Sunday 2 January 2022

ఎస్‌ఏ-1 పరీక్షలకు సమాత్తం : ఎస్‌సీఈఆర్టీ మార్గదర్శకాలు జారీ

 ఎస్‌ఏ-1 పరీక్షలకు సమాత్తం : ఎస్‌సీఈఆర్టీ మార్గదర్శకాలు జారీ 




పాఠశాల విద్యార్థులకు సంగ్రహణాత్మక మూల్యాంకనం (ఎస్‌ఏ-1) పరీక్షల షెడ్యూలుతో పాటు నమూనా ప్రశ్నపత్రం(బ్లూ ప్రింట్‌)ను ఎన్‌సీఈఆర్టీ విడుదల చేసింది. ఈమేరకు ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. పరీక్షలు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు నిర్వహిస్తారు.

పరీక్షలు రాయడానికి 2.45 గంటల సమయం కేటాయించగా.. ప్రశ్నపత్రం చదివేందుకు 15 నిమిషాల సమయం కేటాయిస్తూ బ్లూప్రింట్లు విడుదల చేశారు. ఈ ఏడాది జిల్లాలో 1-10 తరగతులకు సంబంధించి మొత్తం 5,38,128 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 3,39,935 మంది ప్రభుత్వ, 1,98,193 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు. కాగా 1,76,381 మంది తెలుగు, 3,61,747 మంది ఆంగ్ల మాధ్యమంలో నమోదయ్యారు.

ఎస్‌ఏ-1 పరీక్షల షెడ్యూలు : 

1-5 తరగతులకు.. ఈ నెల 28న తెలుగు, 29న ఆంగ్లం, 31న గణితం, ఫిబ్రవరి ఒకటో తేదీన 3, 4, 5 తరగతులకు పరిసరాల విజ్ఞానం పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి.

6-10 తరగతులకు.. 6, 7, 8, 10 తరగతులకు 28న తెలుగు, 29న హిందీ, 31న ఆంగ్లం, వచ్చే నెల ఒకటో తేదీన గణితం, 2న 6,7 తరగతులకు జనరల్‌సైన్సు, 8, 10 తరగతులకు ఉదయం భౌతికశాస్త్రం, మధ్యాహ్నం జీవశాస్త్రం, 3న సాంఘికశాస్త్రం, 9వ తరగతికి 28న తెలుగు-1, 2, 29న హిందీ, 31న ఆంగ్లం-1, 2, వచ్చే నెల ఒకటో తేదీన గణితం-1, గణితం-2, రెండో తేదీన భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, 3న సాంఘికశాస్త్రం-1, 2 పరీక్షలు జరుగుతాయి. 4న కాంపోజిట్‌ కోర్సు పరీక్షలు ఉంటాయని మార్గదర్శకాల్లో వివరించారు. 6, 8, 10 తరగతులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు, ఏడో తరగతికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.45 వరకు పరీక్షలు జరుగుతాయి. తొమ్మిదో తరగతికి రెండు పూటలా నిర్వహిస్తారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top