రెండవ కలెక్టర్ల సదస్సు - కోన శశిధర్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి
• బడి ఈడు పిల్లలు (6 సంవత్సరాలు) ఎవరూ బడి బయట ఉండకూడదన్న లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం.
• కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి 1 నుండి 12 తరగతుల విద్యార్థులందరికీ అపార్ ఐడీలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. 78% మంది విద్యార్థులకు అపార్ ఐడీలు జారీ.
• ఉపాధ్యాయుల భారాన్ని తగ్గించడం, కో కరిక్యులర్ కార్యకలాపాలను ప్రోత్సహించడం, ప్రదర్శనలు, విహారయాత్రలను ప్లాన్ చేయడం జరిగింది.
• నీతి మరియు విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నియమితులయ్యారు.
• పాఠ్యప్రణాళిక, డిజిటల్ అవస్థాపన మరియు ఈ-కంటెంట్‌లను సాంకేతికత ఏకీకరణతో మూల్యాంకనం చేశాం. 2025-26 నాటికి సంభావిత అభ్యాసం అమలు చేయబడుతుంది.
పాఠశాల విద్య:
• రాష్ట్రవ్యాప్తంగా 61,343 (ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్) ఇనిస్టిట్యూషన్స్, 79,75,284 మంది విద్యార్థులు, 3,39,827 మంది ఉన్నారు..
• ప్రపంచ బ్యాంకు సహకారంతో సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ (SALT) ప్రాజెక్టు.
పాఠశాల విద్య - SWAT విశ్లేషణ:
• 1. సామర్థ్యాలు, 2. బలహీనతలు, 3. అవకాశాలు, 4. థ్రెట్స్
ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్:
• 21వ శతాబ్దానికి విద్యార్థులను సాంకేతిక, నాయకత్వ, రియల్ లైఫ్ స్కిల్స్ తో సన్నద్ధం చేసేలా చర్యలు తీసుకున్నాం.
• 2030 నాటికి రాష్ట్రంలో నాణ్యమైన విద్యా వ్యవస్ధ నిర్మాణమే లక్ష్యం.
ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు:
• పాఠశాలల్లో చేరిక, నాణ్యమైన సిలబస్, అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకర కార్యక్రమాల నిర్వహణ, ఉపాధ్యాయుల్లో ప్రొఫెషనలిజం పెంచడం.
• ఏపీ టెట్, డీఎస్సీ నిర్వహణ.. వన్ క్లాస్ వన్ టీచర్ కచ్చితంగా అమలు
డీఈవో ఆఫీసుల్లో కాగిత రహిత కార్యకలాపాలు:
మెగా పేరెంట్ - టీచర్స్ మీటింగ్స్:
• రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్ - టీచర్స్ మీటింగ్స్ నిర్వహించడం జరిగింది.
• ఈ కార్యక్రమం ప్రతి ఏడాది డిసెంబర్ 7వ తేదీన నిర్వహించడం జరుగుతుంది.
• హోలిస్టిక్ ప్రొగ్రెస్ కార్డు ఇస్తున్నాం.
18 పారామీటర్స్ – ర్యాంకింగ్స్
• 18 అంశాల ఆధారంగా పాఠశాలలకు ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది.
• మంచి కండిషన్ తరగతి గదులు, కాంపౌండ్ వాల్, ఫంక్షనల్ ఎలక్ట్రికల్ మరియు సోలార్ పిక్చర్స్, నీటితో కూడిన ప్రత్యేక టాయిలెట్లు, ఆర్వో నీటి లభ్యత, వనరులతో కూడిన ప్రత్యేక లైబ్రరీ గది, సౌకర్యాలతో కూడిన ప్లేగ్రౌండ్, చెత్త బుట్టల నిర్వహణ, తరగతి గదుల్లో ఫర్నిచర్, సురక్షితమైన ల్యాబ్‌లు,తరగతి గదుల్లో హై స్పీడ్ ఇంటర్నెట్, ఫంక్షనల్ స్మార్ట్ టీవీలు/ఇంటరాక్టివ్ ప్యానెల్స్, కంప్యూటర్ ల్యాబ్స్, కిచెన్ షెడ్లు.
• ఈ-కంటెంట్ వినియోగం, ఒకేషనల్ ఫెసిలిటీస్, కిచెన్ గార్డెన్, ర్యాంప్‌లు, మరుగుదొడ్లు, సహాయక సాంకేతికత అంశాలపై ఫోకస్ చేశాం.
