Thursday, 3 March 2022

JAGANANNA GORUMUDDA - MDM NEW MENU ON FRIDAY - MAKING OF HOT PONGAL RECIPE

 JAGANANNA GORUMUDDA - MDM NEW MENU ON FRIDAY - MAKING OF HOT PONGAL RECIPE



హాట్ పొంగల్


కావాల్సిన పదార్దములు :

1) పెసరపప్పు 2) బియ్యం 3) పచ్చిమిర్చి 4) మిరియాలు

5) కరివేపాకు 6) అల్లం 7) జీడిపప్పు 8) నెయ్యి 9)జీలకర్ర

10) ఉప్పు 11) ఇంగువ.

తయారు చేసే విధానం :

 • మొదటి బియ్యం మరియు పెసరపప్పు  (3:1 నిష్పత్తి) లో తీసుకుని శుభ్రంగా నీటితో కడిగి 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి.

 • తరువాత వీటికి రెండు రెట్లు నీరు గిన్నెలో ఉండేలా చూసుకుని తగినంత ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టి అన్నం ఉడికించినట్లు ఉడికించాలి.

 • మనకు పొంగల్ చిక్కగా దగ్గరగా ఉండాలంటే నీరు తక్కువగాను, లేదా పలుచగా, జారుతుఉండేలా కావాలంటే కొంచెం నీరు ఎక్కువగాను తీసుకోవాలి.

 • ఇలా బియ్యం పప్పు బాగా ఉడికిన తరువాత పొయ్యిమీద నుండి గిన్నె దింపి మూత వేసి పక్కన పెట్టుకోవాలి.

 • తరువాత ఒక కడాయి తీసుకుని దానిలో తగినంత నెయ్యి వేసి జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి.

 • తరువాత అదే నెయ్యిలో ముక్కలుగా తరిగిన పచ్చి మిర్చి, తురిమిన అల్లం, కరివేపాకు మరియు మిరియాల పొడి వేసి దోరగా వేయించాలి.

 • ఇలా వేయించిన మిశ్రమాన్ని ముందుగా వండిపెట్టిన పొంగల్ నందు వేసి బాగా కలియబెట్టి వేయించిన జీడిపప్పును కూడా కలిపి మూత వేసి 15 నిమిషాలు అలా పక్కన ఉంచాలి.

 • వీలైతే ఇంగువను కూడా చేరిస్తే పొంగల్ మరింత రుచిగా ఉంటుంది.

తయారు చేయుట :👇



0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top