మధ్యంతర భృతికి డిమాండ్
ప్రభుత్వం వెంటనే మధ్యంతర భృతిని (ఐఆర్) ప్రకటించాలని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ డిమాండ్ చేశారు. మంగళవారం పుత్తూరులో నిర్వహించిన ఉపాధ్యాయుల సమావే శంలో ఆయన మాట్లాడారు. కూటమి నేతలు ఎన్ని కల సమయంలో పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సంక్రాంతి కానుకగా 30 శాతం మధ్యంతర భృతిని మంజూరు చేయాలని కోరారు. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావల్సిన రూ.2500 కోట్ల బకా యిలను వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జూనియర్ కళాశాలల్లో 40 శాతం ప్రమోషన్లను టీచర్లకు ఇవ్వాలని, హై స్కూల్ ప్లస్లను కొనసాగించి, రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అపస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొరస్వామి, నేతలు విజయ్, తేజోమూర్తి, శివ కుమార్, చెన్నకేశవులు, శ్రీరాములు, గజరాజన్, గుర్రప్ప, గిరిబాబు, రాజేంద్రన్, తులసీరామ్, నాగ రత్నం, మాధవి పాల్గొన్నారు.
0 Post a Comment:
Post a Comment