విదేశాల్లో చదువుకునే వారికి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్. అగ్రకులాల వారికి కూడా...
జగనన్న విదేశీ విద్యా దీవెన (Jagananna Vidya Deevena) పై ఉత్తర్వులు వెలువరించింది.
● ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ కూడా ఈ పథకంలో భాగం కల్పిస్తూ తాము ప్రతిభను ప్రొత్సహిస్తామన్న సంకేతాలు పంపింది.
● క్యూఎస్ ర్యాంకింగ్స్(QS World University Rankings)లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును ప్రభుత్వమే భరించనుంది.
● మొదటి 100 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వనుంది.
● 100 పైబడి 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సాధిస్తే రూ.50లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపు చేయనున్నట్లు తెలిపింది.
● నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్‌మెంట్ డబ్బు జమ చేయనున్నట్లు తెలిపింది.
● ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఈ పథకం వర్తింపజేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
● 35 ఏళ్లలోపు ఉన్న వారందరూ అర్హులుగా తెలిపింది.
● ఏపీలో స్థానికుడై ఉండాలి.
● అయితే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
● ప్రతి ఏటా సెప్టెంబరు-డిసెంబరు, జనవరి-మే మధ్య అర్హుల గుర్తింపుకోసం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది ప్రభుత్వం.
● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీచే అర్హుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
0 Post a Comment:
Post a Comment