసి  బీరువాలో  లాక్  చేయవలెను. ఈ విషయములో పూర్తి బాధ్యత ప్రధానోపాధ్యాయుల వారే బాధ్యత వహించాలి.

ఇప్పుడున్న పరిస్థితిలో బయోమెట్రిక్ /ఐరిష్ రికార్డ్ తప్పకుండా అమలు చేయాలి. దానిలో  బయోమెట్రిక్ /  ఐరిష్ తీసుకొని రోజు , సమయము మించిన తరువాత హాజరు తీసుకున్నది , ఇతర  ఉపాధ్యాయుల బయోమెట్రిక్  వివరములు నమోదు చేయాలి. ఈ రిజిస్టర్  ఇప్పుడున్న పరిస్థితిలో అత్యంత కీలకం.

హాజరు పట్టీలో ఉపాధ్యాయుల సంతకముల  దగ్గర కొట్టివేతలు ఉంటే సంబంధిత  ఉపాద్యాయుల వద్ద కారణపు లెటర్ తీసుకొని ఇనీషియల్ వేయాలి.

పాఠశాల ఆఫీస్ లో నల్ల బోర్డు పై ఉపాద్యాయుల పేర్లు హాజరు పట్టీలో మాదిరిగా నమోదు చేయాలి. ఇక్కడ ప్రధానో పాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ముందు వారి క్యాడర్  రాసి , ఆ తరువాత బ్రాకెట్లో  ప్రధానో పాధ్యాయులు అని రాయాలి. ఇక్కడ ప్రతి ఉపాధ్యాయుల Date of  Appointment, Date of Joining in present school తప్పకుండా నమోదు చేయాలి.

ఎట్టిపరిస్థితిలోను ఏ తరగతి గది ఖాళీగా ఉండకూడదు. అందుకు సంబంధించి ఆ రోజు సెలవులు పెట్టిన ఉపాధ్యాయుల  పీరియడ్స్/  తరగతి  ఉదయపు/  సాయంత్రపు  వర్క్ అడ్జస్ట్మెంట్  పీరియడ్స్/  తరగతి రిజిస్టర్  రాసి ఉపాద్యాయులు కు అసెంబ్లీ  అయిన వెంటనే పంపించాలి.

మొదటి పీరియడ్  లోపే మధ్యాహ్న భోజనపు  కొలతలు అయిపోవాలి. ఖచ్చితముగా MDM ఏజెన్సీ వారి చేత కొలత పాత్రలు &  త్రాసు ఉంచవలెను.

ఒకటో  తరగతి నుంచి ఐదవ  తరగతి వరకు అడ్మిషన్స్   చేసుకునేటప్పుడు  రికార్డు షీట్ &  తల్లి /  తండ్రి సంతకము తీసుకోవాలి. ఒకవేళ రికార్డ్  షీట్ లేనిపక్షంలో వయసును బట్టి , చదువును  బట్టి విద్యా హక్కు చట్టం  ప్రకారము అడ్మిట్  చేసుకోవాలి.

ఆరో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు అయితే ట్రాన్స్ఫర్  సర్టిఫికెట్ తీసుకోవాలి లేదా విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము వయసును /  చదువును బట్టి అడ్మిట్ చేసుకోవాలి. పై రెండు విషయాలలో  బర్త్  సర్టిఫికెట్ /తల్లి లేదా తండ్రి డిక్లరేషన్  తీసుకోవాలి. అలాగే సంబంధిత అధికారినుంచి  జారీ చేయబడిన కులధ్రువీకరణ  పత్రము తీసుకోవాలి.

ఒక వేళ విద్యా హక్కు చట్టం ప్రకారము అడ్మిట్ చేసుకుంటే  అడ్మిషన్ రిజిస్టర్లో  RTE ACT-2009 అని రాయాలి.

ఏదైనా కారణములు  చేత విద్యార్థి  రికార్డు షీట్ /  ట్రాన్స్ఫర్ సరిఫికేట్  తీసుకొని వెళ్లి , తిరిగి మరల మన పాఠశాలకు వచ్చి జాయిన్ అయితే అడ్మిషన్ నెంబర్ కొత్తది పైన రాసి క్రింద పాతది వేయాలి ఉదాహారణ కు 8943/1065.

