Friday 25 May 2018

Maintaining Student's Admission Cum Withdrawal Register




Maintaining  Student's Admission Cum Withdrawal Register








నమోదు:


1) ప్రతి విద్యార్థికి , ఈ అడ్మిషన్ రిజిష్టర్ రెండు పేజీలు గా ఉంటుంది. ప్రతి మొదటి పేజీ ( ఎడమ వైపున ) పైన స్కూల్ స్టాంప్ ( రౌండ్ స్టాంప్ కాదు ) వేయాలి, రెండవ పేజీ ( కుడి వైపు ) పైన అకడమిక్ సంవత్సరం రాయాలి.


2 ) నమోదు చేసే సమయం లో విద్యార్థి పుట్టిన తేది ని అంకెలలో మరియు అక్షరాలలో తప్పనిసరిగా రాయాలి. తగిన ఆధారాలు అడ్మిషన్ ఫారం తో జత చేయాలి.


3) అడ్మిషన్ తీసుకునే సమయంలో తగిన ఆధారిత సర్టిఫికెట్ లను అడ్మిషన్ ఫారం తో జత చేయాలి. ఉదా: ఆధార్ కార్డు జిరాక్స్, బోనఫైడ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు జిరాక్స్, రికార్డ్ షీట్ ( 1 నుండి 5 తరగతులు ) ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్ ( 6 వ తరగతి మరియు ఆ పైన ) విద్యార్థి లేదా తల్లి / తండ్రి ది కుల ధృవీకరణ పత్రం,


4) అడ్మిషన్ ఫారం లు భద్రపరచడం తప్పనిసరి.  ఎందుకంటే, అడ్మిషన్ రిజిష్టర్ లో రాసే ప్రతి అంశానికి ఈ ఫారమే ఆధారం . భవిష్యత్ లో వచ్చే అన్ని సమస్యలకూ ఇది సమాధానంగా ఉంటుంది.


5 ) నవీన కాలంలో వచ్చిన మార్పులు ( ఆన్ లైన్ విధానం , చైల్డ్ ఇన్ ఫో ) ఇపుడు మార్కెట్ లో దొరికే అడ్మిషన్ ఫారం లు పనికి రావు.


6 ) అడ్మిషన్ ఫారం ను విద్యార్థిని చెర్పించువారే  నింపాలి. ఒకవేళ వారు నిరక్షరాస్యులు అయినప్పుడు మాత్రమే వేరే వారు నింపవచ్చు.


7 ) అడ్మిషన్ ఫారం నింపిన తర్వాత అన్ని వివరాలు మరియు జత చేసిన జిరాక్సు లు సరిగా ఉన్నాయో చూసి క్లర్క్ గాని లేదా ఇంచార్జ్ గారు సంతకం చేయాలి. తర్వాత మరొకసారి అన్ని చూసి ప్రధానోపాధ్యాయులు ధృవీకరిస్తూ సంతకము చేసి స్టాంప్ వేయాలి. ప్రధానోపాధ్యాయులు సంతకం చేయడం తప్పనిసరి.


8 ) అడ్మిషన్ రిజిష్టర్ రాయాల్సిన పని మరియు భాధ్యత పూర్తిగా ప్రధానోపాధ్యాయులుదే. అడ్మిషన్ రిజిష్టర్ లో రాసిన పిదప సంబంధిత తరగతి రిజిష్టర్ ( మొదటి పేజీ ) లో రాసే పని కూడా ప్రధానోపాధ్యాయులు వారిదే. తదుపరి పేజీలలో తరగతి ఉపాధ్యాయులు వారు రాసుకోవాలి.
9 ) విద్యార్థిని అడ్మిషన్ రిజిష్టర్ లో నమోదు చేసిన తర్వాత HM సంతకం చేయడం తప్పనిసరి. కొన్ని రిజిష్టర్ లలో HM సంతకం చేసే వరుస ( రెండవ పేజీ మద్యలో ) లేవు. వరుస లేక పోతే కల్పించుకొని వీలైన ( అడ్మిషన్ వివరాల తర్వాత బాక్స్ లో ఉదా. టీకాల వివరాలు బాక్స్ లో ) దగ్గర సంతకం చేయాలి. నాన్ గెజిటెడ్ అధికారులు అయితే రెడ్ బాల్ పాయింట్ పెన్ తో గెజిటెడ్ అధికారులు అయితే గ్రీన్ బాల్ పాయింట్ పెన్ తో సంతకం చేయాలి.


