Wednesday 23 February 2022

మధ్యాహ్న భోజనం పై ఆరా... తోటగరువు జడ్పీ హైస్కూల్ను సందర్శించిన రాష్ట్రపాఠశాలల స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్

మధ్యాహ్న భోజనం పై ఆరా... తోటగరువు జడ్పీ హైస్కూల్ను సందర్శించిన రాష్ట్రపాఠశాలల స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్




పాఠశాల అపరిశుభ్రంగా ఉండడంతో హెచ్ఎంపై మండిపాటు

పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుపై  పాఠశాలల స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి. రాజశేఖర్ ఆరా తీశారు. మంగళవారం ఆయన ఆకస్మికంగా ఈ పాఠశాలను సందర్శించి స్కూల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, తరగతి గదుల్లోని వసతులను పరిశీలించారు. పాఠశాల అంతా అపరిశుభ్రంగా వుండడంతో ప్రధానోపాధ్యాయినిపై మండిపడ్డారు. కొంతమంది విద్యార్థులు యూనిఫారాలు, షూస్ ధరించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతీ విద్యార్థి యూనిఫారాలతో పాటు షూలు, బెల్టులను తప్పనిసరిగా ధరించేలా చూడాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనాల్లో పలు మార్పులు చేయాలని సూచించారు. నాడు-నేడు ప్రభుత్వ సలహాదారుడు మురళి పాఠశాలలోని పనులను పరిశీలించారు. గచ్చులపై కొన్ని పలకలు ఎందుకు విరిగి పోయాయని, ప్రధాన గేటు వద్ద ఇనుప రాడ్లతో వేసిన ఫ్రేమ్ ఎలా పాడైపోయిందని ప్రశ్నించారు. అనంతరం హెచ్ఎం భవానీ, తదితరులతో నిర్వహించిన సమావేశంలో పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ జ్యోతికుమారి, డీఈవో ఎల్.చంద్ర కళ, డీడీఈవో ప్రేమక్కుమార్, తదితరులు పాల్గొన్నారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top