Monday 30 April 2018

LEAVES FOR WOMEN EMPLOYEES



LEAVES FOR WOMEN EMPLOYEES



ప్రభుత్వాలు మహిళలకు ప్రత్యేక సెలవులను కేటాయించాయి. పర్మినెంట్ ఉద్యోగులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలతో కూడిన సెలవులు, వేతనాలు లేకుండా సెలవులు తీసుకునే అవకాశం కల్పించారు.



🛑 పంచాయతీ కార్యదర్శులకు:

➡  గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న మహిళా కార్యదర్శులు గర్భం దాల్చిన సమయంలో 120 రోజులు సెలవు లు ఇస్తారు. ఆ సమయంలో వేతనం చెల్లిస్తారు.

➡  కార్యదర్శులు తమకు అర్హత ఉన్న సెలవులను 120 రోజులు ముందు కాని, తరువాత కాని ఉపయోగించుకోవచ్చు.



🛑 కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు:

➡  కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ గర్భిణులకు వంద రోజులు సెలవులు ఇస్తారు. ఈ సమయంలో జీతం ఇవ్వరు... తాత్కాలిక ఉద్యోగులుగా ఉన్న గర్భిణులను ఉద్యోగం నుంచి తొలగించకుండా వేతనాలు లేని 120 రోజుల సెలవులు ఇస్తారు.

➡  అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు నిబంధనల మేరకు ఏడాదికి 15 రోజులు సెలవులు ఇస్తారు. ఈ సెలవులను గర్భిణులు ప్రసూతి సమయంలో ఉపయోగించుకోవచ్చు. ఆ 15 రోజులకూ వేతనం ఇస్తారు.

➡  జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్ట్‌ మహిళా అధ్యాపకులకు 60 రోజులు వేతనం లేని సెలవులు ఇస్తారు.



🛑 స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌లు:

➡  మహిళలకు ప్రత్యేక సాధారణ సెలవులు ఉంటాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న సమయంలో వేతనంతో కూడిన 14 సెలవులను మంజూరు చేస్తారు.

➡  కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ ఫెయిల్‌ అయితే... మళ్లీ రెండోసారి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోవాల్సి వస్తే ఏడు పనిదినాలు వేతనంతో కూడిన సెలవులను ఇస్తారు.

➡  కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న తరువాత పిల్ల లు చనిపోతే... రీకానలైజేషన్‌ ఆపరేషన్‌ చేయించుకుంటే 21 పని దినాలు వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు. దీనికి ఇద్దరుకంటే తక్కువ పిల్లలు ఉండాలి. పుట్టిన మగబిడ్డ చనిపోతే మళ్లీ ఆపరేషన్‌ చేయించుకోవాల్సి వస్తే ఇది వర్తిస్తుంది.

➡  గర్భసంచి తొలగించాల్సి వస్తే 45 రోజులు వేతనంతో కూడిన సెలవు ఇస్తారు.

➡  మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక రోజు వేతనంతో కూడిన ప్రత్యేక సెలవు ఇస్తారు.

➡  మహిళా ఉపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులకు ఏడాదికి ఐదు పని దినాలు వేతనంతో కూడిన అదనపు సాధారణ సెలవులు మంజూరు చేస్తారు.

➡  జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో మహిళా ఉద్యోగులు పాల్గొంటే ఏ డాదిలో 30 పని దినాలు వేతనంతో కూడిన సెలవు ఇస్తారు.

➡  జాతీయ క్రీడా సంస్థలు, అసోసియేషన్‌లో అధ్యక్ష, కార్యదర్శులుగా ఉండే మహిళా ఉద్యోగులకు ఏడాదికి 15 పనిదినాలు వేతనంతో కూడిన సెలవు ఇస్తారు.

➡  స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో పాల్గొంటే ఏడాదికి పది రోజులు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తారు.

➡  మహిళా ఇంజనీర్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్ల అసోసియేషన్‌ వార్షిక సమావేశానికి వెళితే ఏడాదికి ఏడు రోజులు వేతనంతో కూడిన సెలవు ఇస్తారు. జాతీయ స్థాయి సెమినార్‌లకు హాజరయ్యే మహిళా ఇంజనీర్లకు ఏడాదికి పది పనిదినాలు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తారు.

➡  ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలలో అధ్యక్ష, కార్యదర్శులుగా ఉండే మహిళలకు ఏడాదికి పది పనిదినాలు వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు.

➡  శిశు సంరక్షణ కోసం మహిళా ఉద్యోగులకు 120 పని దినాలు వేతనంలో కూడిన సెలవులు ఇస్తారు. ఒక్కొక్క సంతానానికి 60 రోజుల చొప్పున పిల్లల సంరక్షణ, విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం సెలవులను ఉపయోగించుకోవచ్చు.

➡  మహిళా ఉద్యోగి ఖాతాలో ఏ సెలవులూ లేనప్పుడు అనారోగ్యంతో విధులకు హాజరు కాలేకపోతే (మెడికల్‌ గ్రౌండ్‌) సర్వీస్‌ మొత్తంలో రిటైర్‌ అయ్యే లోపు 180 పనిదినాలు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తారు.



🛑 ప్రసూతి సెలవులు:

➡  మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం ప్రసూతి సెలవు సౌకర్యం కల్పించింది. గర్భం సమయంలో 180 రోజులు సెలవులు తీసుకోవచ్చు. పర్మినెంట్‌ ఉద్యో గులకు వేతనంతో కూడిన సెలవులను ఇస్తారు. దీనిని డ్యూటీగానే పరిగణించి సర్వీస్‌ను కొనసాగిస్తారు.


➡  గర్భిణి 8వ నెల నుంచి ఎప్పుడైనా 180 రోజులు ఉపయోగించుకోవచ్చు.మొదటి, రెండో కాన్పులకు మాత్రమే ప్రసూతి సెలవులు ఇస్తారు. ఒకటి, రెండు కాన్పుల్లో పిల్లలు చనిపోతే మూడో కాన్పులో సెలవులకు అవకాశం ఇస్తారు.

➡  కాన్పునకు ముందుగాని... తరువాత గాని ఉద్యోగికి ఉండే అర్హత సెలవులు (స హజ సెలవులు) ఉపయోగించుకోవచ్చు.

➡  ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో మహిళా ఉద్యోగులకు 120 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవు ఉంటుంది.

➡  అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు 180 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవు మంజూరు చేస్తారు. సెలవుల సమయంలో కూడా గౌరవ వేతనం విడుదల చేస్తారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, సూపర్‌వైజర్లు, డేటా ఎంట్రి ఆపరేటర్లు (డీఈవో), జూనియర్‌ అసిస్టెంట్‌లకు 45 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు.

➡  రెగ్యులర్‌ ఉద్యోగులకు గర్భస్రామైనా లేదా వైద్యులు గర్భం తొలగించినా ఆరువారాలు వేతనంతో కూడిన ప్రసూతి సెలవు ఇస్తారు.








0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top