సీపీఎస్ స్థానంలో జీపీఎస్ : ఉద్యోగ సంఘాల ముందు ఏపీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన
ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానంపై సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో జరిపిన చర్చల్లో...
రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ స్థానంలో గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ ( జీపీఎస్ ) పేరిట కొత్త స్కీం తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది . సీపీఎస్ బదులు జీపీఎస్ పథకం అమలు చేయాలని ప్రతిపాదన చేసింది . దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు స్పందిస్తూ .. “ సీపీఎస్ స్థానంలో జీపీఎస్ స్కీమ్ను ప్రభుత్వం ప్రతిపాదించింది . జీపీఎస్ పై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది . పాత పెన్షన్ విధానమే కావాలని ప్రభుత్వాన్ని కోరాం . కొత్త స్కీంపై మేం అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పాం . జీపీఎస్ పేరిట కొత్త స్కీమ్ ఆమోదయోగ్యం కాదని చెప్పాం . కాగా , జీపీఎస్ , సీపీఎస్కు తేడా ఏంటనే విషయాన్ని ప్రభుత్వం చెప్పలేదు . ప్రభుత్వం ఏదో విధంగా జీపీఎస్ తీసుకురావాలని చూస్తోంది . మేం జీపీఎస్ ను ఒప్పుకోం " అని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు.
ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు CPS OPS లకు ప్రత్యామ్నాయంగా GPS(Guarantee Pension Scheme) ను ప్రతిపాదించి, దీనిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపడం జరిగింది. అయితే సిపిఎస్ విధానంలో 20.3 పర్సెంట్ వాల్యూ ఇస్తూ,OPS విధానంలో బేసిక్ పై 50శాతం పెన్షన్ మరియు డి ఎ పొందే వీలు ఉంటుంది కానీ జిపిఎస్ విధానంలో 33 శాతాన్ని ప్రతిపాదిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. అయితే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోని విషయాలన్నీ పరిశీలించిన తరువాత మరొక మీటింగు ఏర్పాటు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణా రెడ్డి గారు మరియు ఫైనాన్స్ సెక్రటరీల GADసెక్రటరీ తెలియజేశారు.
0 Post a Comment:
Post a Comment