Wednesday 5 January 2022

బడిపిల్లల భోజన పథకానికి అక్షయ పాత్ర ఒప్పందం

 బడిపిల్లల భోజన పథకానికి అక్షయ పాత్ర ఒప్పందం



 దేశంలో బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార కార్య క్రమం (డబ్ల్యూఎప్పీ), భారత్లో అక్షయ పాత్ర ఫౌండేషన్తో చేతులు కలిపింది. ఢిల్లీలో రెండు సంస్థల ప్రతినిధుల మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. 1961 నుంచి డబ్ల్యూఎప్పీ 100 దేశాల్లో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోందని ఆ సంస్థ భారత విభాగాధిపతి బిషో పరజులి చెప్పారు. డబ్ల్యూఎఫ్పీ ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తోంది. తాజా ఒప్పందం కింద డబ్ల్యూఏప్పీ, అక్షయపాత్ర కలసి ఒక సారథ్య సంఘాన్ని నియమిస్తాయి. సంఘ సభ్యులు మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఆర్ధిక, మానవ వనరులను సమీకరించి సమర్థంగా వినియో గించే విషయమై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమై కార్యాచరణ చేపడతారు. దేశంలో మధ్యాహ్న భోజన పథకం బడిపిల్లలకు ఆహార భద్రత కల్పించిందనీ, ఈ అనుభవాన్ని డబ్ల్యూఎప్పీ | అంతర్జాతీయ కార్యక్రమానికి సమర్ధంగా ఉపయోగి స్తామని అక్షయ పాత్ర ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు చంచలాప్తి దాస వివరించారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top