క్రైస్తవంలోకి మారాలని టీచర్ ఒత్తిడి _ అధికారులకు విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు : : : మైల్వార్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఘటన
కులమతాలకు అతీతంగా బోధించాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థులను క్రైస్తవంలోకి మారాలని ప్రోత్సహిస్తున్నారంటూ తల్లిదండ్రులు, యువకులు మంగళవారం పాఠశాలను ముట్టడించారు. ఉపాధ్యాయుడి నిర్వాకంపై ప్రధాన ఉపాధ్యాయుడితో చర్చించి పంచాయితీ పెట్టారు. అనంతరం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగింది. గణిత ఉపాధ్యాయుడు రత్నం కొంతకాలంగా తమను క్రైస్తవంలోకి మారాలని ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. కొన్ని రోజుల క్రితం ఇద్దరు విద్యార్థులు గొడవపడితే రత్నం ఓ వర్గానికి చెందిన విద్యార్థితో ఉద్దేశపూర్వకంగా మ రోవర్గం విద్యార్థి కాళ్లు మొక్కించారని తల్లిదండ్రులు, గ్రామ యువకులు మండిపడ్డారు. ‘‘మతమార్పిడి చేస్తే విదేశాల నుంచి డబ్బులు వస్తాయని ఆ టీచర్.. మాకు ఆశలు కల్పిస్తున్నారు. మతం మారని విద్యార్థులను ఏదో వంకతో రోజూ వేధిస్తున్నారు. పాఠాలకు బదులు మతమార్పిడిపైనే బోధిస్తూ తరగతి గదిలో ఉన్న దేవతలు, దేశ నాయకుల చిత్రపటాలనూ తీయించి బీరువాలో పెట్టారు. మధ్యాహ్న భోజన సమయంలోనూ శ్లోకా లు చదవనీయడం లేదు’’ అని విద్యార్థులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు గ్రామ యువకులతో కలిసి ఎంఈవో సుధాకర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం వికారాబాద్‌కు వెళ్లి ఉపాధ్యాయుడి నిర్వాకంపై డీఈవో, కల్టెకర్లకు సైతం ఫిర్యాదు చేశామని తల్లిదండ్రులు తెలిపారు.
0 Post a Comment:
Post a Comment