Wednesday 28 October 2020

పదో తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.. NTSE పరీక్ష షెడ్యూల్ ఇదే...

 పదో తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.. NTSE పరీక్ష షెడ్యూల్ ఇదే...





NTSE Exam Dates: పదో తరగతి విద్యార్థుల కోసం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) నిర్వహించే టాలెంట్ టెస్ట్ షెడ్యూల్ విడుదలైంది. NTSE తొలిదశ పరీక్షలు డిసెంబర్ 12-13వ తేదీల్లో నిర్వహించనుండగా.. రెండో దశ పరీక్షలు 2021, జూన్ 13న జరగనున్నాయి. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 2 వేల మంది విద్యార్థులుకు.. ఇంటర్‌కు వెళ్లాక నెలకు రూ. 1250, అలాగే డిగ్రీ, పీజీల్లో రూ.2000 స్కాలర్‌షిప్‌ను అందజేస్తారు.

NTSE పరీక్షకు పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు కాగా.. వారు తొమ్మిదో తరగతిలో 60 శాతం మార్కులు ఖచ్చితంగా సాధించాలి. అంతేకాదు విద్యార్థులు తప్పనిసరిగా ఆయా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని గుర్తింపు పొందిన పాఠశాలలలో చదువుతుండాలి. కాగా, తొలిదశ పరీక్షల అడ్మిట్ కార్డు నవంబర్ చివరి వారంలో విడుదల చేయనున్నారు. దాన్ని అఫీషియల్ వెబ్‌సైట్ ciet.nic.in ద్వారా విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, అండమాన్ నికోబర్ ఐలాండ్స్‌లో తొలిదశ ఎగ్జామ్ డిసెంబర్ 12న జరగనుండగా.. దేశంలోని మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో డిసెంబర్ 13న నిర్వహిస్తారు. ఈ టాలెంట్ పరీక్ష గురించి పూర్తి వివరాల కోసం ncert.nic.in ను సంప్రదించవచ్చు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top