Saturday 24 April 2021

కరోనా వ్యాక్సిన్ రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి? పరిశోధనలు ఏం చెబుతున్నాయి ?

కరోనా వ్యాక్సిన్ రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి? పరిశోధనలు ఏం చెబుతున్నాయి ?



 కరోనా వ్యాక్సిన్ రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి? ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా నడుస్తున్న సమయంలో ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం చాలా అవసరం. రెండో డోసు ఎప్పుడు తీసుకుంటే ఏం జరుగుతుంది? అసలు రెండో డోసు తీసుకున్న తర్వాత కూడా కరోనా వచ్చే అవకాశం ఉందా? వస్తే దాని తీవ్ర ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ చూడండి.

పరిశోధనల ఫలితాలు రెండో డోసును 4 నుంచి 8 వారాల మధ్య ఎప్పుడైనా తీసుకోవచ్చని చెబుతున్నాయి. కానీ 4 నుంచి 12 వారాలు ఎందుకు? దీనికి బలమైన కారణమే ఉంది. అది తెలుసుకోవాలంటే అసలు వ్యాక్సిన్ కరోనా నుంచి మనకు అందించే రక్షణ గురించి తెలుసుకోవాలి. వ్యాక్సిన్ వల్ల మనకు రెండు రకాలుగా రక్షణ కలుగుతుంది.

సామర్థ్యం రకం 1: స్వల్ప/మోస్తరు స్థాయి కొవిడ్ నుంచి వ్యాక్సిన్ ఎంత రక్షణ కల్పిస్తుంది.

సామర్థ్యం రకం 2: తీవ్రమైన అస్వస్థత (హాస్పిట్‌లో చేరాల్సి రావడం లేదా మరణం) విషయంలో ఎంత రక్షణ కల్పిస్తుంది.

సహజంగానే రెండోదే మనల్ని ఎక్కువగా భయపెడుతుంది. అయితే దీని విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిశోధనలు చెబుతున్నాయి. తొలి డోసు తీసుకున్న 21 రోజుల తర్వాత రెండో డోసు తీసుకుంటే తీవ్రమైన అస్వస్థతకు గురయ్యే అవకాశమే లేదని పరిశోధనలు తేల్చాయి. అంటే 21 రోజుల తర్వాత రెండో డోసు తీసుకుంటే కరోనా కారణంగా మీరు హాస్పిట్‌లో చేరాల్సిన అవసరం దాదాపు రాదు.

కానీ స్వల్ప నుంచి మధ్యస్థ స్థాయి కరోనా బారిన పడే అవకాశం మాత్రం 35 శాతం వరకు ఉంటుంది. అంటే తొలి రకం నుంచి మనకు 65 శాతం రక్షణే లభిస్తుంది. ఇక్కడే మనం రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలన్నదానిపై స్పష్టత రావాలి.

4 వారాల తర్వాత: 

ఒకవేళ రెండో డోసును 21 రోజులు తర్వాత కాకుండా 4 వారాల తర్వాత తీసుకుంటే స్వల్ప/మోస్తరు స్థాయి కరోనా నుంచి 70 శాతం వరకు రక్షణ లభిస్తుంది. (ఇంకా 30 శాతం ప్రమాదం ఉన్నట్లే).

8 వారాల తర్వాత: 

అదే రెండో డోసును 8 వారాల తర్వాత తీసుకుంటే 75 శాతం వరకు రక్షణ పొందవచ్చు.

12 వారాల తర్వాత: 


ఇక వ్యాక్సిన్ రెండో డోసును 12 వారాల తర్వాత తీసుకుంటే స్వల్ప/ మోస్తరు స్థాయి కరోనా నుంచి 80 శాతం రక్షణ లభిస్తుంది. అంటే కేవలం 20 శాతం మాత్రమే కరోనా బారిన పడే అవకాశాలు ఉంటాయి.

వ్యాక్సిన్ తీసుకున్న 21 రోజుల తర్వాత నుంచే అది పూర్తి స్థాయిలో పని చేస్తుంది. ఈ పరిశోధనలు ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్‌)కు సంబంధించి మాత్రమే జరిపినవి. అవి కూడా దీర్ఘకాలిక వ్యాధులు లేని వాళ్ల విషయంలోనే వ్యాక్సిన్ పనితీరు ఇలా ఉంటుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top