ఉపాధ్యాయులే వంట మనుషులైన వేళ..!
విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు గంటన్నరపాటు భోజనం వండి.. వడ్డించిన ఘటన గ్రామీణ మండలంలోని తూముకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగింది. ప్రభుత్వం బిల్లులు సకాలంలో అందించలేదని మధ్యాహ్న భోజన నిర్వాహకులు వంట చేయలేమని విరమించుకున్నారు. దీంతో ప్రధానోపాధ్యాయిని శాంతమ్మ, ఇతర ఉపాధ్యాయులు బాబా ఫక్రుద్దీన్, చంద్రకళ, అశ్వర్థప్ప, బాలరాజు కూరగాయలు తీసుకొచ్చి అన్నం, సాంబారు వండి విద్యార్థులకు స్వయంగా వడ్డించారు.
0 Post a Comment:
Post a Comment