Friday, 1 July 2022

ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషనల్ రూల్స్ - 1966 (ANDHRA PRADESH INTIGRATED EDUCATIONAL RULES-1966)

 ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషనల్ రూల్స్ - 1966
(ANDHRA PRADESH INTIGRATED EDUCATIONAL RULES-1966)




పాఠశాల నిర్వహణ - కొన్ని ముఖ్య విషయాలు 

 

A.E.R Rule-46(A) :

ప్రవేశ సం॥లో ఆగస్టు-31 నాటికి 5సం౹౹ (5+) వయస్సు కలిగియున్న విద్యార్ధులను ఒకటో తరగతిలో చేర్చుకోవాలి.

 A.E.R-46(B) :

అనుబంధం 10 ప్రవేశ దరఖాస్తు ద్వారా పాఠశాలలో విద్యార్ధులను చేర్చుకోవాలి.

 A.E.R Rule 42(C) :

ఒక విద్యా సం॥లో పాఠశాల ఖచ్చితంగా 220 పనిదినాలు కలిగియుండాలి.

 A.E.R.-46(J) :

పాఠశాలను విడిచి వేరొక పాఠశాలకు పోవునపుడు,వేరొక పాఠశాల నుండి ఈ పాఠశాలలో చేరినపుడు రికార్డు షీటు నిర్వహించాలి.

A.E.R-45 :

ఒక నెలరోజులు దాటిననూ, సెలవు లేకుండా పాఠశాలకు హాజరుకాని విద్యార్ధులను పాఠశాల రోలు నుండి తొలగించవచ్చును.

A.E.R-35 :

విద్యార్ధుల హాజరును, ఉదయము, మధ్యాహ్నం మొదటి పీరియడ్ ఆఖరున పుర్తిచేయాలి.

A.E.R Rule123(B) :

ఉపాధ్యాయుల హాజరుపట్టిని అనుబంధం-4 ఫారాలున్న పేజీలనువాడాలి.

A.E.R-33 :

ప్రధానోపాధ్యాయులు విద్యా సం॥ ప్రారంభంలోనే పాఠశాల సిబ్బంది యొక్క రోజువారీ కార్యక్రమాలను "జనరల్ టైం టేబుల్" ద్వారా తెలియజేయాలి.ఆఫీస్ రూంలోనూ,ప్రతి తరగతి గదులోనూ టైం టేబుల్ ను వ్రేలాడదీయాలి.

Rc.No.527/E2/97,Dt:16-07-1997 :

పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహోపాధ్యాయులు,ఇతర సిబ్బంది తప్పనిసరిగా అసెంబ్లీ(Prayer) కు హాజరుకావాలి.లేట్ పర్మిషన్లు ఉపాధ్యాయులకు వర్తించవు.

A.E.R Rule 77 :

ప్రతి ఉపాధ్యాయునికి కనీసం 24 పీరియడ్లు కేటాయించాలి.

A.E.R Rule 99 :

విదేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి T.C పై ప్రవేశము కోరు విద్యార్థులు వారు చేరే జిల్లా విద్యాశాఖాధికారి గారి కౌంటర్ సిగ్నిచర్ విధిగా ఉండవలెను.

A.E.R Rule 124(A) :

★ అడ్మిషన్ రిజిస్టరుకు ప్రతి పేజీకి నెంబరు తప్పనిసరిగా వేయాలి. సీరియల్ నెంబరును చిన్న స్కూళ్లకు 5 సంవత్సరముల కు ఒకసారి, పెద్ద స్కూళ్లకు 3 సంవత్సరములకు ఒకసారి సంఖ్య పెద్దదై అసౌకర్యముగా ఉంటే మార్చుకోవాలి.

ఉపాధ్యాయుల రిక్రూట్ మెంట్ లోకల్, నాన్ లోకల్ నిర్ణయించు విధానం


★ స్కూల్ స్టడీ 7 సంవత్సరములలో ఏ జిల్లాలో ఎక్కువ కాలం చదివితే దానినిబట్టి లోకల్,నాన్ లోకల్ నిర్ణయిస్తారు.

★ ఒక వ్యక్తి 10వ తరగతి వరకు వేరే జిల్లాలో చదివితే అతను సొంత జిల్లాలో నాన్ లోకల్ గా పరిగణించబడతారు.

★ ఎక్కడా చదవకుండా ప్రయివేటుగా పరీక్ష వ్రాస్తే ఎక్కడ నివాస సర్టిఫికెట్ చూపిస్తే ఆ జిల్లాకు లోకల్ అవుతారు.

★ 2 లేదా 3 జిల్లాల్లో చదివితే 7 సంవత్సరాలలో ఎక్కువ కాలం ఏ జిల్లాలో ఉంటే అదే లోకల్ అవుతుంది.

★ రెండు జిల్లాలోనూ సమానంగా 3+3 ఉంటే చివరి 3 సంవత్సరాలు చదివిన జిల్లాయే లోకల్ అవుతుంది.


0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More

Subscribe Get Alerts

Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top