Friday 1 June 2018

RULES OF GENERAL PROVIDENT FUND (GPF)

RULES OF GENERAL PROVIDENT FUND (GPF)





GPF రూల్స్ 1-4-1935 నుండి అమలులోకి తీసుకురావడం జరిగింది.


ఈ స్కీం ప్రభుత్వ ఉద్యోగులకు 1-3-1963 నుండి తప్పనిసరి చేయబడినది.


తేది 1-9-2004 తరువాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేరిన వారికి ఈ రూల్స్ వర్తించవు.
(G.O.Ms.No.654 Fin Dt:22-09-2004) www.teachersneed.info


చందాదారుడు ఈ ఫండ్ లో చేరే సమయంలో తప్పక తన నామినేషన్ సమర్పించాలి (రూల్-7).


ప్రతి చందాదారునికి ఒక అకౌంట్ నెం.అలాట్ చేస్తారు.అందులో చందా వివరాలు మరియు ఆర్జించిన వడ్డీ మొదలగు విషయాలు ఉంటాయి. (రూల్-8)


ప్రతి చందాదారుడు నెలనెలా చందా చెల్లించాలి సస్పెన్షన్లో ఉన్న ఉద్యోగులు చందా చెల్లించనవసరం లేదు. www.teachersneed.info


 జీతం లేని సెలవు,అర్ధజీతపు సెలవు సందర్భాలలో చందా చెల్లించాలా వద్దా అన్నది ఉద్యోగి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.(G.O.Ms.No.199 F&P Dt:11-07-1969)



రిటైర్మెంట్ కంటే నాలుగు నెలల ముందు నుండి చందా చెల్లించనవసరం లేదు.
(G.O.Ms.No.98 F&P Dt:19-06-1992)


చందా రూల్-10 లో తెలిపిన రేట్ల ప్రకారం చెల్లించాలి.అంతకంటే ఎక్కువగా అయినా చెల్లించవచ్చు కాని అతను పొందే జీతభత్యాలు (Pay+DA) కు మించరాదు.


చందాదారుడు తన చందాను సం॥లో రెండుసార్లు పెంచుకోవచ్చు. అలాగే ఒకసారి తగ్గించుకోవచ్చు.(G.O.Ms.No.21 F&P Dt:24-01-1981).


నాల్గవ తరగతి ఉద్యోగులు బేసిక్ పే పై 4%;  ఇతరులు భీమా కలవారు 6%; భీమా లేనివారు 12% చెల్లించాలి.  www.teachersneed.info


నెలసరి చందా ఉద్యోగి జీతభత్యాల నుండి రికవరీ చేయాలి.అలగే డిప్యూటేషన్ లో పనిచేసే వారి జీతాల నుండి చందా రికవరీ చేసి చలానా ద్వారా వారి ఉద్యోగి అకౌంట్లో
జమచేయాలి. (రూల్-12)(G.O.Ms.No.359 F&P Dt:25-10-1993).


0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top