పాఠశాలకు సెలవు పెట్టినప్పుడు  తరువాతి సీనియర్  ఉపాద్యాయులు కు ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయాలి. (staff order register).

ప్రధానోపాధ్యాయుల వారికి మీటింగ్ /  ట్రైనింగ్  జరిగినప్పుడు  ఆ విషయాలను మరుసటి  రోజే   పాఠశాల ఉపాధ్యాయులకు తెలియపరచి , ఉపాధ్యాయుల సమీక్ష  సమావేశపు రిజిస్టర్ లో నమోదు చేసి ఉపాధ్యాయుల చేత సంతకము తీసుకోవాలి.

పాఠశాల నుంచి విద్యార్థి రికార్డు షీట్ /  ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళినప్పుడు  అడ్మిషన్ రిజిస్టర్ లో డేట్ వేసి సంతకము చేసి  స్థలమును బట్టి వీలుంటే  స్టాంప్ వేయాలి.

MDM daily register, egg register, dal register, rice register, oil register విధిగా పాటించాలి.

SMC సమావేశం నిర్వహించేటప్పుడు ఉపాధ్యాయులు సమావేశములో ఉండేటట్లు చూసుకోవాలి.

SMC సభ్యుల వారితో స్నేహ  సంబంధ బంధాలను  కలిగి ఉండాలి. SMC సమావేశపు రిజిస్టర్ లో తీర్మానాలు  , ఎజండా  రాసుకొని  SMC cairman , మెంబెర్స్, స్టాఫ్ సంతకము తీసుకోవాలి.

సెలవు రోజులో పాఠశాల నిర్వహించినప్పుడు, స్థానిక సెలవు ఇచ్చినప్పుడు  , ఐచ్చిక సెలవు ఇచ్చినప్పుడు సమాచారమును  ఖచ్చితముగా MEO గారికి తెలియపరచాలి.

పాఠశాల తరుపున  SPL ￰లీడరును నియమించాలి. వారి చేత  అసెంబ్లీ , బెల్  కొట్టించడము , పాఠశాల official బాధ్యతలు ( తరగతి గదిలో బోధనా  జరగనప్పుడు  ) ఇవ్వాలి.

విద్యార్థుల చేత కమిటీలు ఏర్పాటు చేయాలి.

ప్రధానోపాధ్యాయులు  సెలవు పెడితే MEO గారి నుంచి అనుమతి పొంది ఉండాలి.

పాఠశాల యొక్క అన్ని రిజిస్టర్లకు పూర్తి బాధ్యత ప్రధానోపాద్యాయుల వారిదే.

పాఠశాలలో జరిగే  ప్రతి కార్యక్రమము వారి పేరు మీదనే  జరుగుతుంది.

పాఠశాల ప్రార్ధన లో ప్రతి రోజు ఐదు నిమిషములు సందేశము ఇవ్వాలి.

పాఠశాల వాతావరణము స్నేహపూర్వకంగా  ఉంచాలి.

ప్రధానోపాధ్యాయుల బాధ్యత వహిస్తూ , సంబంధిత విషయాంశాలలో బోధన చేయాలి.
Powers :

ఉపాధ్యాయులకు CL's, SCL's grant చేసే అధికారము కలిగి వుంటారు.

సెలవు ఉపాధ్యాయులకు అనుమతి ఇచ్చేటప్పుడు పాఠశాలలో ఖచ్చితముగా 50%  ఉపాధ్యా ఉండేటట్లు చూసుకోవాలి.

సెలవు చీటీ పై గ్రాంటెడ్  అని Red ink తో రాసి Blue ink తో సంతకము చేయాలి.

