ఏం చేసినా ఇక అంతే... ఉద్యోగులకు తేల్చి చెప్పిన ఏపీ సర్కార్.
* కరోనా వచ్చింది.. ఇప్పుడు ఒమిక్రాన్ వచ్చింది..ఆదాయం పడిపోయింది. ఈ కారణంగా ఉద్యోగుల జీతాలు అంతకు మించి ఇవ్వలేం.
* ఇదీ ఉద్యోగుల ఆందోళనలకు సిద్ధమవుతున్న సమయంలో ప్రభుత్వం సూటిగా.
* సుత్తి లేకుండా పంపిన సందేశం. సీఎస్ సమీర్ శర్మతో పాటు ఆర్థిక శాఖకు చెందిన ఉన్నతాధికారులతో ప్రెస్మీట్ ఏర్పాటు చేసి.. చెప్పాలనుకున్నది మూడు ముక్కల్లో చెప్పేశారు.
* కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిన్నదని.. ఖర్చులను ఆదాయాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.
* అందుకే అన్ని రకాలుగా ఆలోచించి న తర్వాతనే పీఆర్సీ ప్రకటించారు.
* మధ్యంతర భృతి కన్నా.. ఐఆర్ తక్కువగా ఇవ్వడంపై సీఎస్ భిన్నంగా స్పందించారు.
* ఐఆర్ జీతంలో భాగంగా చెప్పలేమన్నారు.
* అంత కంటే ఎక్కువ ఇవ్వాలన్న రూలేం లేదన్నారు.
* అయితే ఎన్ని బెనిఫిట్స్ కట్ చేసినా.. జీతం మాత్రం తగ్గబోదని సీఎస్ హామీ ఇచ్చారు. గ్రాస్ శాలరీ తగ్గకుండా చూస్తామన్నారు.
* ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ కూడా ఇంచుమించు ఇదే చెప్పారు.
* ఓ కుటుంబంలో ఆదాయఖర్చులు ఎలా చూసుకుంటారో.. ప్రభుత్వం కూడా అలాగే చూసుకోవాల్సి ఉందని.. జీతభత్యాల ఖర్చులు పరిధి దాటిపోయాయన్నారు.
* అందుకే పరిమితంగా ప్రయోజనాలు కల్పించాల్సి వచ్చిందన్నారు.
* గతంతో పోలిస్తే ఆదాయం పడిపోయిందన్నారు.
* కరోనా కష్టకాలంలోనూ రూ. పదిహేడు వేల కోట్ల ఐఆర్ ఇచ్చామన్నారు.
* మొత్తంగా ప్రభుత్వం స్పష్టమైన సంకేతాన్ని పంపింది.. ఎట్టి పరిస్థితుల్లోనూ హెచ్‌ఆర్‌ఏను మళ్లీ సాధారణ స్థితికి తేవడం కానీ.. ఫిట్మెంట్‌ను మార్చడం కానీ చేసేది లేదని తేల్చేసింది.
* ఇక ఏం చేయాలో ఉద్యోగుల చేతుల్లో ఉంది
0 Post a Comment:
Post a Comment