Wednesday, 13 November 2024

APAAR జనరేషన్ ప్రక్రియలో సందేహాలు - సమాధానాలు

 APAAR జనరేషన్ ప్రక్రియలో సందేహాలు - సమాధానాలు



👉 ప్రశ్న:  2009 నుంచి 2011 వరకు ఉన్న జనరేట్ అయిన ఆధార్ కార్డ్స్ లో దాదాపు కేవలం year of birth మాత్రమే ఉంది. దాని వలన సరైన date of birth ను identify చేయలేక APAAR generation కావడం లేదు.

✅ సమాధానము:

• బర్త్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఉన్నచో ఆ విధముగా ఆధార్ అప్డేట్ చేయించుకోవలెను

• బర్త్ సర్టిఫికేట్ లేకున్నచో, విధిగా లేట్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఆధార్ అప్డేట్ చేయించుకోవలెను


👉 ప్రశ్న: కొన్ని చోట్ల అడ్మిషన్స్ సమయంలో మరియు TC ఇచ్చే సందర్భంలో వివరాలు తెలుగులో వుండటం వల్ల వాటిని ఇంగ్లీషులో రక రకాల స్పెల్లింగ్ తో రాయటం వల్ల ఆధార్ లోని వివరాలు సరిపోవడం లేదు.

✅ సమాధానము: పాఠశాల విద్యా కమీషనర్ గారి ఉత్తర్వుల సంఖ్య Rc.No.ESE02-22/39/2024-TB SEC-CSE, dated: 07/11/2024 మేరకు తల్లిదండ్రుల డిక్లరేషన్ మేరకు మరలా Admission Register ను సవరించి తద్వారా UDISE PORTAL లో MIS login లో సవరణలు చేసి APAAR జనరేట్ చేయవచ్చు.


👉 ప్రశ్న: పుట్టిన తేదీ ఆధార్ కార్డ్, Date of Birth Certificate మరియు అడ్మిషన్ రిజిస్టర్ లో వేరుగా ఉండటం.

✅ సమాధానము: బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా ఆధార్ అప్డేట్ చేసుకొని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ గారి ఉత్తర్వులు మేరకు అడ్మిషన్ రిజిస్టర్ నందు మార్పు చేసుకోగలరు


👉 ప్రశ్న: గ్రామీణ ప్రాంతాల్లో Date of Birth Certificate పై పేరెంట్స్ కి అవగాహన లేకపోవడం వలన Birth Certificate పొందలేదు.

✅ సమాధానము: ఆధార్ లో ఉన్న పుట్టిన తేదీ వాస్తవం అని తల్లిదండ్రులు ధృవీకరిస్తే, పాఠశాల విద్యాశాఖ కమీషనర్ గారి ఉత్తర్వులు ప్రకారం సంబంధిత HM/MEO/DY.EO లచే అడ్మిషన్ రిజిస్టర్ నందు మార్పు చేయించుకోగలరు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top