Sunday 23 January 2022

మీ పాస్వర్డ్ పదిలమేనా...? పటిష్టంగా లేకుంటే హ్యాకర్లతో ముప్పే

మీ పాస్వర్డ్ పదిలమేనా...? పటిష్టంగా లేకుంటే హ్యాకర్లతో ముప్పే



వర్క్ ఫ్రామ్  హోంలతో పెరిగిన సైబర్ దాడులు

పాస్వర్డపై దృష్టిపెట్టాలి: నిపుణులు

8 సూత్రాలు పాటించాలని సూచన

కరోనా ఉధృతి పెరుగుతుండడంతో దాదాపు అన్ని రకాల కార్యాలయాలు వర్క్ ఫం హోంకు ప్రాధాన్య మిస్తున్నాయి. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్ల బెడద పెరిగింది. ఈ మప్పు నుంచి బయటపడాలంటే ఆఫీస్ | అకౌంట్లతోపాటు రోజువారీ సోషల్ మీడియా అకౌంట్లు, ఆన్లైన్ బ్యాంకింగ్ అకౌంట్లకు పటిష్టమైన (స్ట్రాంగ్ పాస్వర్డను పెట్టుకోవడం ఉత్తమం. ఇందు కోసం 8 సూత్రాలను పక్కాగా పాటించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

💥 ఆ సూత్రాలు ఇవీ...

పాస్వర్డ్ పెట్టుకొనేందుకు సాధారణంగా ఎక్కువ మంది వాడే అక్షరాలు, సంఖ్యలు, సంకేతాలను ఆధారంగా చేసుకొని హ్యాకర్లు మీ పాస్వర్డ్ను తెలు సుకొనేందుకు ప్రయత్నిస్తారు. దీన్ని 'బ్రూట్ ఫోర్స్ 'ఎటాక్' అంటారు. ఇలాంటి దాడుల బారిన పడకూడదంటే మన పాస్వర్డ్ను వీలైనంత ఎక్కువ పొడవు ఉండేలా చూసుకోవాలి.

సాధారణంగా వాడే పదాలు పాస్వర్డ్లో లేకుండా చూసుకోవాలి. అంటే డిక్షనరీలో నేరుగా దొరికేలా కాకుండా గ్రమటికల్గా తప్పులు, పదంలోని అక్షర క్రమంలో మార్పు ఉండేలా చూసుకోవాలి. కీబోర్డు లోని వరుస అక్షరాలను పెట్టుకోవడం ప్రమాదకరం.

మీరు పెట్టుకునే పాస్వర్డ్ తప్పకుండా కనీసం ఒక నంబర్, సింబల్, అప్పర్కేస్, లోయర్ కేస్ ఉండేలా చూసుకోవాలి.

పాస్వర్డ్లో చాలా మంది ఇంటిపేరు, వాళ్ల ముద్దు పేర్లు, పుట్టిన తేదీ, పుట్టిన సంవత్సరాలు, పిల్లల పుట్టిన తేదీలు పెడుతుంటారు. ఇలా చేయకపో వడం ఉత్తమం. మీ వ్యక్తిగత సమాచారాన్ని పాస్ వర్డ్ పెట్టుకొంటే ఇతరులు సులభంగా తెలుసుకొనే వీలుంటుంది.

కొందరు ఈ-మెయిల్కు, ఆన్లైన్ బ్యాంకింగ్కు, సోషల్ మీడియా ఖాతాలకూ ఒకే పాస్వర్డ్ను వాడు తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. మన ఒక్క అకౌంట్ హ్యాకింగ్కు గురైనా మిగిలిన ఖాతాలూ చిక్కుతాయి.

మార్కెట్లో మనకు పాస్వర్డ్ మేనేజర్ సర్వీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితో స్ట్రాంగ్ పాస్వర్డ్లను జనరేట్ చేసుకోవచ్చు. మన పాస్వ ర్డను ఎన్క్రిప్టెడ్ విధానంలో వీరు దాస్తారు. దీని వాడకంపై అవగాహన ఉండాలి. మన మాస్టర్ పాస్వర్డ్ను మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు.

పాస్వర్డ్ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులతో షేర్ చేసుకోకూడదు. డివైజ్లలో పాస్వర్డ్ను టైప్ చేసే ప్పుడు కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. మీ కంప్యూటర్లు, ఈ మెయిల్ ఖాతాల్లో పాస్వర్డ్లను పెట్టుకోకూడదు. అలా స్టోర్ చేసుకోవల్సి వస్తే పాస్ వర్డ్ లోని హింట్ (మీకు గుర్తుండే) పదాలను మాత్రమే రాసుకోవడం ఉత్తమం.

మీ పాస్వర్డ్లను తరచూ మారుస్తూ ఉండాలి. కొం దరు ఏండ్ల కొద్ది ఒకే పాస్వర్డ్ను వాడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఒకసారి వాడిన పాస్వ ర్డ్ను మరలా చాలా కాలం వరకు వాడకపోవడమే ఉత్తమం.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top