ప్రజల ముంగిట ప్రభుత్వోద్యోగుల వివరాలు
జీతాలు పెరిగాయని గ్రామ వాలంటీర్ ద్వారా ప్రజలకు ఇవ్వమని/చెప్పమని ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కరపత్రం |
పారదర్శకత… జవాబుదారీతనం… సమాచార హక్కు… ఈ మూడు అంశాలనూ బాధ్యతగా తీసుకుని పరిపాలనలో గుణాత్మక మార్పులు తీసుకు వచ్చే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి పరిమిత కార్యారయాల్లో అదికూడా ఆయా కార్యాలయాల్లో లభించే సేవలను మాత్రమే పేర్కొంటూ బోర్డులు ఉండేవి. ప్రధానంగా రెవెన్యూ కార్యాలయాలు, ప్రభువైద్యశాలల్లో మనం ఇటువంటి డిస్ ప్లే బోర్డులను చూసేవాళ్ళం. ఇలా కొన్ని ప్రభుత్వ శాఖల్లో తప్పితే అధిక శాతం శాఖల్లో అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరెవరు ఉంటారు…? ఏ స్ధాయి అధికారులు అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు…? వారు ప్రజల పట్ల నిర్వర్తిస్తున్న విధులు బాధ్యతలు ఏంటి అనే సమాచారం సామాన్య ప్రజలకు తెలియదు. అటువంటి ప్రభుత్వశాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమాచారం ప్రజలకు తెలియక పోవడం ఒకఎత్తైతే… సదరు ఉద్యోగులు ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించకపోవడం మరో ఎత్తు. తమకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరెవరు ఉద్యోగ బాద్యతలు నిర్వహిస్తున్నారు... వారితో ప్రజలు ఎటువంటి సేవలు పొందచ్చు వంటి కీలక సమాచారం ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందూ డిస్ ప్లే చెయ్యాలని ఏపీ ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉదాహరణకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలం మొదలుకుని గ్రామ స్ధాయిలో ఉన్న ప్రాధమిక పాఠశాల వరకూ అన్నింటిలో అటెండర్ మొదలుకుని సిబ్బంది అందరి పూర్తి వివరాలతో కూడిన బోర్డులను ఆయా కార్యాలయాలు, పాఠశాలల ముందు పెట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ బోర్డుల్లో అటెండర్ నుంచి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కార్యాలయ కాంపిటెంట్ అధారిటీ వరకూ అందరి వివరాలు వారికి వస్తున్న వేతనాలతో సహా సమస్త వివరాలు ఉంటాయి. అలాగే మిగిలిన ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో కూడా ఇదే విధంగా సిబ్బంది సర్వీస్ వ్యవహారాలు, సేవలు, జీతభత్యాల వివరాలు ఉంచాలనే నిర్ణయంతో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమగ్ర సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పెంచిన కొత్త జీతాలు కాకుండా డిసెంబర్ మాసంలో ఇచ్చిన జీతమే ఇమ్మని అడగాలి.ఇది ప్రజల్లోకి వెళ్లేలా అందరూ కృషి చేయాలి. అలాగే జీతాలు ఎలా భారం అవుతున్నాయో, ప్రభుత్వాదినేతల లక్షల్లోని జీతాలు అలవెన్సుస్ కూడ ఇందులో ఉన్నాయని ప్రజలకు అర్థమయ్యేలా లఘు చిత్రాల ద్వారా ప్రజలకు జరుగబోయే ధర్నా కార్యక్రమాలలో వివరించాలి.
అలాగే ఈ పెరిగిన నిత్యావసర ధరల వలన మనకు జీతాలు సరిపోని విధానం కూడ వివరించాలి.
13 లక్షల మంది ఉద్యోగుల x 5 = 70 లక్షల మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులు కి ఇప్పటికే తెలిసిపోయింది.
మంచి నిర్ణయమే. అలాగే ప్రజా ప్రతినిధుల వివరాలు కూడ పెట్టాలి. ఎన్నికకు ముందు వారి ఆస్తులు, సంపాదన వివరాలు ప్రదర్శించాలి.
0 Post a Comment:
Post a Comment