విద్యార్థి విజ్ఞాన్ మంధన్ 2022-23 : : భాస్కర స్కాలర్ షిప్ మరియు సృజన్ ఇంటర్న్షిప్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం
● పిల్లల్లో నైపుణ్యం వెలికితీతకు ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్’
● ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
● సెప్టెంబర్ 30దాకా గడువు
● ఆరో తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అవకాశం
● నవంబర్లో జిల్లా, జనవరిలో రాష్ట్ర, మేలో జాతీయ స్థాయి పరీక్ష
● సత్తా చాటితే గుర్తింపు
● నగదు బహుమతులు మరియు నెలకు 2000చొప్పన సంవత్సరం పాటు భాస్కర స్కాలర్ షిప్
● ISRO, CCMB, IICT మరియు ప్రఖ్యాత గాంచిన CSIR ప్రయోగ శాల్లలో 3 వారాల పాటు సృజన్ ఇంటర్న్షిప్ కార్యక్రమం
● శాస్త్రవేత్త లతో ముఖాముఖీ
విద్యార్థుల్లో నైపుణ్యాన్ని, నూతన ఆవిష్కరణలను వెలికి తీసేందుకు డిజిటల్ విధానంలో విజ్ఞాన భారతి, విజ్ఞాన్ ప్రసార్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) సంయుక్తంగా ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్’ పేరిట ప్రత్యేక పోటీ పరీక్ష నిర్వహిస్తున్నాయి.పాఠ్యాంశాలతో పాటు ప్రముఖ శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్ జీవిత చరిత్ర, అజాదీ కా అమృతోత్సవాలలో భాగంగా స్వాతంత్ర్య సంగ్రామంలో శాస్త్రవేత్త ల పాత్ర వంటి అదనపు అంశాల తో ఈ సంవత్సరం ఈ పోటీ పరీక్ష లు ఉంటాయి.
Vidyarthi Vigyan Manthan (విద్యార్థి విజ్ఞాన్ మంథన్VVM) - జాతీయ స్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణా పరీక్ష
www.vvm.org.in
★ Organisers : కేంద్ర ప్రభుత్వ సంస్థలైన NCERT, Vigyan Prasar& ViBha
★ పరీక్షా విధానం : విద్యార్థులు వారి Android Mobile/Tab/Laptop/Desktopల ద్వారా Online విధానంలో
★ అర్హత : 6 నుండి 10 మరియు 11 తరగతి (Intermediate 1st Year) చదువు తున్న State Board,CBSE & NCERT విద్యార్థులు అందరూ.
★ పరీక్షా మాధ్యమం : ఇంగ్లీష్, తెలుగు,హిందీ మరియు ఇతర భారతీయ భాషలు.
★ పరీక్ష సిలబస్ : విద్యార్థుల వారి తరగతుల గణితం, సైన్స్ (Physics,Chemistry, Biology) మరియు VVM వారు నిర్దేశించిన Study Material ( VVM website లో లభ్యం)
★ పరీక్ష తేదీలు : 2022 నవంబర్ 27 లేదా 30వ తేదీ (ఏదైనా ఒక రోజు మాత్రమే)
★ సమయం : నవంబర్ 27 లేదా 30 తేదీల్లో ఉదయం 10.00 నుండి రాత్రి 6.00 గంటల సమయంలో 90 నిమషాలు మాత్రమే.( ప్రతి విద్యార్థి పరీక్షకు ఒక సారి మాత్రమే login అగుటకు అవకాశం ఉంటుంది)
★ విజేతలకు ఇచ్చే పురస్కారాలు : పాఠశాల/జిల్లా/రాష్ట్ర/జాతీయ స్థాయిలలో
★ పరీక్ష రుసుము : Rs200/-
★ రిజిస్ట్రేషన్ ఆఖరు తేదీ : 30 సెప్టెంబర్,2022
★ రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలుకు : www.vvm.org.in
రూ.200/-రెండు వందల ఫీజుతో ఆన్లైన్లో
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, కళాశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్బోర్డు విద్యార్థులంతా ఈ పరీక్ష రాయవచ్చు. http://vvm.org.in వెబ్సైట్లో రూ.200రుసుం చెల్లించి సెప్టెంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో నిర్వహించే ఈ పోటీల్లో విజేతలుగా నిలిస్తే జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది.
