Friday, 14 January 2022

మూడు రోజుల పాటు వర్షాలు - వాతావరణ శాఖ హెచ్చరిక

 మూడు రోజుల పాటు వర్షాలు - వాతావరణ శాఖ హెచ్చరిక



బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనంతో ఇప్ప టికే వర్షం కురుస్తున్న ఈ నేపధ్యం మరో మూడు రోజుల పాటు కొనసాగనున్నది. గురువారం విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురిసిన సంగతి తెలిసిందే. శుక్రవారం కూడా కొన్ని చోట్ల చెదురుమొదురు వర్షం కురిసి నగరాన్ని తడిపేసింది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం మరో మూడు రోజుల పాటు ఇదే తీరులో వర్షం జిల్లాలో కురస్తుందనేది సమాచారం. నైరుతి బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఏర్పడినందున శుక్రవారం పలు చోట్ల వర్షం పెద్ద ఎత్తున కురిసింది. ఈ ఆవర్తనం ప్రస్తుతం నైతుతి బంగాళాఖాతం మీద సగటున సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించి ఉన్నందున ఈ ప్రభావం ఫలితం విశాఖ జిల్లాపైనా కనిపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా రాబోయే మూడు రోజుల పాటు పలు చోట్ల తేలిక పాటి జల్లు లేదా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కూడా కురిసే వీలుందని అంటున్నారు.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top