మౌలిక నిబంధన FR-49 ఏం చెబుతోంది
✔ ప్రభుత్వం ఉద్యోగిని ఒకేసారి రెండు పోస్టులలో నియమించవచ్చును.
✔ ఒక ఉద్యోగి తన బాధ్యతతో పాటు మరొక ఖాళీ పదవి నిర్వహణ బాధ్యత అప్పగించినపుడే "అదనపు చార్జి" గా పరిగణిస్తారు.కొత్తగా సృష్టించిన పోస్టులకు గాని,నాల్గవ తరగతి పోస్టులకు 'అదనపు చార్జి' వర్తించదు.
✔ అదనపు చార్జికి అదనపు వేతనం పొందాలంటే కనీసం 14 రోజుల పనిదినాలుండాలి.
✔ మొదటి 3 నెలలకు మూలవేతనం (Basic Pay) పై 1/5 వంతు వేతనము, తదుపరి 3 నెలలకు 1/10 వంతు వేతనము FAC అలవెన్స్ పేరుతో చెల్లించెదరు.
✔ మొదటి 3 నెలలకు మంజూరుచేయు అధికారం RJD లకు ఇవ్వబడింది.
(C&DSE Rc.No.1827/C2/2009 , Dated: 25-11-2010)
✔ తదుపరి 3 నెలల అలవెన్స్ C&DSE మంజూరు చేయును.
✔ 6 నెలలకు మించి అదనపు వేతనాన్ని పొందటానికి అనుమతించరాదు.
(G.O.Ms.No.197 F&P , Dated:04-07-1964)
0 Post a Comment:
Post a Comment