పారామీటర్స్ - అకడమిక్ స్టార్ రేటింగ్స్:
• స్టూడెంట్ అటెండెన్స్ (20%), టీచర్ అటెండెన్స్ (20%), ఎస్సెస్సీ పెర్ఫార్మెన్స్ (30%), సమ్మేటివ్ అసెస్‌మెంట్ రిజల్ట్స్ (30%) ఆధారంగా స్టార్ రేటింగ్స్ ఇస్తున్నాం.
అపార్ ఐడీ జనరేషన్:
• విద్యార్థులకు శాశ్వత నంబర్ ఇచ్చేందుకు ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ ఎకౌంట్ రిజిస్ట్రీ (అపార్) అమలు చేస్తాం.
• అన్ని దరఖాస్తులను పాఠశాలలో సేకరించాలి.. అన్ని రుసుములకు ఒకేసారి మినహాయింపు ఇవ్వాలి.
• పాఠశాలలో మాత్రమే ఆధార్ నవీకరణ.
టెన్త్ క్లాస్ (ఎస్సెస్సీ) యాక్షన్ ప్లాన్:
• 2025 మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ
• 6,715 ప్రభుత్వ పాఠశాలలు.. 3,70,817 మంది విద్యార్థినీ విద్యార్థులు
• ప్రిపరేషన్ కోసం వీక్లీ క్యాలెండర్‌ను అనుసరించాలి.
• వెనుకబడిన విద్యార్థులను ముందుగానే గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
ఇంటర్మీడియట్ పబ్లిక్ - ఎగ్జామ్ యాక్షన్ ప్లాన్:
• 2025 మార్చి 1 నుండి 20 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ.. 1,463 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 1,89,307 మంది విద్యార్థినీ విద్యార్థులు
• కలెక్టర్లు వారానికి ఒక జూనియర్ కళాశాలను సందర్శించాలి
హయ్యర్ ఎడ్యుకేషన్:
• 98 శాతం మంది విద్యార్థులకు అపార్ ఐడీలు జనరేట్ చేయడం జరిగింది.
• రాష్ట్రవ్యాప్తంగా 53 యూనివర్శిటీలు, 19.29 లక్షల విద్యార్థులు, 2,601 కాలేజీలు, 4,330 యూనివర్శిటీ ఫ్యాకల్టీ..
మంత్రి లోకేష్ స్పందన:
• ప్రభుత్వ లక్ష్యం జీరో డ్రాప్ అవుట్స్. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరిచి నాణ్యమైన విద్య అందించడం.
• ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న పిల్లల చేరికలు, చదువులు బాగున్నాయి.
• కలెక్టర్లందరూ వీటిపై ఫోకస్ చేయాలి.
• రాబోయే ఐదేళ్లలో విద్యార్థుల అకడమిక్ ప్రోగ్రెస్, పాఠశాలల పనితీరును పర్యవేక్షించడం జరుగుతుంది.
• మధ్యాహ్న భోజన పథకంలో పోషక విలువలు మరింత చేర్చాలి.
• హాస్టళ్లలో బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, కచ్చితంగా శానిటేషన్ చేయాలి.
• గత పేరెంట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలి.
• కేజీ నుంచి పీజీ వరకు బెటర్ కరిక్యులమ్ ఉండాలి. గత ఐదేళ్లు దీన్ని పట్టించుకోలేదు..
ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన:
• నాలెడ్జ్ విషయంలో తెలుగు పిల్లలు నెంబర్ వన్ గా ఉండాలి.
• ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం ఉండాలి.
• ఫ్యూచర్ కు అనుగుణంగా కరిక్యులమ్ మారుస్తూ ఉండాలి.
• ఫంక్షనల్ యూనివర్శిటీస్ ను తీసుకుని రావాలి.
• ఎడ్యుకేషన్, స్కిల్స్, ఎంప్లాయ్‌మెంట్ మధ్య బ్యాలెన్స్ ఉండాలి.
• ఒకేషన్ మీద ఫోకస్ పెట్టాలి. డిజిటల్ లెర్నింగ్స్ అన్నీ తీసుకురావాలి.
• సమాజానికి అవసరమవుతున్న ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ ముందుకు వెళ్లాలి.
• స్కిల్ డెవలప్‌మెంట్ ఎడ్యుకేషన్‌లోకి రావాలి.
• స్కిల్ డెవలప్ మెంట్ లో రిజల్ట్ చాలా డల్ గా ఉంది. టెక్నికల్ స్కిల్స్ పెంచాలి.
0 Post a Comment:
Post a Comment