Sunday 15 November 2020

AP TEACHER TRANSFERS 2020 : : IMPORTANT POINTS TO TEACHERS - LAST DATE TO SUBMISSION OF APPLICATIONS IS 16-11-2020.

AP TEACHER TRANSFERS 2020 : : IMPORTANT POINTS TO TEACHERS

LAST DATE TO SUBMISSION OF APPLICATIONS IS 16-11-2020 




✔ బదిలీకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 16-11-2020. ఈ తేది తరువాత గడువు పొడిగించబడదు.


✔18.11.2012 కి ముందు జాయిన్ అయిన ఉపాధ్యాయులు  అనగా 8 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నవారు మరియు  రేషనలైజేషన్లో పోస్టు బదిలీ చేయబడిన ఉపాధ్యాయులందరు తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి.

☑ అలా చేసుకోని పక్షంలో,కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత చివరలో మిగిలిన ఖాళీలలో ఎక్కడపడితే అక్కడ వేస్తారు. వారు ఆప్షన్ కోరుకునే అవకాశాన్ని కోల్పోతారు.


✔ స్పోజ్ కేటగిరీ లో దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులు ఆప్షన్స్ ను ఇచ్చుకొనేటప్పుడు.. వారి స్పోజ్ కి అతి దగ్గర ఖాళీలను ప్రాధాన్యతా క్రమంలో ఇచ్చుకోవాలి. ఎక్కువ HRA ఉన్న ఖాళీలను ప్రాధాన్యతగా ఇచ్చి అతిదగ్గరగా ఉండే ఖాళీలను తరువాత ప్రాధాన్యత క్రమంలో ఇవ్వరాదు.


✔ ప్రిఫరెన్సియల్ కేటగిరీ లో ,..వైద్య కారణాలతో దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులు కాంపిటెంట్ అథారిటీ/ మెడికల్ బోర్డ్ నుంచి గత 6 నెలలలో తెచ్చుకున్న సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి.


✔ప్రిఫరెన్సియల్ కేటగిరీ లేదా స్పోజ్ కేటగిరీ లలో ఎదో ఒకదాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి.


✔ 8 సంవత్సరాలు పూర్తి కాకుండానే ఇప్పటి బదిలీల్లో మళ్ళీ  ప్రిఫరెన్సియల్ కేటగిరీ లేదా స్పోజ్ కేటగిరీ లలో ఎదో ఒకదాన్ని ఏ ఉపాధ్యాయుడు/ ఉపాధ్యాయని ఉపయోగించరాదు.


✔ 8 సంవత్సరాలు పూర్తి కాకుండానే ఇప్పుడు రేషనలైజేషన్ లో పోస్ట్ షిఫ్ట్ అయ్యుంటే ఆ ఉపాధ్యాయుడు మళ్ళీ  ప్రిఫరెన్సియల్ కేటగిరీ లేదా స్పోజ్ కేటగిరీ లో ఎదో ఒక దాన్ని ఉపయోగించుకోవచ్చు.


✔ అక్టోబర్-2020 లో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు ప్లేస్ కోసం దరఖాస్తు చేసుకోనవసరం లేదు. పదోన్నతి పొందిన వారి వివరాలు డిఇఓ ఆఫీస్ వారు నమోదు చేస్తారు. ప్లేస్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది.

✅ బదిలీకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు MRCకు చేర్చవలసినవి...

1 .Onlineలో దరఖాస్తు చేసుకుని download చేసుకున్న Application.

2. School Service Certificate.

3. Total Service Certificate. 

4. Rationalisationలో బదిలీ అవుతుంటే Rationalization Certificate.

5. 8సంవత్సరాలు పూర్తయిన వారు 8years declaration certificate.

6. Female Un married categoryవారు Unmarried declaration certificate.

7. Spouse category లేదా Preferential category ఉపయోగించుకుంటుంటే సంబంధిత Certificate.

🔅 పై చెప్పినవన్నీ 3 జతలు చేసి MRCకు  చేర్చవలెను.


Note: Spouse category/Preferential కు సంబంధించిన వారు Certificate,  సంబంధిత Documents Original మరియు S.R కూడా Applicationతో పాటు ఇవ్వాలి.

 

❌ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా దానికి ఆ ఉపాధ్యాయులదే భాద్యత  మరియు ఆ ఉపాధ్యాయుల పై ఉన్నతాధికారులచే చర్యలు తీసుకొనబడును.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top