10 ) ప్రాథమిక పాఠశాల లు అడ్మిషన్ తీసుకునే సమయంలో , అంగన్ వాడి కేంద్రం నుండి ఒక సర్టిఫికెట్ తీసుకోవాలి.


11 ) ఈ రిజిష్టర్ లో స్కెచ్ పెన్ గాని జెల్ పెన్ గాని మరియు ఇంక్ పెన్ గాని వాడకూడదు. కేవలం బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే వాడాలి.


12 ) అడ్మిషన్ రిజిష్టర్ లో అనివార్య కారణాల వల్ల ఏవైనా తప్పులు జరిగినట్లు అయితే వాటిని దిద్ద కూడదు, వైట్ నర్ వాడ కూడదు, రౌండ్ అప్ చేసి పైన రాసి HM సంతకం చేయాలి.


13 ) కొన్ని కారణాల వల్ల పాత రికార్డ్ మార్చ వలసివస్తే తగిన ఆధారాలు అడ్మిషన్ రిజిష్టర్ కు జత చేయాలి, కారణం ఆ లైన్ లో చివరన రిమార్క్ లో రాయాలి. మార్చిన చోట HM సంతకం చేయడం తప్పనిసరి. ఈ సమస్య ప్రాథమిక పాఠశాల లో తరచూ ఎదురౌతుంది. తల్లి తండ్రి నుండి డిక్లరేషన్ తీసుకోవడం తప్పనిసరి. ఈ డిక్లరేషన్ ను రిజిష్టర్ కు అంటించాలి.


14 ) ఒకటో తరగతి లో చేర్చుకునే సమయంలో పిల్లలకు పుట్టు మచ్చలు రాకపోవచ్చు, అలాంటప్పుడు పుట్టు మచ్చలు ఎపుడు వస్తే అపుడు నమోదు చేయాలి. పని సులభం కొరకు T.C ఇచ్చే సమయంలో తప్పక నమోదు చేయాలి. పుట్టు మచ్చలు నమోదు చేయునప్పుడు బహిరంగ కనపడే భాగాలు అనగా ముఖం,చేతులు,కాళ్ళు పై ఉండే వాటిని మాత్రమే రాయాలి. ఒక వేళ అక్కడ కూడా పుట్టు మచ్చలు లేకపోతే బర్ర లు గాని ఇంకేమైనా గుర్తులు గాని రాయాలి. ఖచ్చితంగా రెండింటిని రాయాలి.


15 ) R.S / T.C ఇచ్చినపుడు అడ్మిషన్ నంబర్ పై గుండ్రం గా రాయడం పరిపాటి. ఇలా రాయడం తప్పని సరి కాదు. కానీ, ఇలా రాస్తే ఆ విద్యార్థి కి R.S / T.C ఇచ్చామా లేదా గుర్తు పట్టడం సులభం గా ఉంటుంది.


16 ) పోయిన సంవత్సరం వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం , విద్యార్థి యొక్క ఆధార్ కార్డు నెంబర్ అడ్మిష్ రిజిష్టర్ లో తప్పకుండా రాయాలి. కానీ, దీని కొరకు ప్రత్యేకంగా కాలం ( బాక్స్ ) లేదు. అందువలన పుట్టు మచ్చలు రాసే వద్ద రాయవచ్చు.
నిష్క్రమణ:


17 ) నిష్క్రమణ ( విత్ డ్రా )  లకు ప్రత్యేకంగా ఒక రిజిష్టర్ పెట్టడం చాలా అవసరం. దీని వల్ల ఒక సంవత్సరం లో ఎంత మంది బడి నుంచి వెళ్లిపోయారు ? , ఎక్కడికి వెళ్లారు? ఎందుకు వెళ్లారు ? అనే వివరాలు తెలుస్తాయి. పైగా ఆన్ లైన్ లో ( చైల్డ్ ఇన్ ఫో ) లో వివరాలు ఎడిట్ చేయవలసి వచ్చినప్పుడు ఈ రిజిష్టర్ లేకుండా ఎడిట్ చేయలేము.


