Monday 31 January 2022

ఏపీ సచివాలయంలో ఉద్యోగుల నిరాహార దీక్ష

ఏపీ సచివాలయంలో ఉద్యోగుల నిరాహార దీక్ష



పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ సచివాలయంలో సోమవారం ఉద్యోగులు రిలే నిరాహార దీక్షకు దిగారు. మూడో బ్లాకు బయట వివిధ శాఖలకు సంభందించిన ఉద్యోగులు దీక్షలో కూర్చొ న్నారు. సచివాలయంలో ఉద్యోగులు దఫాల వారీగా వచ్చి దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రివర్స్ పీఆర్సీ మాకొద్దని నినాదాలూ చేస్తూ.. ప్లకార్డులు ప్రదర్శించి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని ఆపడం ఎవరితరం కాదని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. ఈనెల 3న చలో విజయవాడ నిర్వహించి తీరుతామన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె తప ్పదని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. ఉద్యోగుల్లో చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. బెదిరింపులకు పాల్పడి కొత్త వేతన స్కేళ్ల ఆధారంగా బిల్లులు చేయిస్తున్నారని ఉద్యోగులు మండిపడ్డారు. ఆ కమిటీ అపోహలు తొలగించే కమిటీ కాదు.. ఉద్యోగుల పొట్ట మీద కొట్టే కమిటీ అని దుయ్యబట్టారు. ప్రభుత్వం, ఉద్యోగులు ఒక కుటుంబం కాదు యజమాని, ఉద్యోగి సంబంధమేనని సచివాలయ ఉద్యోగులు వెల్లడించారు. సాయంత్రం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి దీక్షలో పాల్గొన్న వారికి నిమ్మరసం అందజేసి విరమింప జేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘ నేత కత్తి రమేష్ తదితరులు మాట్లాడారు.

ఉద్యోగుల దరఖాస్తుల పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి : వెంకట్రామిరెడ్డి

నూతన పీఆర్సీ కాకుండా పాత విధానంలో జనవరి జీతాలు, పెన్షన్లుచెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, పెన్షనర్లు దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం ఖాతరు చేయకుండా మొండిగా వ్యవహరిస్తోందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ఉద్యోగుల దరఖాస్తులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రెజరీ ఉద్యోగులకు ఛార్జ్ మెమో ఇవ్వడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి మూడో తేదీ చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే నాలుగవ తేదీ పెన్ డౌన్ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులంతా కంప్యూటర్లను షట్ డౌన్ చేసి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు మంగళవారం నుంచి సచివాలయం వెలుపల దీక్షలు వుంటాయని చెప్పారు.


0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top