Saturday 24 April 2021

కరోనా వ్యాధిలో CT స్కాన్ (సిటీ స్కాన్) గురించి కచ్చితంగా తెలుసుకోవలసినవి - డాక్టర్ యలకల సురేష్ కుమార్

కరోనా వ్యాధిలో  CT  స్కాన్ (సిటీ స్కాన్) గురించి కచ్చితంగా తెలుసుకోవలసినవి - డాక్టర్ యలకల సురేష్ కుమార్




ఇవాళ  చాలామందికి కరోనా ఉన్నదా ? లేదా ? అని తెలుసుకోవడానికి మరియు కరోనా జబ్బు వచ్చిన తర్వాత ఎలా ఉంది,ఎంత తీవ్రత వుంది అని తెలుసుకోవడానికి సిటీ స్కాన్ చేస్తున్నారు.


ఈ సిటీ స్కాన్ రెండు పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి.

ఒకటి  "CORADS"

రెండు "CT Severity Index"

1. CORADS :


దీనిలో స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు ఉంటాయి.

CORADS అనేది సిటీ స్కాన్ ప్రకారము కరోనా ఉండే అవకాశాలు ఎంత ? అని మాత్రమే తెలుసుకోవడానికి వీలుంటుంది._

అంటే స్టేజ్ 1 నుంచి 6 వరకు పెరిగేకొద్దీ కరోనా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నది అని మాత్రమే చెబుతుంది,స్టేజ్ పెరిగితే వ్యాధి తీవ్రత పెరుగుతుంది అని మాత్రం కాదు._

🔆 "CORADS 1" --- ఏమి ఇబ్బంది లేదు.

🔆  "CORADS 2" --- సిటీ స్కాన్లో కొంచెం తేడా ఉంది కానీ అది కరోనా వల్ల అయి ఉండకపోవచ్చు._

🔆  "CORADS 3" --- సిటీ స్కాన్లో కొంచెం తేడా ఉంది లేదా నెమ్ము లక్షణాలు ఉన్నది కానీ అది కరోనా వల్ల లేదా వేరే జబ్బు వల్ల వచ్చిందా అని  తెలియడం లేదు._

🔆  "CORADS 4" ---  సిటి స్కాన్ బాగాలేదు,సిటి స్కాన్లో కనిపిస్తున్న ఈ లక్షణాలు చాలావరకు కరోనా వల్లనే అనిపిస్తుంది.

🔆  "CORADS 5" --- ఇది ఖచ్చితంగా కరోనా అని సీటీస్కాన్ చెప్తుంది.

🔆  "CORADS 6" --- సిటీ స్కాన్లో నెమ్ము లక్షణాలు కనిపిస్తూ "RTPCR" లేక "Rapid Antigen Test' పాజిటివ్ ఉంటే అది Stage 6 అవుతుంది._

అందువల్ల ఈ CORADS క్లాసిఫికేషన్ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు వరకు సిటీ స్కాన్ చూసి కరోనానా? లేదా? అని చెప్పడానికి మాత్రమే పనికొస్తుంది , స్టేజ్ పెరిగితే వ్యాధి తీవ్రత పెరుగుతుంది అని  ఏమాత్రం కాదు. _

2. CT Severity Index :


_మనకి రెండు ఊపిరితిత్తులు ఉంటావి ఒకటి కుడిపక్క ,రెండవది ఎడం పక్క ఈ కుడి పక్కన ఊపిరితిత్తిలో మూడు లోబులు (మూడు భాగాలు) ఉంటాయి అంటే మూడుగా విభజించబడి వుంటుంది, ఎడమ పక్క ఊపిరితిత్తిలో రెండు లోబ్స్ ఉంటాయి అంటే రెండుగా విభజించబడి ఉంటుంది. మొత్తం రెండు ఊపిరితితతుల్లో మనకు 5 భాగాలుగా ఉంటాయి._

_ఈ సిటి సివియారిటి ఇండెక్స్ ( CT Severity Index ) 0 నుంచి 25 వరకు ఉంటుంది. అంటే ఒక్కొక్క లోబ్లో 0 నుంచి 5 పాయింట్లు ఇస్తారు. 5 x 5 మొత్తం పాయింట్లు 25 అవుతుంది._

_ఈ జీరో నుంచి ఐదు పాయింట్లు అనేది ఊపిరితిత్తులు ఎంత చెడిపోయింది అన్న దానిని బట్టి ఈ పాయింట్లు పెరుగుతాయి._

