ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్ గారి దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి : చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, జెడ్ పి చైర్మన్ ఆకేపాటి అమరనాధ రెడ్డి లు హామీ.
జెడ్ పి చైర్మన్ ఆకేపాటి అమరనాధ రెడ్డి తో కలసి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న ప్రభుత్వోద్యుగుల సమస్యలపై ఆరా తీశారు. కలెక్టరేట్ లో ఈబిసి నేస్తం ప్రారంభ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా బైఠాయించిన ఉద్యోగుల దగ్గరకే శ్రీకాంత్ రెడ్డి, ఆకేపాటి అమరనాధ రెడ్డి లు వెళ్లి ఉద్యోగుల సమస్యలను విన్నారు. ప్రభుత్వానికి తాము వ్యతిరేఖం కాదని, తమ సమస్యలు ముఖ్యమంత్రి జగన్ గారి దృష్టికి వెళ్లలేదని, తమ సమస్యలును ముఖ్యమంత్రి జగన్ గారి దృష్టికి
పాత హెచ్ ఆర్ ఏ స్లాబులును కొనసాగించాలని, ఫిట్ మెంట్ 27 శాతానికి తగ్గకుండా ప్రభుత్వం ఇవ్వాలన్న అంశాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని ఉద్యోగులు చీఫ్ విప్, జెడ్ పి చైర్మన్ లకు విన్నవించారు.ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేందుకు కృషిచేస్తామని శ్రీకాంత్ రెడ్డి, ఆకేపాటి అమరనాధ రెడ్డిలు హామీ ఇచ్చారు
0 Post a Comment:
Post a Comment