ఉపాధ్యాయులు కు ఇతర సెలవులు మంజూరు  చేసే అధికారము MEO గారికి  ప్రధానోపాద్యాయుని ద్వారా కవరింగ్ లెటర్ పంపించాలి. ఇలా రాసే టప్పుడు ఎడమ చేతి వైపు  పాఠశాల రౌండ్  సీల్  వేసి ,ఆ ముద్రలో  Red ink తో date వేయాలి.

ఉపాధ్యాయులు కు పని విభజన చేసి వారి చేత సంతకములు చేయుంచుకోవాలి.

ఉపాధ్యాయులకు class teacher గా allotment  ￰చేసేటప్పుడు ఏ ఉపాధ్యాయులు అయితే class teacher గా allot  అయ్యారో వారే ఆ class  కు సంబంధించి cce marks online , progress card fill up, consalidation attendance, port polio preparing, class leader selection వారి చేత చేపించే అధికారము కలదు.
.
సెలవు చీటీ రెండు రాపించి ఒకటి సంతకము చేసి , సంబంధిత ఉపాధాయునికి ఇవ్వాలి. రెండవది  పాఠశాలలో భద్రపరచాలి.

ఉపాధ్యాయులు బోధన చేసేటప్పుడు పరిశీలించే అధికారము కలదు.

ఉపాద్యాయుల ప్రవర్తన  సక్రమముగా లేనిచో  MEO గారికి రాతపూర్వకంగా  తెలిపే అధికారము కలదు.

వార్షిక ఇంక్రిమెంట్, AAS, Festival Advance, step up etcetra ప్రధానోపాధ్యాయుని ద్వారా మాత్రమే వెళ్ళాలి.

కారణము లేకుండా సెలవు reject  ￰చేయకూడదు. సెలవు హక్కు కాదు, వెసలుబాటు  మాత్రమే.

ఏదైనా ఉపాధ్యాయుని ద్వారా పాఠశాలలో గందరగోళ పరిస్థితులు తలెత్తే  ప్రమాదము ఉన్నట్లు  భావిస్తే ఆ విషయము సంబంధిత అధికారికి రాతపూర్వకంగా తెలియపరచవచ్చు.

ఉపాద్యాయుల dairy, lesson plan, action plan పై విధిగా సంతకము చేయవలెను.

ఏదైనా కార్యక్రమం నిర్వహించేటప్పుడు మొదటి ప్రాధాన్యత సీనియర్స్ కి ఇవ్వాలి , సీనియర్స్ సుముఖత  చూపనప్పుడు active గా వుండే వారిని ఎన్నుకోవాలి.

Independence day, Republic day  సాధ్యమైనంత వరకు social teacher చేత ఉపన్యాసము  ఇప్పించాలి.

ఇతర రాష్ట్రములు/ దేశములు నుండి T.C వచ్చినప్పుడు , ఖచ్చితముగా T.C. మీదా D.E.O .గారి కౌంటర్  సంతకము ఉంటేనే admit చేసుకోవాలి

ప్రతి విద్యార్థి 75%  హాజరు ఉండాలి , లేకపోతే HM గారు shortage attendance sign చేసి ఇవ్వాలి.

రాష్ట్ర ప్రభుత్వము చేపట్టే  కార్యక్రమములు /  ర్యాలీలు  ఉపాధ్యాయులు అందరు పాల్గొనేటట్టు  నోటీసు  జారీ చేయాలి.

ప్రధానోపాధ్యాయులు సాధారణ సెలవులో  ఉన్నప్పటికీ  , ప్రధానోపాధ్యాయులు వారే ఉపాధ్యాయులు కు సెలవులు grant చేయాలి. ఒక వేళ long leave/ medical leave/ maternity / paternity/ tubectomy/ vesectomy etc,, వాటిలో HM వున్నప్పుడు incharge teacher grant చేస్తారు.

ప్రస్తుత కాలములో movement  register అతి ముఖ్యమైనది. ఉపాధ్యాయులను బయటకు పంపేటప్పుడు  , తాను వెళ్లాలనుకున్నప్పుడు  time mention చేసి పంపిన HM గారి సంతకం &  వెళ్లిన వారి సంతకము ఉండాలి. (It is HM protection register).

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Blinking Text
Top