Saturday 7 July 2018

Video Tutorial to Monitoring of Student Text Book Distribution through Books App



 Video Tutorial to Monitoring of Student Text Book Distribution through Books App








స్టూడెంట్ టెక్స్ట్ బుక్స్ యాప్ వాడు విధానం




మొదటగా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ప్లే స్టోర్ లో లభ్యం కాదు కావున దీనికి సంబంధించిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి.


ఈ యాప్ ను ఓపెన్ చేసిన తర్వాత ఎంటర్ స్టూడెంట్ ఐడి వద్ద విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ గాని లేదా CSE లో ఉన్న చైల్డ్ ఐడి కానీ లేదా ఈ-హాజరు లో ఉన్న ఐడి ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ నొక్కాలి.


తరువాత వచ్చినటువంటి స్క్రీన్ మీద పాఠశాల యొక్క dise code, విద్యార్థి పేరు, తరగతి, మీడియం, పుస్తకాల యొక్క వాస్తవ సంఖ్య కనిపిస్తాయి. దానికింద స్కాన్ అను బటన్ కనిపిస్తుంది దానిని ప్రెస్ చేయవలెను


ఇప్పుడు టాబ్ యొక్క స్కానర్ ఓపెన్ అవుతుంది అప్పుడు విద్యార్థి యొక్క ఐరిష్ కానీ థంబ్ కానీ తీసుకోవాలి.


విద్యార్థి యొక్క బయోమెట్రిక్ తీసుకోని ఎడల అదేవిధంగా మూడుసార్లు ప్రయత్నిస్తే ఆటోమేటిక్ గా తీసుకునే విధంగా ప్రోగ్రాం డిజైన్ చేయబడి ఉన్నది.


తరువాత విద్యార్థికి ఇచ్చినటువంటి పుస్తకాల సంఖ్య ఎంటర్ చేయవలెను.



దాని తరువాత కాలమునందు ఏ ఏ పుస్తకాలు విద్యార్థికి ఇవ్వలేదో నమోదు చేయవలెను.


అనంతరం మనం ఇచ్చిన పుస్తకాలతోపాటు విద్యార్థి యొక్క ఫోటో తీయవలసి ఉంటుంది దీనికోసం కెమెరా బొమ్మ ఉన్నటువంటి చోట క్లిక్ చేయవలెను.


ఫోటో లోడ్ అయిన తర్వాత సబ్మిట్ బటన్ ను నొక్క వలెను.


తర్వాత టాబ్ స్క్రీన్ మీద books distribution successfully completed అని వస్తుంది.


దీనితో పుస్తకాల పంపిణీ కార్యక్రమం పూర్తయినట్లే. మరల ఇదేవిధంగా మిగతా విద్యార్థులకు కూడా పుస్తకాలు పంపిణీ చేయవలెను.


ప్రస్తుతం విద్యార్థికి ఒకసారి పుస్తకాలు ఇచ్చి సబ్మిట్ చేస్తే రెండవసారి ఇచ్చినటువంటి పుస్తకాలు వివరాలు అప్లోడ్ చేయుటకు అవకాశము లేదు. దీనికి త్వరలో అప్డేట్ ఇస్తారు గమనించగలరు.







0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top