Monday 23 December 2019

MANABADI: Naadu-Nedu- Opening of Bank account in favour of Head Master, concerned field Engineer and 5 parent committee members. District Educational Officer , GUNTUR. Rc.No.8880/D3/2019, Dated: 23-12-2019.




Rc.No.8880/D3/2019              Dated: 23-12-2019

MANABADI: Naadu-Nedu- Opening of Bank account in favour of Head Master, concerned field Engineer and 5 parent committee members. District Educational Officer , GUNTUR










 ‘నాడు-నేడు’కు ఎంపికైన పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను ఖర్చుచేయడం నుంచే ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. గత ఉదంతాలను దృష్టిలో పెట్టుకుని  నిధుల వినియోగాన్ని బాగా కఠినతరం చేసింది. ప్రతి వ్యయానికీ చెక్కు ద్వారానే చెల్లింపులు చేయాలని సూచించి ఆమేరకు చెక్‌పవర్‌ వినియోగాన్ని కట్టుదిట్టం చేసింది. ఏదైనా చెక్కుచెల్లుబాటు కావాలంటే దానిపై ఐదుగురు సభ్యులతో కూడిన పాఠశాల యాజమాన్య కమిటీ సంతకాలు చేయాలి. నాడు-నేడు కింద ఎంపికైన పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం కావటంతో జిల్లా విద్యాశాఖ అధికారి చెక్‌పవర్‌ వినియోగానికి సంబంధించిన సంయుక్త సంతకాల కమిటీ వివరాలను ఈనెల 28కల్లా తయారుచేసి తనకు పంపాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాలల వారీగా అభివృద్ధి పనులు రూపొందించి ఆ పనుల నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించింది. ఈ పనులు జనవరిలో ప్రారంభించి వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు  పునఃప్రారంభమయ్యే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పనుల నిర్వహణ బాధ్యతలను పూర్తిగా పాఠశాల యాజమాన్య కమిటీలకే అప్పగించింది. చెక్కుపై సంతకం చేసే ఐదుగురు సభ్యుల్లో తప్పనిసరిగా ముగ్గురు మహిళలై ఉండాలి. మరో ఇద్దరు ఎస్సీ, ఎస్టీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  జిల్లాలో మొదటి విడతలో 1300 పాఠశాలలను అభివృద్ది చేయాలని నిర్ణయించారు.  ఈ పనులను మూడు ప్రభుత్వ శాఖల ద్వారా చేపడుతున్నారు. చెక్‌పవర్‌ వినియోగ సభ్యుల్లో ఒకరు తప్పనిసరిగా సంబంధిత పనులు చేపట్టే శాఖకు చెందిన ఫీల్డ్‌ ఇంజినీర్‌. జిల్లాలోని అందరు ఎంఈఓలు చెక్కు పవర్‌ కమిటీలు ఏర్పాటు చేసి వారి వివరాలను ఈనెల 28 నాటికి అందజేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌.ఎస్‌.గంగాభవానీ ఆదేశించారు.



- జాయింట్ అకౌంట్  7 గురు సభ్యులు  తో ఓపెన్ చెయ్యాలి.

- 7 సభ్యుల్లో 5 గురు పేరెంట్స్ కమిటీ సభ్యులు(ఇందులో కచ్చితంగా 3 మహిళా సభ్యులు మరియు 5 గురు సభ్యుల్లో ఇద్దరు SC/ST సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి)

- ఆ స్కూల్ హెడ్ మాస్టర్ మరియు మండల స్థాయి ఇంజినీర్(AE)తో  ఉండాలి.

- ఇదివరకు ఉన్న SMC  అకౌంట్ (ప్రస్తుత పేరెంట్స్ కమిటీ అకౌంట్: హెడ్ మాస్టర్ మరియు పేరెంట్స్ కమిటీ చైర్మన్ జాయింట్ అకౌంట్ ) కాకుండా నాడు నేడు కోసం ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చెయ్యాలి.






CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top