Monday 12 July 2021

కార్బన్ డేటింగ్ పద్దతి ద్వారా పురాతన వస్తువుల వయసు ఎలా కనుగొనవచ్చు ?

కార్బన్ డేటింగ్ పద్దతి ద్వారా పురాతన వస్తువుల వయసు ఎలా కనుగొనవచ్చు ?




     సాధారణంగా ఒక కార్బన్ అణువులో 6 ప్రోటాన్లు 6 న్యూట్రాన్లు ఉండటం వల్ల మనం దానిని కార్బన్12 అని అంటారు..అయితే ఈ కార్బన్ లో ప్రోటాన్లు న్యూట్రాన్లు సమంగా ఉండటం వలన ఇది స్థిరంగా ఉంటుంది.

   వాతావరణం లోని నైట్రోజన్ అణువులను కాస్మిక్ రేస్ తాకినప్పుడు ఈ నైట్రోజన్ అనేది 6 ప్రోటాన్లు 8 న్యూట్రాన్లు గల ఒక కార్బన్ అనువుగా మారిపోతుంది దీనిని అప్పుడు కార్బన్ 14 అంటారు ఇందులో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్య తేడా ఉండటం వలన ఇది అస్థిరంగా(unstable) ఉంటుంది. మొక్కలు వాతావరణం లోని కార్బన్ ని తీసుకుంటాయి కనుక ఈ కార్బన్ అణువులు మొక్కలోకి వెళతాయి..మనుషులు జంతువులు మొక్కలను ఆహారంగా తీసుకోవడం వలన ఈ అణువులు మనలోకి చేరతాయి. కాబట్టి మనందరిలోను కార్బన్ 14 మరియు కార్బన్ 12 ఉంటాయి.

   అయితే ప్రతి 1ట్రిలియన్ కార్బన్12 అణువులకు గాను ఒక కార్బన్14 అణువు మాత్రమే ఉంటుంది అంటే ఇక్కడ నిష్పత్తి 1ట్రిలియన్ : 1 అన్నమాట. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి జీవిలో కానీ వాతావరణంలో కానీ ఇదే రేషియో లో కార్బన్12 మరియు కార్బన్ 14 అణువులు ఉంటాయి. ఒక జీవి బ్రతికి ఉన్నంతకాలం కూడా అది ఆహారం తీసుకుంటుంది కాబట్టి ఆ రేషియో అలాగే ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ జీవి చనిపోతే ఆ శరీరంలో అప్పటికే ఉన్న కార్బన్12 అణువులు స్థిరంగా ఉంటాయి కనుక ఆ సంఖ్య అలాగే ఉంటుంది. కానీ కార్బన్14 అణువులు మాత్రం కొంతకాలానికి నైట్రోజన్ గా మారిపోతాయి. ప్రతి 5730 సంవత్సరాల కి ఒకసారి ఆ శిధిలాల లోని కార్బన్14 అణువుల సంఖ్య సగానికి పడిపోతుంది దీనిని Half life అని అంటారు. ఉదాహరణకి ఒక జీవి చనిపోయేనాటికి దానిలో 1000 ట్రిలియన్ కార్బన్12 అణువులు మరియు 1000 కార్బన్14 అణువులు ఉన్నాయి అనుకుందాం. 5730 సంవత్సరాల తరువాత దానిలో కార్బన్12 అణువుల సంఖ్య అలాగే ఉంటుంది కానీ కార్బన్14 అణువుల సంఖ్య 500కి పడిపోతుంది. మరొక 5730 సంవత్సరాల తరువాత కార్బన్14 అణువుల సంఖ్య మరో సగానికి పడిపోయి 250 సంఖ్య కి వస్తాయి. 

   ఈ విధంగా ఒక బయటపడిన శిథిలంలో ఎన్ని కార్బన్12 అనువులకి గాను ఎన్ని కార్బన్ 14 అణువులు ఉన్నాయో అనే నిష్పత్తి బట్టి ఆ జీవి చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుందో శాస్త్రవేత్తలు తెలుసుకుంటారు. ఈ కార్బన్ డేటింగ్ ని ఉపయోగించి సుమారుగా 60,000 సంవత్సరాల పూర్వం వరకు మనం లెక్కించవచ్చు.

   ఒకవేళ అంతకన్నా పూర్వం వాటిగురించి తెలుసుకోవాలి అంటే ఏ ఎలిమెంట్ కి అయితే half life ఎక్కువగా ఉంటుందో చూసి వాటి ఆధారంగా లెక్కిస్తారు. ఉదాహరణకి కార్బన్ 14 half life 5730 సంవత్సరాలు కదా అదే plutonium 239 half life తీసుకుంటే 24110 సంవత్సరాలు అదే uranium 235 half life తీసుకుంటే 70 కోట్ల సంవత్సరాలు. ఈ విధంగా బాగా పురాతనమైన వాటి వయసు తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు half life ఎక్కువగా ఉన్న ఎలెమెంట్స్ ద్వారా కనుక్కుంటారు.

ఈ విధంగా పురాతన వస్తువుల వయసు తెలుసుకోవాలి అనపుడు ఇలా కార్బన్ డేటింగ్ పద్దతి ద్వారా తెలుసుకుంటారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top