Monday, 31 January 2022

ఉద్యోగుల ఆందోళనలు విరమింపజేయాలి : జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు

ఉద్యోగుల ఆందోళనలు విరమింపజేయాలి : జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు



పీఆర్సీపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు చేస్తున్నఆందోళన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో చర్చించి ఆందోళనను విరమించేలాతగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. సమీర్ శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈమేరకు సోమవారం ఏపీ సచివాలయం నుండి సీఎస్ ఆర్థికశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులంటే మనంతా ఒక కుటుంబమని ఏదైనా సమస్య వస్తే కూర్చుని అంతర్గంతంగా చర్చించు కుందామని చెప్పిజిల్లా కలెక్టర్లు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి మట్లాడి ఒప్పించాలన్నారు. మనం అందరం ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వంలో బాగమని మన మెరుగైన సేవలు ద్వారా సమాజాభివృద్ధికి కృషి చేయాల్సి ఉందని సిఎస్ డా.శర్మ పేర్కొన్నారు. ఉద్యోగులుగా మనకు ఏమైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించుకునేందుక ప్రభుత్వంలో ప్రత్యేక యంత్రాంగం ఉందని ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేయాలన్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఉద్యోగులు ఎమ్మెకు వెళితే దాని పరిణామాలు ఏవిధంగా ఉంటాయనేది ప్రతి ఉద్యోగి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యంగా కోవిడ్ తదిపరి పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్ళాలనుకునే విద్యార్ధులు, ఆసుపత్రుల నుండి బయటికి వచ్చే కరోనా రోగుల పరిస్థితులను, కోవిడ్ ఇబ్బందుల నుండి ఇప్పుడిప ఎ్పడే ఊపందుకుంటున్న వ్యాపార వాణిజ్య కార్య కలాపాలకు ఏవిధంగా ఇబ్బందులు కలుగుతాయో ఉహించుకోవాలని సిఎస్ ఉద్యోగులకు సూచించారు. అందరూ కలిసి పని చేద్దామని సమస్యలుంటే చర్చలు ద్వారా పరిష్కరించు కుందామని తెలియజేయాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top