18 ) విద్యార్థి బడి ని వదిలి వెళ్లి పోయినప్పుడు, తనకు రెండు బొనఫైడ్ లు , R.S లేదా T.C , ప్రోగ్రెస్ రిపోర్ట్, హెల్త్ కార్డు ఇవ్వాలి. ఇలా ఇచ్చేటప్పుడు ప్రధానోపాధ్యాయులు గారు, అడ్మిషన్ రిజిష్టర్ లో విద్యార్థి వదిలి వెళ్లి న తేదీ మరియు తరగతి నమోదు చేసి ఉన్నదో సరి చూసుకుని చివరి వరసలో సంతకం చేయాలి. అనగా అడ్మిషన్ రిజిష్టర్ లో H M సంతకం చేసిన తర్వాత మాత్రమే పై సర్టిఫికెట్ లు విద్యార్థికి అందజేయాలి. లేనిచో విద్యార్థి కి తీరని నష్టం వాటిల్లుతుంది.


19) గతం లో H M లు, అడ్మిషన్ రిజిష్టర్ లో H M సంతకం చేసిన తర్వాత మాత్రమే పై సర్టిఫికెట్ లు విద్యార్థికి అందజేయాలి  ఇలా చేయక పోవడం వల్ల ఇప్పుడు విద్యార్థి కి బోనఫైడ్ ఇవ్వటానికి అటెండెన్స్ రిజిష్టర్ లు , మార్కు ల రిజిష్టర్ లు వెతక డానికి రెండు రోజులు సమయం పడుతుంది ఒక వేళ వివరాలు దొరకక పోతే బోనఫైడ్ ఇవ్వలేని పరిస్తితి తరచూ ఎదురౌతుంది.


20 ) అడ్మిషన్ రిజిష్టర్ లో ఎక్కడైనా చిరిగి పోతే అక్షరాలు కన పడే విధంగా సెల్లో టేప్ తో అతికించారు. అట్ట లాంటివి అక్షరాలు లేని చోట చిరిగితే గమ్ తో ఎప్పటికప్పుడు అతికిస్తు ఉండాలి. 


21 ) విద్యార్థి కి ఇచ్చే ప్రతి T.C మీదా నంబర్ ఉంటుంది. ఎందుకంటే T.C బుక్ D.E.O ఆఫీసు నుండి వస్తాయి. సరిగ్గా ఇలాగే ప్రాథమిక పాఠశాలలో రికార్డ్ షీట్ లు మార్కెట్ లో దొరుకుతాయి. వీటిని విద్యార్థులకు ఇష్యూ చేసేటప్పుడు వీటికి కూడా నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఉదా. వరుస నెంబర్/సం, 01/2018, 02/2018....ఒక విద్యార్థి కి రెండు రాసి ఒకటి విద్యార్థికి మరొకటి ఆఫీస్ లో భద్ర పరచాలి.


22 ) ఒక వేళ విద్యార్థి తనకు ఇచ్చిన రికార్డ్ షీట్ పోగుట్టుకున్నట్లు అయితే మరొకటి ఇష్యూ చేసేటప్పుడు విద్యార్థి లేదా తండ్రి దగ్గర నుండి డిక్లరేషన్ తీసుకోవాలి. మరొకటి ఇష్యూ చేసేటప్పుడు అదే నంబర్ రాసి కుడి వైపు పై భాగాన రెడ్ పెన్ తో డూప్లికేట్ అని రాయాలి


23 ) ప్రాథమిక, ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాల లోనూ మరియు అన్ని రకాల విద్యా సంస్థల లో నూ పై సర్టిఫికెట్ లను జారీ చేసిన సమయంలో , పై సర్టిఫికెట్ లు ఆన్ని విద్యార్థి కి ముట్టినట్టుగా విద్యార్థుల నుండి సర్టిఫికెట్ ల పేర్లతో సహా సంతకం తీసుకోవడం తప్పనిసరి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top