అన్నింటికి సిద్ధపడే ఆందోళనకు దిగాం. ఎవరికీ భయపడేది లేదు : బొప్పరాజు
చలో విజయవాడ చూశాకైనా ప్రభుత్వ నిర్ణయం మారాలని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు . విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల రిలే నిరాహార దీక్షకు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మద్దతు తెలిపారు . ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ .. చర్చలకు రాలేదని మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు . తొమ్మిది మంది నేతలు చర్చలకు వెళ్లి డిమాండ్లను చెప్పి వచ్చామని చెప్పారు . మా డిమాండ్లకు ప్రభుత్వం లిఖితపూర్వకంగా జవాబు ఇవ్వాలని కోరారు . జీవోలు శాస్త్రీయంగా లేవని మీరే చెప్పారు .. వాటిని సరిద్దిద్దాలి డిమాండ్ చేశారు . అన్నింటికీ సిద్ధపడే ఆందోళనకు దిగామని , ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు . ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగు ముందుకేస్తే తాము నాలుగు అడుగులు వేస్తామని తెలిపారు . ఉద్యోగులకు , ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం తేవొద్దని బొప్పరాజు పేర్కొన్నారు .
0 Post a Comment:
Post a Comment