జగన్ సర్కార్ వర్సెస్ ఉద్యోగులు : : ఉద్యోగులు సమ్మెకే మొగ్గు : జగన్ & కో కి కూడా లోపల సమ్మెజరగాలనే ఉంది.
జనంలో ఉద్యోగులపై ఉన్న వ్యతిరేకత దృష్ట్యా వారిని విలన్లుగా చూపించి జనంలో సానుకూలత కోసం జగన్ & కో వ్యూహాత్మక అడుగులు.
వ్యతిరేకత ఇపుడు కొత్త కాదు కదా, ఎన్టీఆర్ హయాంలో కూడా 53 రోజులు సమ్మె చివరికి ఎన్టీఆర్ తలొగ్గారు అని ఉద్యోగుల ధీమా.
ఓట్ల కోసం ముందుగా ఉద్యోగులకు ఆశ పెట్టింది హామీ ఇచ్చింది జగన్. ఉద్యోగులు ఆశపడ్డారు అడుగుతున్నారు నిలదీస్తున్నారు రోడ్డెక్కారు.
జీతం తగ్గించడానికి చెప్పింది చేయడానికి కరోనా సాకు చెబుతోంది జగన్ సర్కార్. పనిచేసే మా జీతాలు తగ్గించే ముందురాజకీయం అంటే సేవ అంటూ వేతనాలు తీసుకునే ప్రజాప్రతినిధులు సలహాదారుల జీతభత్యాలు కూడా తగ్గించుకోవాలి కదా అని ఉద్యోగులు.
సమ్మె మా హక్కు అని ఉద్యోగులు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉండాలి అని జగన్ & కో. బాధ్యతలు విమర్శలు ఇపుడే గుర్తొచ్చాయా అని ఉద్యోగులు. ఉద్యోగుల సమ్మెపై జనంలో వ్యతిరేకత పెరుగుతున్నా జనంతో మాకేంటి అవసరం.
మాతోనే జనానికి ప్రభుత్వానికి అవసరం అని ఉద్యోగులు. ఆర్టీసీ హైకోర్టు ఉద్యోగులు కూడా సై. జనంలో ఈ ప్రస్తుత వ్యతిరేకత వలన రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో ఓట్లలో సానుకూలత ఉంటుందా అంటే డౌటే. కానీ ఉద్యోగుల్లో వ్యతిరేకత మాత్రం కొనసాగుతుంది కదా అని జగన్ & కో లోపల ఆందోళన కూడా.
ఉద్యోగులకు అస్త్రాలు పెన్ డౌన్ సహాయనిరాకరణ సమ్మె . జగన్ & కో కు అస్త్రాలు ఎస్మా బయోమెట్రిక్ విభజించు పాలించు. ఎవరి యుద్ధం వారిదే. జగన్ & కో కి ఈగో & ఆర్థిక సమస్య ఉద్యోగులకు కడుపు సమస్య .
తగ్గేదెవరు? గెలిచేదెవరు?
ఉద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వాలు గెలిచి నిలిచిన దాఖలాలు ఉన్నాయా?
పాత చరిత్ర పునరావృత్తమా!? కొత్త చరిత్ర ఆవిష్కృతమా!?
0 Post a Comment:
Post a Comment