Saturday 2 June 2018

ONLINE PROCESS OF MEDICAL REIMBURSEMENT



ONLINE PROCESS OF MEDICAL REIMBURSEMENT



 ఖర్చులు 50,000రూ పైబడిన టీచర్లు అందరూ విద్యాశాఖ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముందుగా మన MR కి సంబంధించిన డిశ్చార్జి సమ్మరీ, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, essentiality సర్టిఫికెట్, డిపెండెంట్ సర్టిఫికెట్ పిడిఎఫ్ ఫార్మాట్ లో 6kb నుండి 1mb సైజు లోపు ఉండేటట్లు స్కాన్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోవాలి.


ఇపుడు www.cse. ap. gov. in వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి.


ఎడమ వైపు ఉన్న లింక్ లో E-office పై క్లిక్ చేయగానే కుడివైపు MR approvals కనబడుతుంది.దీనిపై క్లిక్ చేయాలి.


వెంటనే స్క్రీన్ పై ఒక బాక్స్ కనబడుతుంది.అందులో యూజర్ name, పాస్స్వర్డ్ మరియు క్యాప్చ కోడ్ ను ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కాలి.


యూజర్ name - టీచర్ పని చేస్తున్న స్కూల్ dise కోడ్.


పాస్ వ ర్డ్ -Admin@2818(first 4 digits in school dise code)



వెంటనే స్కూల్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో MR సెలెక్ట్ చేసుకోవాలి.



వెంటనే ఎంప్లాయ్ టైప్ దగ్గర inservice or pensioner సెలెక్ట్ చేయాలి.


ఇపుడు స్క్రీన్ పై ఎంప్లాయ్ అని వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేయగానే ఆ స్కూల్లో పనిచేస్తున్న అందరి పేర్లు display అవుతాయి.


ఇపుడు టీచర్ name సెలెక్ట్ చేసుకోవాలి.వెంటనే క్లెయిమ్ ఫారం వస్తుంది.


ఇందులో టీచర్ పేరు, టీచర్ ID NO, ఆధార్ నంబర్, పుట్టినతేదీ, ఫోన్ నెంబర్ డీ ఫాల్ట్ గా ఉంటాయి.

క్లెయిమ్ ఫారం లో స్కూల్ వివరాలు, personal details, అడ్రస్,పేషెంట్ వివరాలు, హాస్పిటల్ వివరాలు పూర్తిచేసి proof in support of claim documents అప్లోడ్ చేయాలి.


documents లో బిల్ నంబర్, తేదీ లను పూర్తి చేసి డిశ్చార్జ్ సమ్మరీ,essentiality సర్టిఫికెట్, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, dependent సర్టిఫికెట్ లను అప్లోడ్ చేయాలి.


ఆనంతరం సబ్మిట్ నొక్కాలి.వెంటనే స్క్రీన్ పై successfully అని వస్తుంది.


దీనిని ప్రింట్ తీసుకొని దానిని DDO ద్వారా MR క్లెయిమ్ దరఖాస్తు కి జతచేసి CSE కి పంపాలి.












0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top