ప్రధానమైన మూడు భాషలు ఇంగ్లిష్, హిందీ, తెలుగు లతో పాటు అన్ని భారతీయ భాషలలో పరీక్ష రాసే అవకాశం ఉంది. మొదట పాఠశాల స్థాయిలో పరీక్ష, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో శిబిరాలు ఉంటాయి. మొదట పాఠశాల స్థాయి,జిల్లా స్థాయి లలో ఎంపికైన వారికి ప్రశంసా పత్రాలు అందిస్తారు. రాష్ట్ర స్థాయిశిబిరంలో పాల్గొన్న వారికి ధ్రువీకరణ పత్రం, జ్ఞాపికను బహూకరిస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన ముగ్గురికి రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేల చొప్పున, జాతీయ స్థాయి శిబిరం లో ప్రతిభ చూపితే రూ.25వేలు, రూ.15వేలు, రూ.10వేల చొప్పున నగదు బహుమతులు అందించి "హిమాలయన్స్" గా గుర్తిస్తారు.అంతేకాకుండా దేశంలోని పరిశోధన, అభివృద్ధి సంస్థలను కూడా సందర్శించే అవకాశం కల్పిస్తారు.భాస్కర స్కాలర్ షిప్ గెలుపొందే అవకాశం మరియు సృజన్ ఇంటర్న్షిప్ కార్యక్రమం లో పాల్గొనే అవకాశం ఈ పరీక్ష ద్వారా కలుగుతాయి.
పరీక్ష విధానం...
పరీక్ష నందు విద్యార్థులు వారి తరగతుల గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు లాజిక్, రీజనింగ్ విభాగంలో 60 ప్రశ్నలు ప్రముఖ శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్ జీవిత చరిత్ర, విజ్ఞాన శాస్త్రం రంగం లో భారతీయ మేధావుల కృషి,అజాదీ కా అమృతోత్సవాలలో భాగంగా భారత స్వాతంత్ర్యోద్యమం మరియు సైన్సు వంటి అదనపు అంశాల నందు 40ప్రశ్నలతో కలిపి 100 ప్రశ్నలు కు గానూ మొత్తం 100మార్కులకు లతో ఈ పరీక్ష ఉంటుంది.
ఈ పరీక్ష 2022 నవంబర్ 27 ఆది వారం లేదా 2022 నవంబర్ 30వ తేదీ ఋధవారం లలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష నందు పై తేదీ లలో ఏదైనా ఒక రోజు ఎంచుకొని 90 నిమిషాలు పాటు పరీక్ష ను ఆన్లైన్ విధానంలో తమ మొబైల్(ఆండ్రాయిడ్), ట్యాబ్, ల్యాప్ టాప్, మరియు డెస్క్ టాప్ లలో వ్రాయవలసి ఉంటుంది.పరీక్షకు ఒక సారి మాత్రమే లాగిన్ కావలెను. రాష్ట్ర స్థాయిలో 2023 జనవరి 8, 15, 22 తేదీల్లో జాతీయ స్థాయిలో 2023 మే 20,21 వ తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ఉపాధ్యాయులు తమ పాఠశాల ను ఈ పరీక్ష నందు రిజిస్టర్ చేసి కంప్యూటర్, సెల్ఫోన్ పరిజ్ఞానం ఉన్న తమ పాఠశాల విద్యార్థుల పేర్లు ను ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్’ పరీక్ష నందు నమోదు చేసి విద్యార్థులు ను ప్రోత్సహించి మన ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థుల ప్రతిభ ను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చూడాలి.
అదే విధంగా ఆసక్తి ఉన్న విద్యార్థులు విడిగా వ్యక్తి గత రిజిస్ట్రేషన్ విభాగంలో తమ పేర్లను రిజిష్టర్ చేసుకొని ఈ పరీక్ష నందు పాల్గొన వచ్చు.
అజాదీ కా అమృతోత్సవాలలో భాగంగా విద్యార్థులు ఈ పరీక్ష ద్వారా విద్యార్థులు భారతదేశంలో సైన్స్ రంగంలో మన శాస్త్రవేత్తలు సాధించిన ప్రగతి ని తెలుసుకుంటారు.
మరిన్ని వివరాలకు www.vvm.org.in అను వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకొనవచ్చును.
భవదీయులు :
PVLN శ్రీరామ్ , మనోహర్ శ్రీనివాస నాయక్
స్టేట్ కోఆర్డినేటర్స్ , విద్యార్థి విజ్ఞాన్ మంధన్
ఆంధ్ర ప్రదేశ్ విభాగం
0 Post a Comment:
Post a Comment