Tuesday, 16 August 2022

ఈ రోజు (16.08.2022) విద్యా శాఖ అధికారులతో జరిగిన చర్చల సారాంశం

 ఈ రోజు (16.08.2022) విద్యా శాఖ అధికారులతో జరిగిన చర్చల సారాంశం




ఈ రోజు (16.08.2022) విద్యా శాఖ అధికారులతో జరిగిన చర్చలలో మొబైల్ యాప్స్ గురించి రేషనలైజేషన్, బదిలీలతోబాటు మున్సిపల్ టీచర్ల సమస్యలపై కూడా చర్చించడం జరిగింది.

1. టీచర్ల హాజరు, విద్యార్ధుల హాజరు యాప్ లో నమోదు చేయడానికి ప్రత్యేకంగా డివైజ్ లు ఇవ్వాలని, ఉపాధ్యాయుల మొబైల్ లో మాత్రం హాజరు నమోదు చేయబోమని స్పష్టం చేయడం జరిగింది. ఇదే విషయాన్ని వ్రాతపూర్వకంగా  ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు మండల విద్యాశాఖాధికారికి, హైస్కూల్ టీచర్లు హెచ్.ఎం.కు ఇవ్వాలి. జిల్లా కమిటీలు జిల్లా విద్యాశాఖాధికారికి ఇవ్వాలని ఫ్యాప్టో సభ్య సంఘాలు నిర్ణయించాయి.

2. యాప్ లలో టీచర్ల అటెండెన్స్ అప్ లోడ్ చేయకపోవడంపై ఇచ్చిన షోకాజ్ నోటీసులపై యాక్షన్ ఉండదని తెలియజేసారు.

3. పాఠశాలల విలీన ప్రక్రియ ఇంకా పూర్తికానందున 117కు జి.ఓ.కు సవరణలు కోరుతూ ఫ్యాప్టో సంఘాలు ఇచ్చిన ప్రతిపాదనలను ఇంకా పరిశీలించలేదు. రేషనలైజేషన్ ప్రక్రియ ప్రారంభించినప్పుడు పరిశీలిస్తామని తెలియజేసారు.

4. స్కూల్ అసిస్టెంట్లు, పి.జి.టి.లు, ప్రమోషన్లకై 8వేల పోస్టులు అప్ గ్రేడేషన్ చేసి ఫైల్ ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని, ఫైనాన్స్ అప్రూవల్ వచ్చిన వెంటనే అప్ గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి చేసి ప్రమోషన్లకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

5. ప్రమోషన్ల సీనియార్టీ లిస్టు తయారీపై రోస్టర్ కం మెరిట్, ఫీడర్ కేటగిరీ సీనియార్టీ పరిగణనలోకి తీసుకోవాలని కోరగా సవరణ ఉత్తర్వులు ఇస్తామన్నారు.

6. ప్రాథమిక పాఠశాలల్లో 150కంటే ఎక్కువ విద్యార్ధులున్న చోట పిఎస్ హెచ్ఎం పోస్టులు కొనసాగిస్తారు. మిగిలిన వాటిని స్కూల్ అసిస్టెంట్లు పోస్టులుగా కన్వర్ట్ చేస్తారు.

7. బదిలీలకు సంబంధించి 8 సం.ల కొనసాగింపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

8. ఎయిడెడ్ టీచర్లకు రిటైర్మెంట్ వయస్సు 62 సం.లకు సంబంధించిన ఫైల్ పై ముఖ్యమంత్రి సంతకం అయింది. ఫైనాన్స్ అనుమతి రాగానే ఉత్తర్వులు ఇస్తారు. దీనికి గాను మరికొంత సమయం పట్టే ఆవకాశం ఉంది.

9. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మంజూరు చేసిన మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులపై పాఠశాల విద్యాశాఖ నుండి ఉత్తర్వులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ నెల నుండి హెచ్.ఒ.డి. మంజూరు ఉత్తర్వులు ఇస్తామన్నారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top