జీవోలను వెబ్సైట్ లో పెట్టకూడదనే నిషేధం ఏమీ లేదు : హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
ప్రభుత్వ శాఖలు వెలువరించే జీవోలను వెబ్సైట్లో పెట్టకూడదనే నిషేధం ఏమీ లేదని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పూర్వం జీవోఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ అయ్యేవని, ఇప్పుడు ఈ గెజిజిట్ వెబ్సైట్లో ఉంటున్నాయని చెప్పింది. చిన్నపాటి జీవోలు పెట్టడం లేదని విధాన నిర్ణయాలు, ట్రాన్సఫర్లు, ప్రమోషన్స్ జీవోలు పెడుతున్నామని. వివరించింది. ఏపీ సెక్రటేరియట్ ఆఫీస్ మాన్యువల్, ఏపీ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం మాన్యువల్గానే జీవో నెంబర్ల కేటాయింపులు ఉంటాయని నివేదించింది. ఈ మేరకు జీఏడీ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు హైకోర్టుకు నివేదించారు. జీవోలను వెబ్సైట్లో పెట్టకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వేర్వేరు పిల్స్పై విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి డివిజన్ బెంచ్ ప్రకటించింది. గత ఏడాది ఆగస్టు 17 నుంచి ఈ ఏడాది జనవరి 28 వరకు 33 శాఖలకు చెందిన జీవోల్లో 620 జీవోలను ఈ%ఎ%గెజిజిట్ వెబ్సైట్లో పెట్టాం. జీవోలు వెబ్సైట్స్లో పెట్టడం లేదని జనమేమీ అనుకోవడం లేదని అఫిడవిట్ లో పేర్కొంది.
0 Post a Comment:
Post a Comment