_"0 : ఏమీ ఇన్ఫెక్షన్ లేదు"_
_"1 : 5% కన్నా తక్కువగా ఉంది"_
_"2 : 5 - 25  పర్సెంట్"_
_"3  :25 - 50%"_
_"4 : 50-  75%"_
_"5 : 75 పర్సెంట్ కన్నా ఎక్కువగా దెబ్బతిన్నది"_

 ఒక్కొక్క లోబ్లో జీరో నుంచి ఐదు స్టేజి వరకు తీసుకొని 5 x 5 = 25 స్కోర్ అవుతుంది ఈ స్కోర్ 8 కన్నా తక్కువ అయితే .Mild (తక్కువగా వుంది),8 నుంచి 15 అయితే Modarate (ఒకమొస్తరిగా), 15 కన్నా ఎక్కువ అయితే Severe ( ఎక్కవగా), ఊపిరితిత్తులు ఎంత దెబ్బతిన్నది అని తెలుసుకోవడానికి ఈ స్కోర్ ఉపయోగపడుతుంది._

_కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే అది ఆ రోజు సిటీ స్కాన్ చేయించిన రోజు ఎంత దెబ్బ తిన్నవి అని మాత్రమే తెలియజేసినది.వ్యాధి పెరుగుతున్నకొద్దీ ఈ స్కోరు  పెరుగుతుంది._

_అంటే డాక్టర్లు ఈ సిటీ స్కాన్ని వ్యాధి పెరుగుతుందా లేదా అని మరియు ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవడానికి కూడా ఒక్కొక్కసారి మళ్ళీ చేయవలసి వస్తుంది. _

_కాని పెరుగుతుందా లేదా తెలుసుకోవడానికి డాక్టర్ని మాత్రమే సంప్రదించవలెను. సొంతంగా వెళ్లి సిటీ స్కాన్ చేయించుకున్న ఎడల డబ్బులు వృధా అవుతాయి,అనవసరంగా ఎక్కువసార్లు సీటీ స్కాన్ చేయించుకోవడం వల్ల రేడియేషన్ కూడా వస్తుంది._

_అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ Pulse Oximeter  చెక్ చేసుకుంటే మనం కూడా గమనించవచ్చు._

_ఈ పల్స్ ఆక్సిమీటర్లో SPO2 అనేది 93 కన్నా ఎక్కువ ఉండాలి, 93 శాతం కన్నా తక్కువ ఉంటే మన ఊపిరితిత్తులు సరిగా పనిచేయడం లేదని అర్థం._

_ ఈ CORADS  క్లాసిఫికేషన్ స్టేజ్ 1 - 6   అనేది  కరోనా ఉండే అవకాశాలు ఎంత అని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అది వ్యాధి తీవ్రత తెలియజేయదు._

_CT Severity Index ఊపిరితిత్తులు ఎంత దెబ్బ తిన్నవి వ్యాధి తీవ్రత ఎంత ఉంది అని తెలియజేస్తుంది._

_ఈ సిటీ స్కాన్లో  వ్యాధి ఎలా వుంది ఎంత తీవ్రత వుంది అని చెప్పడానికి మరో నాలుగు పదాలు వాడుతూ ఉంటారు.

"Ground Glass Appearance"

"Crazy Paving Pattern"

"Consolidation"

"Gradual Resolution"

_ఈ Ground Glass అనగా ఒక ఐదు రోజుల లోపు కరోనా అటాక్  అయివుంటుంది._

_5 రోజుల నుంచి 10 రోజుల్లో ఈ క్రేజీ పేవింగ్ పేటరన్ కనిపిస్తుంది..._

_10 నుంచి 13 రోజులులో కన్సాలిడేషన్ లాగా అనిపిస్తుంది..._

_14 రోజుల తర్వాత అయితే గ్రాడ్యువల్ రిజల్యూషన్లా  CT స్కాన్లో కనిపిస్తుంది._

_ఇవన్నీ మనము కొంచెం సిటిస్కాన్ గురించి తెలుసుకోవడానికి మాత్రమే,పూర్తిగా అవగాహన కోసం డాక్టర్ని సంప్రదించాలి._

"డాక్టర్. యలకల సురేష్ కుమార్, ప్రముఖ డాక్టర్, రాజాం శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్."

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top